తెలంగాణ

telangana

ETV Bharat / state

LIVE VIDEO : బుల్లెట్ బైక్​లో మంటలు - చల్లార్చుతుండగా పేలిన పెట్రోల్ ట్యాంక్ - 10 మందికి గాయాలు - Bike Tank Blast Video Hyderabad

Bike Tank Blast Live Video Hyderabad : రోడ్డుపై వెళ్తుండగా మంటలు రావడంతో బైకు ఆపిన వాహనదారుడు, వాటిని ఆర్పే ప్రయత్నంలో ఒక్కసారిగా బైకు పెట్రోల్ ట్యాంకు పేలింది. దీంతో 10 మందికి గాయాలు కాగా, అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన హైదరాబాద్​లోని పాతబస్తీలో చోటుచేసుకుంది.

Bike Petrol Tank Blast 10 Persons Injured
Bike Tank Blast in Hyderabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 12, 2024, 7:20 PM IST

Updated : May 12, 2024, 8:05 PM IST

బైకు మంటలు ఆర్పుతుండగా పెట్రోల్‌ ట్యాంకు బ్లాస్ట్​ - 10 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం (ETV Bharat)

Bike Tank Blast Live Video Hyderabad: ఓ వ్యక్తి బులెట్ బైక్​పై వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాటిని గమనించిన వాహనదారుడు వెంటనే బైక్​ ఆపి మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు. బైక్​ నుంచి మంటలు చూసిన స్థానికులు వాహనదారుడికి సాయంగా వచ్చారు. బైక్​పై నీళ్లు పోస్తున్న సమయంలో బైక్​ ట్యాంక్​ పేలి పోయింది. దీంతో చుట్టుపక్కల ఉన్న పరిసరాలకు మంటలు వ్యాపించాయి. సాయంగా వచ్చిన వారికి, వాహనదారుడికి గాయాలయ్యాయి. మొత్తం 10 మందికి గాయాలు కాగా, అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన హైదబాద్​లోని పాతబస్తీ భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

Bullet Bike Blast in Hyderabad: వివరాల్లోకి వెళితే, హైదరాబాద్​లోని పాతబస్తీ భవానీ నగర్ పీఎస్​ పరిధిలోని మొఘల్​పురా అస్లాం ఫంక్షన్ హాల్ సమీపంలో ఓ వ్యక్తి రోడ్డుపై బుల్లెట్​ వాహనంపై వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు వచ్చాయి. వాటిని గమనించిన ఆ వ్యక్తి, వెంటనే వాహనాన్ని పక్కకు ఆపి, దగ్గర ఉన్న నీళ్ల పైపుతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడు. బైక్ నుంచి చెలరేగుతున్న మంటలను చూసిన స్థానికులు అక్కడకి చేరుకుని వాహనదారుడికి సాయం చేశారు. వీరిలో ఓ కానిస్టేబుల్​ కూడా ఉన్నాడు. గోనె సంచితో కొందరు మంటలు ఆర్పేందుకు యత్నించారు. మరొకరు నీళ్ల పైపుతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేశారు.

పరిశ్రమలో బాంబ్​ బ్లాస్టింగ్ -​ బిహార్​ యువకుడు సజీవ దహనం - Man Burnt Alive in medchal

Bike Petrol Tank Blast 10 Persons Injured : స్థానికులతో పాటు బైక్ వాహనదారుడు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. ఈలోపు బుల్లెట్​ ఇంజిన్​ హీటెక్కింది. దీంతో ఒక్కసారిగా అది పేలిపోయింది. ఆ మంటలు మరింత పెద్దవై, చుట్టు పక్కలకు వ్యాపించాయి. బండి చుట్టూ సాయం చేస్తున్న స్థానికులు, వాహనదారుడు మంటల్లో చిక్కుకున్నారు. ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. గాయాలయిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న భవానీనగర్​ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను దగ్గరల్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అవసరమైన వారికి ప్రథమ చికిత్స అందించారు.

బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు- ఐదుగురు మహిళలు సహా 9మంది మృతి- మోదీ సంతాపం - Firecrackers Factory Blast

ఇంట్లో బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు, ముగ్గురికి తీవ్రగాయాలు - Blast In Fireworks Center

Last Updated : May 12, 2024, 8:05 PM IST

ABOUT THE AUTHOR

...view details