Bigg Boss Shanmukh Viral Video :బిగ్‌బాస్ ఫేం, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ ఇటీవల తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. తాజాగా తన సోదరుడు వినయ్ ఓ యువతిని మోసం చేసిన ఉదంతంలో షణ్ముఖ్ గంజాయితో పట్టుబడిన సంగతి తెలిసిందే. అతడిని అదుపులోకి తీసుకునే సమయంలోని పలు వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు షణ్ముఖ్ ఫ్లాట్‌కు వెళ్లిన పోలీసులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలో అతడు బాధితురాలితో మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలోషణ్ముఖ్, "నేనే డిప్రెషన్‌తో బాధపడుతున్నాను. చచ్చిపోదాం అనుకుంటున్నాను" అని మాట్లాడటం గమనించొచ్చు.
Youtuber Shanmukh Ganjayi Case Update : ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో అతడి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. షణ్ముఖ్ డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని తెలిసి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. మరోవైపు ఈ కేసులో అతడి తప్పేం లేదని, అతడి సోదరుడు చేసిన తప్పునకు అనవసరంగా అతడిని నిందిస్తున్నారని షణ్ముఖ్ తరఫున అభిమానులు సోషల్ మీడియాలో మద్దతు ప్రకటిస్తున్నారు. మరోవైపు ఇంకొందరు నెటిజన్లేమో అతడి తప్పేం లేకపోతే మెడికల్ టెస్టుల్లో తేలిపోతుంది కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
గంజాయితో పట్టుబడ్డ ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్
ఇదీ జరిగింది :రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలో షణ్ముఖ్ జస్వంత్ (Youtuber Shanmukh Viral Video) అతడి సోదరుడు సంపత్ వినయ్‌తో కలిసి నివసిస్తున్నాడు. యూట్యూబర్ అయిన షణ్ముఖ్‌కు వైజాగ్‌కు చెందిన ఓ వైద్యురాలితో పరిచయం ఉంది. అతడు ఆమెను తన సోదరుడు వినయ్‌కు కూడా పరిచయం చేశాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి పీటల వరకు వచ్చింది. ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి అంగీకరించి ఎంగేజ్‌మెంట్ కూడా చేశారు. కానీ యువతి తల్లి అనారోగ్యానికి గురి కావడంతో గతేడాది డిసెంబర్‌లో జరగాల్సిన వివాహం కాస్తా ఫిబ్రవి 24కు పోస్ట్‌పోన్ అయింది.