తెలంగాణ

telangana

ఖాతాదారులను మోసం చేసిన బ్యాంక్‌ మేనేజర్‌ - రూ.5 కోట్లు స్వాహా - Bank manager fraud in Nizamabad

By ETV Bharat Telangana Team

Published : Jul 17, 2024, 5:15 PM IST

Updated : Jul 17, 2024, 7:05 PM IST

Bank Manager Withdraw Depositors Money: నిజామాబాద్‌ జిల్లాలో యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ఖాతాదారులను మోసం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ మేనేజర్‌ అజయ్‌ పలువురు ఖాతాదారుల నుంచి భారీగా డబ్బు డ్రా చేసినట్లు అధికారులు గుర్తించారు. దాదాపు 40 మంది ఖాతాదారులను మోసం చేసివారి ఖాతాల నుంచి దాదాపు రూ.5 కోట్లు స్వాహా చేశాడు.

Bank Manager Withdraw Depositors Money
Bank Manager Withdraw Depositors Money (ETV Bharat)

Bank manager fraud in Nizamabad : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ బ్యాంక్ మేనేజర్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. జిల్లా కేంద్రంలోని బడా బజార్ బ్రాంచ్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ ఖాతాదారులకు రుణాల పేరుతో రూ.5 కోట్ల రూపాయాలు స్వాహా చేసాడు. సుమారు నలభై మంది ఖాతాదారులకు బ్యాంక్ మేనేజర్ చేతిలో మోసపోయినట్టు బాదితులు తెలిపారు. ఇప్పటికే కొందరు బాధితులు నాల్గో ఠాణా పోలీస్ స్టేషన్​లో బ్యాంక్ మేనేజర్​పై ఫిర్యాదు చేశారు.

రుణాలు ఇచ్చేందుకు పలువురి వద్ద నుంచి మేనేజర్‌ అజయ్‌ బ్లాంక్‌ చెక్కులు తీసుకున్నట్లు బాధితులు తెలిపారు. బ్లాంక్‌ చెక్కుల ఆధారంగా భారీగా డబ్బు డ్రా చేసుకున్నట్లు పేర్కొన్నారు. పలువురి ఖాతాల్లోకి లోన్‌ నగదు బదిలీ కాగానే డబ్బు డ్రా చేసినట్లు అధికారులు గుర్తించారు. గత రెండేళ్లుగా అజయ్‌ నిజామాబాద్‌లో పనిచేస్తున్నాడని తెలుస్తోంది. ఒక్కొక్కరి దగ్గర పది నుంచి ముప్పై లక్షల వరకు టోకరా వేశాడని బాదితులు వాపోతున్నారు. బాధితులు ఇచ్చిన పిర్యాదు మేరకు పరారీలో ఉన్న బ్యాంక్ మేనేజర్​పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వ్యాపార విస్తరణ నిమిత్తం బడా బజార్ బ్రాంచ్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్​ని కలిశాను. నా ఆస్తులను తనఖా పెట్టుకొని 50 శాతం లోన్ ఇచ్చారు. 40 లక్షల రావాల్సి ఉండగా, కేవలం ఇరవై లక్షల లోన్ ఇచ్చి మిగతా 20 లక్షలను మేనేజర్ తన ఖాతాలకు మళ్లించుకున్నారు. నాకు రావాల్సిన సీసీ లోన్స్ పూర్తిగా డ్రా చేశారు. బ్యాంక్​లో జరిగిన అక్రమాలపై ఆర్వోను సంప్రదించాం. వారం రోజుల్లో న్యాయం చేస్తామని ఆర్వో చెప్పారు. వారం రోజులు గడిచినా స్పదించలేదు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశా.బాధితుడు

బ్యాంకు మేనేజర్ చేతివాటం- ఖాతాదారుల పేర్లు మీద లోన్లు, బంధువుల అకౌంట్లలోకి రూ3 కోట్లు

Last Updated : Jul 17, 2024, 7:05 PM IST

ABOUT THE AUTHOR

...view details