Bandi Sanjay Visit Rama Temple : రాముల వారి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. తనతో పాటు వచ్చిన నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అయోధ్య ఆలయ రామ మందిరం నిర్మాణంలో విరాళాల సేకరణలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉందని తెలిపారు. ఈ నెల 22న ప్రాణప్రతిష్ఠ ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించి ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా జరుగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులకు బాస్మతి అక్షింతలు కావాలంటే ప్రత్యేకంగా తయారు చేసి రాముల వారి దగ్గర పెట్టి ఇస్తామని ఎద్దేవా చేశారు.
కేసీఆర్కు భాజపా భయం పట్టుకుంది: బండి సంజయ్
Bandi Sanjay on Ayodhya Ram Mandir Arrangements : కొంత మంది అధికారులు స్థానిక నాయకుల ఒత్తిడి తట్టుకోలేక ఈ నెల 22న సమీక్ష సమావేశాలు, మీటింగ్‌లు పెడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఇది పవిత్ర కార్యక్రమం అని పార్టీలకు చోటు లేదని అన్నారు. ఆరోజున ప్రత్యక్షంగా చూసేందుకు ప్రత్యేక తెరలు ఏర్పాటు చేస్తామని, అందులో ప్రత్యక్ష ప్రసారం వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నమని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. అందరూ ఆ రోజున అయోధ్యకు వస్తే రద్దీ పెరుగుతోందని సలహా ఇచ్చారు. ఈ నెల 23 నుంచి సాధారణ భక్తులకు దర్శనానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.