Nandamuri Balakrishna Response About Padmabhushan Honour :గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పద్మ పురస్కారాల్లో తనకు పద్మభూషణ్ వరించడంపై ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. పద్మభూషణ్ పురస్కారం రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అనేక సందేశాత్మక సినిమాలను చేశానన్న ఆయన క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేలాది మందికి వైద్య సేవలు అందించిట్లుగా తెలిపారు. తన సేవలను గుర్తించి పద్మభూషణ్‌ను ప్రకటించడంపై ఆయన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం రావడంపై అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా అభినందనలు తెలుపుతున్నారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి వారి రంగాల్లో రాణించాలని ఆయన కోరారు.
"పద్మ భూషణ్ పురస్కారం రావడం సంతోషంగా ఉంది. అనేక సందేశాత్మక సినిమాలను చేశాను. క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా వేలాదిమందికి వైద్యం అందించాము. నా సేవలను గుర్తించి పద్మభూషణ్‌ను ప్రకటించినటువంటి కేంద్రానికి కృతజ్ఞతలు. పురస్కారం నాలో మరింత స్ఫూర్తి నింపుతుంది. ఈ పురస్కారాన్ని బాధ్యతగా భావిస్తున్నాను. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనేది తెలుగు ప్రజల కోరిక"- నందమూరి బాలకృష్ణ, ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే