తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​పై పెట్టుబడుల వర్షం - రూ.3320 కోట్లతో 'ఆరమ్‌ ఈక్విటీ' గ్రీన్ డేటా సెంటర్ - AURUM EQUITY INVESTS IN HYDERABAD - AURUM EQUITY INVESTS IN HYDERABAD

Green Data Centre in Hyderabad : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి అమెరికా పర్యటనకు భారీగా స్పందన లభిస్తోంది. రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఆరమ్ ఈక్విటీ పార్ట్​నర్స్​ చేరింది. హైదరాబాద్​లో దాదాపు రూ.3,320 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది. ఇందులో భాగంగా నెక్ట్స్​-జనరేషన్, ఏఐ పవర్డ్ గ్రీన్ డేటా సెంటర్‌‌‌‌ నిర్మించనున్నట్టు ప్రకటించింది.

CM Revanth America Tour Investments
Aurum Equity Partners Investment in Hyderabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 10, 2024, 10:25 AM IST

Updated : Aug 10, 2024, 10:43 AM IST

Aurum Equity Partners Investment in Hyderabad : రాష్ట్రంలో పెట్టుబడులకు అమెరికాలోని పలు కంపెనీలు ముందుకొస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి బృందం పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతోంది. హైదరాబాద్​లో 400 మిలియన్ డాలర్లు (సుమారు 3,320 కోట్ల రూపాయలు) పెట్టుబడులు పెట్టేందుకు ఆరమ్ ఈక్విటీ పార్టనర్స్ ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లో నెక్స్ట్-జనరేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పవర్డ్ గ్రీన్ డేటా సెంటర్‌ నిర్మించనున్నట్లు ప్రకటించింది. దశలవారీగా ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది.

హైదరాబాద్​లో గ్రీన్​ డేటా సెంటర్​ : అమెరికా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​బాబుతో సంస్థ సీఈవో, ఛైర్మన్ వెంకట్ బుస్సా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ సంస్థ నెలకొల్పే అధునాతన డేటా సెంటర్‌తో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ సేవల మధ్య అంతరం తగ్గుతుందని ఛైర్మన్ వెంకట్ బుస్సా వివరించారు. ఈ-సేవ, ఈ-పేమెంట్, ఈ -ఎడ్యుకేషన్ వంటి ప్రభుత్వ సేవలు అందరికీ అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

యాపిల్‌ ప్రతినిధులతో సీఎం రేవంత్‌ భేటీ - ఏఐ, ఫ్యూచర్ సిటీ తదితర ప్రాజెక్టులపై చర్చలు - CM REVANTH AMERICA TOUR

అనంతరం తెలంగాణలో తమ విస్తరణ ప్రణాళికలతో పాటు భారీ పెట్టుబడులను కంపెనీ ప్రకటించింది. గత ఏడాది దాదాపు రూ.400 కోట్ల పెట్టుబడులకు తమ వార్షిక ప్రణాళికను ప్రకటించగా, ఇప్పుడు తమ ప్రణాళికలను భారీగా విస్తరించింది. 100 మెగావాట్ల అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ను స్థాపించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి దాదాపు రూ. 3320 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడింది.

CM Revanth On America Tour Investments : మరోవైపు హైదరాబాద్‌లో ఏఐ ఆధారిత గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవటం సంతోషకరమని, దీనివల్ల భారీగా ఉద్యోగాలు లభిస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికే డేటా హబ్‌గా ఎదుగుతున్న హైదరాబాద్​కు ఈ పెట్టుబడులు మరింత వృద్ధిని తెచ్చిపెడుతాయని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.

ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు భారీగా స్పందన లభించింది. ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే 11 కంపెనీలు పెట్టుబడులకు ముందుకురాగా, తాజా ఈక్విటీ సంస్థతో మరింతగా రాష్ట్రాభివృద్ధికి దోహదపడినట్లైంది. ప్రముఖ కంపెనీలు ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు, వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు అంగీకరించాయి.

హైదరాబాద్​లో వివింట్ ఫార్మా రూ.400 కోట్ల పెట్టుబడులు - 1000 మందికి ఉద్యోగాలు - VIVINT PHARMA INVESTMENT IN HYD

Last Updated : Aug 10, 2024, 10:43 AM IST

ABOUT THE AUTHOR

...view details