ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పులి సంచారం - రాత్రిపూట ఆ వ్యాధి పరీక్షలకు ఆటంకం - TIGER SIGHTING IN TELANGANA STATE

తెలంగాణ ఆసిఫాబాద్​లో పులి సంచారం - సర్వేను నిలిపేసిన వైద్యాధికారులు - సర్వే కోసం గ్రామస్తుల ఎదురు చూపులు

BODAKALU SURVEY PROBLEMS IN ASIFABAD DISTRICT
TIGER SIGHTING IN TELANGANA STATE (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 21, 2024, 10:49 PM IST

Survey Halted After Tiger Sighting In Telangana:బోదకాలు సోకిందంటే నివారణ ఉండదేమో కానీ దానికి నియంత్రణ మార్గం మాత్రం ఉంటుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తులు జీవితమంతా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ వ్యాధికి నివారణ ఒక్కటే ఏకైక మార్గం. ఇది ముందుగా గుర్తిస్తే దీనికి అడ్డుకట్ట వేయగలం. అందుకు సంబంధించిన సర్వే రాత్రివేళల్లో చేస్తుండగా పులి సంచార భయంతో మధ్యలోనే సర్వేను అధికారులు నిలిపివేసిన ఉదంతం తెలంగాణలోని ఆసిఫాబాద్​ జిల్లాలో చోటు చేసుకుంది. అందువల్ల అక్కడి ప్రజలు ఇంకా ఎప్పుడెప్పుడు సర్వే చేస్తారోనని ఎదురు చూస్తున్నారు.

ఈ జిల్లాలోని మురుగువాడలకు, మారుమూల గ్రామాలకు బోదకాల మాత్రలు సరఫరా చేసినా ఇంకా మందులు తీసుకోని ప్రాంతాలను వైద్యులు గుర్తించారు. బృందాల ద్వారా అక్కడ సర్వే చేయాలని వైద్యశాఖ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. మొత్తం 12 గ్రామాలను ఎంచుకొని ఒక్కో గ్రామంలో 300 చొప్పున రక్త నమూనాలు సేకరించేలా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఈనెల 5, 6వ తేదీల్లో రెండు రోజుల్లో నాలుగు గ్రామాలను సర్వే చేసి 1,200 రక్త నమూనాలను సేకరించారు. కానీ పులి సంచారం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులకు అధికారులు సూచించారు. దీంతో సర్వేను నిరవధికంగా నిలిపివేశారు. అయితే ఇప్పటికే సేకరించిన నమూనాలను పరీక్షించగా అన్నింటికీ కూడా సానుకూల ఫలితాలు వచ్చాయి.

రాత్రి వేళ్లలోనే బోదకాల పరీక్షలు:ఇందుకు సంబంధించిన పరీక్షలను రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు మాత్రమే చేస్తారు. బోదకాలు క్యూలెక్స్​ ఆడదోమ కాటుతోనే సోకుతుంది. దీనిలోని మైక్రో ఫైలేరియా సూక్ష్మజీవి వ్యాధికి కారణం అవుతోంది. అయితే కుట్టిన వెంటనే వ్యాధి అనేది సోకదు. కనీసం 10 నుంచి 15 ఏళ్లు పడుతుంది. ఈ వ్యాధి కారకాలు రాత్రివేళలోనే మనిషి రక్తంలో కదలాడుతాయి. అందుకే రాత్రివేళ రక్త నమూనాలు సేకరిస్తారు.

ఈ విధంగా పరీక్షలు చేసిన తర్వాత ఒకవేళ పాజిటివ్​ వస్తే మాత్రలు ద్వారా వ్యాధి సోకకుండా నియంత్రించవచ్చు. లక్షణాలు బయటపడిన తరువాత నివారణ అసాధ్యం. శరీరంలో ఏ భాగానికి సోకిందో అక్కడ తరచూ శుభ్రంగా నీటితో కడగాలి. అనంతరం కొంతసేపు బ్యాండేజీ కట్టుకోవాలి. మళ్లీ మందు రాసుకోవాలి. ఆల్బెండజోల్​, ఐవర్​ మెక్టిన్​, డీఈసీ రకాల మాత్రలను వేసుకోవాలి. ఇవి వేసుకోవడంతో వ్యాధి అక్కడికే ఆగిపోతుంది. లేనివారికి సోకే అవకాశం ఉండదు అని వైద్యాధికారులు వెల్లడించారు.

పులిని పరిగెత్తించిన మహిళ - భర్తను కాపాడుకోవడానికి ధైర్యసాహసాలు

పులి మళ్లీ వచ్చింది! - తూర్పు గోదావరి జిల్లాలో హడలెత్తిస్తున్న బెబ్బులి

ఏలూరు జిల్లాలో పెద్దపులి కలకలం- కంటిమీద కునుకు లేదంటున్న ప్రజల

ABOUT THE AUTHOR

...view details