Aroori Ramesh Joined BJP :వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆరూరి రమేశ్ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. కాగా శనివారం ఆయన బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఆయన కాషాయ కండువా కప్పుకోవడంతో ఇన్ని రోజులు పార్టీ మారతారనే తతంగానికి ఎట్టకేలకు తెరపడింది. వరంగల్ పార్లమెంట్ ఎంపీ సీటు ఆశించి ఆయన బీజేపీలో చేరినట్లు సమాచారం.
"భారత దేశంలో అన్ని వర్గాల అభివృద్ధితోపాటు, 30 సంవత్సరాల పోరాటం తర్వాత మోదీ నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ అందుబాటులోకి వస్తుంది. అందుకే నేను బీజేపీలో చేరాను. మోదీ నాయకత్వంలో దేశ భద్రత 10 సంవత్సరాలుగా బ్రహ్మాండంగా పాలన అందించారు. అవినీతిరహిత పాలనలో దేశం ముందుకు పోతుంది." - ఆరూరి రమేశ్, బీజేపీ నేత
BRS Ex MLA Aroori Ramesh In BJP : వరంగల్ ఎంపీ స్థానంపై ఆశలు పెట్టుకున్న ఆరూరి రమేశ్‌కు బీఆర్ఎస్ అధిష్ఠానం సీటు కేటాయించలేదు. అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీ మారుతారన్న విషయం చక్కర్లు కొట్టింది. వరంగల్ పార్లమెంట్ స్థానానికి ఆరూరి రమేశ్ బీజేపీ తరఫున పోటీ చేయనున్నట్లు ప్రచారం బాగా జరిగింది. ఇదే విషయం మీడియాకు వెల్లడించేందుకు ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆయన నివాసానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య వెళ్లారు. బీఆర్ఎస్ను నుంచి వెళ్లొద్దంటూ ఆరూరిని బుజ్జగించే ప్రయత్నం చేశారు.
బీఆర్ఎస్కు మరో షాక్ - చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా - కాంగ్రెస్‌లో చేరిక!