తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో​ 'అగ్నివీర్​ రిక్రూట్​మెంట్​' ర్యాలీ - 8వ తరగతి పాసైతే చాలు - ARMY AGNIVEER RECRUITMENT

రాష్ట్రంలో డిసెంబరు 8 నుంచి 16వ తేదీ వరకు ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్​మెంట్​ ర్యాలీ - వివరాలు వెల్లడించిన ఆర్మీ అధికారులు

Army Agniveer Recruitment Rally
Army Agniveer Recruitment Rally (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 23, 2024, 7:34 PM IST

Army Agniveer Recruitment Rally : భారత ఆర్మీలో చేరడానికి రాష్ట్ర యువతకు గొప్ప అవకాశం. హైదరాబాద్​లో 'అగ్నివీరుల రిక్రూట్​మెంట్​' ర్యాలీని భారతీయ ఆర్మీ నిర్వహించనుంది. ఇందుకు హైదరాబాద్​ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్​ స్టేడియం వేదిక కానుంది. ఈ ఆర్మీ రిక్రూట్​మెంట్​ ర్యాలీ డిసెంబరు 8 నుంచి డిసెంబరు 16వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆర్మీ రిక్రూట్​మెంట్​ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన యువకులను సైన్యంలో అగ్నివీరులుగా చేర్చుకోవడానికి రిక్రూట్​మెంట్​ ర్యాలీకి ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

విద్యార్హతలు :కొన్ని పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణత, మరికొన్ని పోస్టులకు 8వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.

డ్యూటీలు : అగ్నివీర్​ జనరల్​ డ్యూటీ, అగ్నివీర్​ టెక్నికల్​, అగ్నివీర్​ క్లర్క్​/స్టోర్​ కీపర్​, అగ్నివీర్​ ట్రెడ్స్​ మెన్​

Note :అగ్నివీర్​ జనరల్​ డ్యూటీ, అగ్నివీర్​ టెక్నికల్​, అగ్నివీర్​ క్లర్క్​/స్టోర్​ కీపర్ ఉద్యోగాలకు 10వ తరగతి ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది.

Note :అగ్నివీర్​ ట్రెడ్స్​ మెన్​కు 8వ తరగతి ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది.

అలాగే మహిళా మిలిటరీ పోలీస్​ (డబ్ల్యూఎంపీ) అభ్యర్థులకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు, పుదుచ్చేరి నుంచి మహిళా మిలిటరీ పోలీసు అభ్యర్థులకు ఫిబ్రవరి 12, 2024 నాటి ర్యాలీ నోటిఫికేషన్​ ప్రకారం ర్యాలీ జరిగే ప్రదేశానికి అన్ని డాక్యుమెంట్లను తీసుకురావాలని బోర్డు సూచించింది. రిక్రూట్​మెంట్​ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా ఉంటుందని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details