Aquarium Demand Increasing in Hyderabad Real Estate :ఉరుకుల పరుగుల జీవితం. మనసుకు కాసింత ఉపశమనం కలిగేది ఇంట్లోనే. ఎవరైనా ఒత్తిడిని నుంచి ఉపశమనం పొందాలంటే మనసుకు తగినంత విశ్రాంతి కావాలి. ఇందుకు ఇంట్లో అక్వేరియం దోహదం చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఈదులాడే రంగురంగుల చేపలను కొద్దిసేపు తీక్షణంగా చూస్తే మనసులు ఆహ్లాదం కలిగి తద్వారా రక్తపోటు తగ్గుతుందని అంటారు. ఈ కారణంగానే వీటిపై నగరవాసుల్లో ఆసక్తి పెరుగుతోంది. కొందరు ఇంట్లో పెద్దపెద్ద అక్వేరియంలు ఏర్పాటు చేసుకొంటున్నారు. వ్యక్తిగత నివాసాలు, విల్లాలు, డూప్లెక్స్ ఇళ్లలో సాధారణంగా ఇవి చూస్తుంటాం.
చోటు చాలని చిన్న చిన్న ఇళ్లలో చిన్నపాటి గాజు పాత్రల్లోను అక్వేరియంలో ఉంటాయి. సముద్రపు లోతుల్లోని అంతచందాల నమూనాలను అక్వేరియంలో ఏర్పాటు చేసి, రంగురంగుల చేపలను పెంచుతుంటారు. విభిన్న జాతుల చేపలు ఒక్కదగ్గరికి చేరి కనివిందు చేస్తుంటాయి. వీటికి క్రమం తప్పకుండా ఆహారం వేయాలి. ఇన్‌ఫెక్షన్ సోకకుండా మందులు, ఆక్సిజన్ అందేలా చూడాలి. సరైన పద్ధతిలో నిర్వహణ ఉంటేనే ఇంటికి అందంతో పాటు మనసుకు ఉల్లాసంగా ఉంటుంది.
పక్షులు, జంతువులనూ ప్రేమగా పెంచుకోవడమే కాదు - ఇంటి అలంకరణలోనూ భాగం చేయొచ్చు!
- ఎండ వేడిమికి తట్టుకోలేక ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలతో మనుషులు ఎలా సేదతీరుతారో, చేపలకు కూడా చల్లటి వాతావరణ ఏర్పాటు చేయాలి. ఎప్పుడూ నీటిలోనే ఉన్నప్పటికి అక్వేరియానికి ఎండ వేడిమి ప్రభావం పడకుండా చూడాలి. ఇందుకోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- కొందరు చేపల పెట్టేలో బోరు నీరు, ఇతరత్రా నీటిని పోస్తుంటారు. శుభ్రమైన ఫిల్టర్ నీటిని ఉపయోగించడం మంచిది. దీంతో సహజ నీటిలో ఉంటే నైట్రేట్, అమ్మోనియా పోషకాలు అధిక మొత్తంలో కాకుండా సమపాళ్లలో చేపలకు అందుతాయి.
Aquarium Demand Increasing in Hyderabad Real Estate (ETV Bharat) - సాధారణ రోజుల్లో వారం లేదా పది రోజులకోసారి అక్వేరియం క్లీన్ చేయాలి. వేసవిలో మాత్రం నీటిని రోజూ మారుస్తుండాలి. ఇలా చేస్తే చేపలు కొత్త నీటిని ఆస్వాదించడంతో పాటు వాటి శరీరం చల్లగా ఉండేందుకు దోహదపడుతుంది. నీటిని మాత్రం సాయంత్రం పూట మారిస్తే శ్రేయస్కరం.
- అక్వేరియంలో తప్పనిసరిగా ఎయిర్ పంప్‌ను అర్చుకోవాలి. దీన్ని ఏర్పాటు చేయడం వల్ల చేపలకు నిరంతరం ఆక్సిజన్ అందుతుంది.
- అక్వేరియం అందంగా కనిపించడం కోసం రంగు రంగుల లైట్లను, కొందరైతే నైట్ ట్యూబ్‌లైట్లను అమరుస్తుంటారు. వీటివల్ల వేసవిలో నీరు వేడిగా మారుతుంది. పగలు లైట్లను తీసేసి, అవసరమైతే రాత్రి పూట వేసుకోవచ్చు.
Aquarium Demand Increasing in Hyderabad Real Estate (ETV Bharat) - ఇంటికి కీటికీలను తెరచి ఉంచడం వల్ల వేడిగాలి చేపల పెట్టెకు తగిలే అవకాశం ఉంటుంది. తద్వారా చేపలు చనిపోయే ప్రమాదముంది. కిటీకీలను మూసి ఉంచి, అక్వేరియంను చల్లటి ప్రదేశానికి మార్చాలి. చేపల పెట్టే వేడి కాకుండా చిన్న సైజులో ఉంటే క్లిప్ ప్యాన్‌ను ఉపయోగించి పెట్టెను చల్లగా ఉంటే ప్రయత్నం చేయవచ్చు. అలాగే అక్వేరియంలో ఉండే ఫిల్టర్‌ను తరచూ శుభ్రం చేస్తుండాలి.
- వీలైనంత వరకు అక్వేరియం పరిమాణాన్ని బట్టి సరిపడే చేపలనే అందులో పెంచాలి, ఎక్కువ సంఖ్యలో ఉంచడం వల్ల నీరు తొందరగా పాడవడంతో పాటు వేడి పెరుగుతుంది.
ఇలా చేశారంటే - మీ చిన్న ఇల్లు కూడా పెద్దగా, అందంగా కనిపిస్తుంది!
మీ ఇంట్లో ఇలాంటి ఫొటో ఫ్రేమ్స్ ఉంటే వెంటనే తీసివేయడం బెటర్ - లేదంటే కష్టాలు తప్పవు! - Vastu Tips For Home Decoration