New Ration Cards And Pensions In AP : ఏపీ ప్రజలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కొత్తగా రేషన్ కార్డు, పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం ఓ అవకాశం కల్పిస్తుంది. డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకు అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. చాలా ప్రభుత్వ పథకాలకు రేషన్‌కార్డు ఓ ప్రామాణికం అయింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే పింఛన్‌ను రూ.4వేలు చేయడంతో అర్హులంతా తమకు అవకాశం ఎప్పుడు వస్తుందా ఎదురు చూస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఫించన్లకు దరఖాస్తులు స్వీకరించడంతో అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారందరి కోసం దరఖాస్తులన్నీ పరిశీలించి అర్హులైన వారికి కొత్తగా కార్డులు, పింఛన్లను సంక్రాంతి కానుకగా ప్రభుత్వం ఇవ్వనుంది.
వైసీపీ హయాంలో దక్కని వారికి అవకాశం : గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఎంతోమంది అర్హులున్నా, కొంతమందికి పింఛన్ మంజూరు చేయలేదు. అసలు దరఖాస్తులే స్వీకరించలేదు. అటు రేషన్‌కార్డులు కూడా అంతే. వైసీపీ హయాంలో రేషన్‌కార్డు జారీ ప్రక్రియను పట్టించుకోలేదు. చేర్పులు మార్పులు కూడా చేయలేదు. దీంతో చాలా మంది ప్రభుత్వ పథకాలకు దూరమయ్యారు. దీంతో కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు.