ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేషన్​ మాఫియా జాతీయస్థాయి కుంభకోణం - హడావుడి కాదు, నిగ్గు తేల్చాలి : షర్మిల - YS SHARMILA ON RATION MAFIA

ఏపీలో రేషన్‌ బియ్యం విదేశాలకు తరలింపు పెద్ద మాఫియా అని పేర్కొన్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల - ప్రత్యేక దర్యాప్తు కమిటీ వేయాలని డిమాండ్

YS_Sharmila
APCC Chief YS Sharmila on Ration Mafia (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 2, 2024, 3:37 PM IST

APCC Chief YS Sharmila on Ration Mafia: ఆంధ్రప్రదేశ్​లో పీడీఎస్ (Public Distribution System) రైస్ విదేశాలకు తరలించడం పెద్ద మాఫియా అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ఇదో జాతీయ స్థాయి కుంభకోణమని అన్నారు. పేదల పొట్టకొట్టి 48 వేల కోట్ల రూపాయల ప్రజల డబ్బును పందికొక్కుల్లా తినేసిన దోపిడీ అని విమర్శించారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు, రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉందని ఆరోపించారు.

బోట్లు వేసుకొని సముద్రంలో హడావుడి చేయడం కాదు: కింద నుంచి ఉన్నత స్థాయి వరకు కొంతమంది అవినీతి అధికారుల పాత్ర ఉందని అన్నారు. ఎవరికి దక్కాల్సిన వాటా వాళ్లకు చేరుతుండటంతో నిఘా వ్యవస్థ పూర్తిగా కళ్లుమూసుకుందని అన్నారు. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలోని పోర్టుల నుంచి 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అయ్యిందంటే మన చెక్ పోస్టుల పని తీరు ఏంటో అంచనా వేయొచ్చని షర్మిల వ్యాఖ్యానించారు. ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. అక్రమ బియ్యాన్ని పట్టేందుకు ప్రభుత్వం బోట్లు వేసుకొని సముద్రంలో హడావుడి చేయడం కాదని, నిజాలు నిగ్గు తేల్చాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బెదిరించి అరబిందోకు వాటా రాయించుకున్నారు- తరువాతే రూ.45 వేల కోట్ల బియ్యం ఎగుమతి

బియ్యం దొంగలెవరు?: పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా పోర్టు దాకా ఎలా చేరుతుందని ప్రశ్నించారు. మూడేళ్లలో 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యాన్ని ఎలా సేకరించారని ప్రశ్నించారు. దీని వెనకున్న బియ్యం దొంగలెవరు? రూ.48 వేల కోట్లు ఎవరెవరు తిన్నారని అన్నారు. అప్పటి ప్రభుత్వ పెద్దలకు బియ్యం మాఫియాతో సంబంధాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. తీగ లాగితే వెనకున్న డొంక ఎక్కడ, మిల్లర్ల చేతివాటం ఉందా, రేషన్ డీలర్ల మాయాజాలమా అని నిలదీశారు. అనునిత్యం తనిఖీల సంగతి ఏంటి, నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని అన్నారు.

రాష్ట్రాన్ని రేషన్ బియ్యం మాఫియాకు అడ్డాగా మార్చారు: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు కమిటీ వేయాలని, లేదంటే కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్‌ చేశారు. ఆంధ్రపదేశ్ అంటే అన్నపూర్ణమ్మ అని, ధాన్యాగారానికి భాండాగారమని అన్నారు. ప్రపంచానికి అన్నం పెట్టే మన రాష్ట్రాన్ని రేషన్ బియ్యం మాఫియాకు అడ్డాగా మార్చారన్నారు. ఎంతో కష్టపడి పండించే రైతుకు దక్కేది కన్నీళ్లు అయితే, బియ్యం అక్రమార్కులకు దక్కుతున్నవి కాసులు అని, ఇదీ మన రాష్ట్ర దుస్థితి అని షర్మిల వ్యాఖ్యానించారు.

బియ్యం అక్రమ ఎగుమతి వెనక పెద్దవాళ్లు - ఓడలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు: పవన్ కల్యాణ్​

ABOUT THE AUTHOR

...view details