Police interrogating To Varra Ravindra Reddy For Two Days Custody : వివేకా కుమార్తె సునీతతోపాటు షర్మిల, విజయమ్మ, చంద్రబాబు, లోకేశ్, పవన్ పై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన పులివెందులకు చెందిన వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కడప కోర్టు అనుమతితో రెండ్రోజుల కస్టడీలో భాగంగా పులివెందుల పోలీసులు కడప జైలులో ఉన్న రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని కోర్టు ఆదేశాల మేరకు ఉదయం 9 గంటలకే పోలీసులు వర్రాని అదుపులోకి తీసుకున్నారు.
జైలు నుంచి నేరుగా రిమ్స్‌కి వెళ్లి వైద్య పరీక్షలు పూర్తిచేసుకుని కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చారు. అనంతరం వర్రా రవీందర్ రెడ్డిని పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ ప్రశ్నిస్తున్నారు. న్యాయవాది ఓబుల్ రెడ్డి సమక్షంలో కడప సైబర్ క్రైమ్ పీఎస్‌లో వర్రాను విచారిస్తున్నారు. వర్రా పై జిల్లాలో 10 కేసులు, రాష్ట్ర వ్యాప్తంగా 40 కేసులు నమోదయ్యాయి. నవంబర్ 8న వర్రా రవీందర్‌రెడ్డిపై నమోదైన అట్రాసిటీ కేసులో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో అధికార పార్టీ నేతలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టడానికి కుట్ర దారులు ఎవరనేదానిపై లోతుగా విచారించడానికి వర్రా రవీందర్‌రెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు ప్రశ్నించనున్నారు.
అవినాష్‌రెడ్డి పీఏ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత - 16 రోజులుగా పరారీలోనే
"ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారో?" - అజ్ఞాతంలోకి 'పులివెందుల' వైఎస్సార్సీపీ నేతలు