Fruit Salad Recipe in Telugu : మహా శివరాత్రి అంటేనే ఉపవాసం, జాగరణ. శివభక్తులకు అత్యంత పవిత్రమైన ఈ రోజున చాలా మంది ఉపవాసం ఉంటారు. ఈ క్రమంలో రాత్రి పండ్లు, ఉడికించిన చిలగడ దుంప వంటి వాటిని స్వీకరిస్తారు. ఈ మహా శివరాత్రి సందర్భంగా ఇంట్లోనే సులభంగా చేసుకునే ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- చిక్కటి పాలు - లీటర్
- అరటి పండు - 2
- యాపిల్ పండు - 2
- ద్రాక్షపండ్లు - కప్పు
- దానిమ్మ గింజలు - కప్పు
- బొప్పాయి ముక్కలు - కప్పు
- వెనీలా కస్టర్డ్ పౌడర్ - 4 టేబుల్‌స్పూన్లు
- డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టమైనవి - అరకప్పు
- చక్కెర - రుచికి సరిపడా
"వర్క్ ఫ్రమ్ హోమ్" అడిగితే ఉద్యోగం తీసేశారు! - కట్ చేస్తే, కోటి పరిహారం అందుకుంది!
తయారీ విధానం :
- ముందుగా ఒక చిన్నె గిన్నెలో కొన్ని పాలను తీసుకుని అందులో వెనీలా కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
- ఆపై కట్ చేసిన బొప్పాయి ముక్కలు, దానిమ్మ గింజలు, ద్రాక్షపండ్లను కాసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. (ఇలా ఫ్రిడ్జ్‌లో ఉంచిన పండ్ల ముక్కలను ఫ్రూట్ సలాడ్‌లో వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది.)
- ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి పాలు పోయండి. ఇందులో కొన్ని నీళ్లను పోసి మరిగించండి.
- పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత అందులో చక్కెర వేసి కరగించండి. ఆపై ముందుగా కలిపి పెట్టుకున్న వెనీలా కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని కలుపుకోవాలి. (ఇక్కడ పాలను మీడియం ఫ్లేమ్‌లో మరిగించుకోవాలని గుర్తుంచుకోండి.)
- పాలు కాస్త చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఈ పాల మిశ్రమం పూర్తిగా చల్లారివ్వండి.
- అనంతరం ఫ్రిడ్జ్‌లో ఉంచిన పండ్ల ముక్కలు, అలాగే ఫ్రెష్‌గా కట్ చేసిన అరటి పండు, యాపిల్ పండ్ల ముక్కలను వేసి ఒకసారి కలపండి.
- ఈ ఫ్రూట్ సలాడ్ని చిన్న గిన్నెలోకి తీసుకుని పైన మీకు నచ్చిన ఢ్రైఫ్రూట్స్ వేసుకోండి.
- అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే కమ్మటి ఫ్రూట్ సలాడ్ మీ ముందుంటుంది.
- ఈ మహా శివరాత్రి రోజు ఫ్రూట్ సలాడ్ మీరు ఇలా ట్రై చేయండి.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుని విగ్రహం ఎక్కడ ఉందో తెలుసా? - నిర్మించడానికే పదేళ్లు పట్టిందట
పాకిస్థాన్‌లోని శివాలయంలో అద్భుతం - శివ మహిమను గుర్తించిన అక్కడి హిందువులు!