Vijayawada Man Excelling in Bodybuilding : ఆటలంటే ఆసక్తి ఉన్నా అందులో రాణించాలంటే ఎంతో శ్రమించాలి. ముఖ్యంగా బాడీబిల్డింగ్ వంటి క్రీడల్లో శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటంతోపాటు పౌష్టికాహారం తీసుకోవాలి. అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అవేమీ తన ఆశయానికి అడ్డుకాదని భావించాడు ఈ యువకుడు. జిమ్ ట్రైనర్‌గా పార్ట్‌టైం జాబ్ చేస్తూనే బాడీబిల్డింగ్‌లో జాతీయ స్థాయి పతకాలు సాధిస్తున్నాడు.
జిమ్‌లో సాధన చేస్తున్న ఈ బాడీబిల్డర్ పేరు చింతపల్లి దుర్గాప్రసాద్. విజయవాడకు చెందిన కనకారావు, చిన్ని దంపతుల పెద్ద కుమారుడు. ఇంటర్ పూర్తయ్యాక ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అంతలోనే కరోనా రావడంతో స్థానిక కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. ప్రస్తుతం పీబీ సిద్దార్థ కాలేజీలో యోగా డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి ఆటలంటే చాలా ఇష్టం దుర్గాప్రసాద్‌కి. అందులోనూ శారీరక సామర్థ్యం పెంచుకునే క్రీడలంటే ఎక్కువ ఆసక్తి చూపేవాడు.
Durga Prasad in Bodybuilding : దుర్గాప్రసాద్ తరచూ మైక్ టైసన్ వీడియోలు చూసి బాక్సింగ్‌పై మక్కువ పెంచుకున్నాడు. ఐజీఎంసీ స్టేడియంలోని డీఎస్ఏ శిక్షణ కేంద్రం కోచ్ ఇసాక్ దగ్గర బాక్సింగ్‌లో ఓనమాలు నేర్చుకున్నాడు. అలా రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించాడు. దుర్గాప్రసాద్ బాబాయ్ రాజు సలహాతో బాడీబిల్డింగ్‌లోకి అడుగుపెట్టాడు. 2020లో శిక్షణ తీసుకుని సాధన చేయడం మొదలు పెట్టాడు. సౌత్ఇండియా బాడీబిల్డింగ్ జూనియర్, సీనియర్ విభాగాల్లో పసిడి పతకాలు సాధించాడు. జూనియర్ విభాగంలో ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ టైటిల్ కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు 16 స్వర్ణం, 4 రజతం, 2 కాంస్య పతకాలు సొంతం చేసుకున్నట్లు చెబుతున్నాడు.
లాక్డౌన్ రాకముందు బాక్సింగ్ ఆడేవాడిని. కరోనా తర్వాత బాడీబిల్డింగ్‌లోకి అడుగుపెట్టాను. 2020లో శిక్షణ తీసుకుని సాధన చేస్తున్నాను. సౌత్ఇండియా బాడీబిల్డింగ్ జూనియర్, సీనియర్ విభాగాల్లో పసిడి పతకాలు సాధించాను. జూనియర్ విభాగంలో ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ టైటిల్ కూడా సొంతం చేసుకున్నాను. ఇప్పటివరకు 16 స్వర్ణం, 4 రజతం, 2 కాంస్య పతకాలు సాధించాను. - దుర్గాప్రసాద్, బాడీబిల్డర్
కుటుంబ సభ్యుల ప్రోత్సాహం : బాడీబిల్డింగ్‌లో రాణించడం అంటే ఆశామాషీ కాదు. నిత్య వ్యాయామం చేయాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. అందుకు చాలా ఖర్చవుతుంది. ఈ నేపథ్యంలో తన ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు జిమ్‌లో ట్రైనర్‌గా చేరాడు ప్రసాద్. స్వీట్లు, జంక్‌ఫుడ్ పూర్తిగా మానేసి ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నాడు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లే బాడీబిల్డింగ్‌లో రాణిస్తున్నట్లు చెబుతున్నాడు.
కుమారుడి ఆసక్తిని గుర్తించి క్రీడలవైపు నడిపించామని దుర్గాప్రసాద్ తల్లిదండ్రులు అంటున్నారు. ప్రతిరోజు ఐదారు గంటలు సాధన చేస్తున్నాడని చెబుతున్నారు. సొంత ఖర్చులతోనే పోటీలకు వెళ్తూ పతకాలు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి చేరుకునేలా ప్రోత్సహిస్తామని పేర్కొంటున్నారు. ఓ వైపు స్టూడెంట్ మరోవైపు జిమ్ ట్రైనర్ ఇంకోవైపు బాడీబిల్డర్ ఇలా అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు ఈ యువకుడు. లక్నోలో జరగబోయే 14 జాతీయ స్థాయి ఫెడరేషన్‌కప్, ఆల్ఇండియా యూనివర్సిటీ పోటీల్లో పతకం సాధించడమే లక్ష్యమని చెబుతున్నాడు.
లక్కీ లాక్డౌన్ - ఐసీఎన్ మిస్టర్ ఇండియా మన వైజాగ్ యువకుడే - Pawan Vizag Got Mister India Title
8ఏళ్లకే పెళ్లి.. బాడీబిల్డింగ్‌తో సెకండ్ ఇన్నింగ్స్.. అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్