AP SSC Results 2024 update : ఆంధ్రప్రదేశ్ పదోతరగతి వార్షిక పరీక్షలకు హాజరై ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్ధిని, విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మార్చి18 నుంచి మార్చి 30 వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్ష ఫలితాలు అన్నీ అనుకూలిస్తే ఈ నెల 25(ఏప్రిల్)నే ప్రకటించేలా సన్నద్ధం అవుతున్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పరీక్ష ఫలితాల విడుదలకు కూడా ఈసీ అనుమతి తప్పనిసరి. అధికారులైతే ఏప్రిల్ 25 ఫలితాల విడుదల టార్గెట్‌గా పెట్టుకున్నారు. 25 విడుదలకు ఒకవేళ ఎన్నికల సంఘం నుంచి అనుమతులు రావడం ఆలస్యమైతే నెలాఖరుకు గ్యారెంటీగా విడుదల చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
'నాకు మార్కులు వేయకపోతే - మా తాతతో చేతబడి చేయిస్తా' - టీచర్‌కు టెన్త్ విద్యార్థి వార్నింగ్
ఇప్పటికే పూర్తయిన మూల్యాంఖనం :ఏపీలో మార్చి18 నుంచి మార్చి 30 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు దాదాపు 6,30,633 మంది విద్యార్థులు హాజరయ్యారు. 3473 పరీక్షా కేంద్రాల్లో విద్యార్ధిని, విద్యార్ధులు పరీక్షలు రాశారు. పరీక్షల ప్రక్రియ ముగిసిన వెంటనే అధికారులు మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించి ఈ నెల 8తేదీతోనే ముగించారు. జవాబుపత్రాలను మరోసారి పరిశీలించి, మార్కుల నమోదు, కంప్యూటీకరణ ప్రక్రియను కూడా ఇప్పుటికే దాదాపు పూర్తి చేశారు.
ఇంకా పేపర్ వర్క్ కార్యక్రమాన్నిపూర్తి చేస్తున్నారు. విద్యార్థులు ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద్‌ను పరీక్ష ఫలితాలపై ఈటీవీ భారత్ ప్రతినిధి సంప్రదించారు. గతేడాది మే-6న ఫలితాలు వెల్లడించామని అంతకంటే ముందే ఈ సంవత్సర వార్షిక ఫలితాలు వెల్లడిస్తామని డైరెక్టర్ దేవానంద్ చెప్పారు.