Boat Removal Operation on 9th Day : ప్రకాశం బ్యారేజి గేట్ల వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న విజయవంతంగా ఒక బోటును అధికారులు బయటకు తీయగలిగారు. ప్రస్తుతం రెండు పెద్ద బోట్లు, ఒక చిన్నబోటు నీటిలో ఇరుక్కొని ఉన్నాయి, వీటిని తీయడం సవాల్‌గా మారింది. దిశ మారిస్తే తప్ప బోటును అక్కడ నుంచి కదిల్చే అవకాశం లేదు. రేపు(గురువారం) మిగతా బోట్ల ద్వారా రెండో బోటును బయటకు తీసే ప్రక్రియ చేపట్టనున్నారు. | Read More
ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 18 September 2024
Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Wed Sep 18 2024- దిశ మార్చుకునే లోపే నీట మునిగిన రెండొ బోటు - కొనసాగుతున్న తొలగింపు ప్రక్రియ - BOAT REMOVAL OPERATION
![Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Wed Sep 18 2024 Etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-09-2024/1200-675-etv-bharat-andhra-pradesh-live-updates.jpg)
By Andhra Pradesh Live News Desk
Published : Sep 18, 2024, 8:00 AM IST
|Updated : Sep 18, 2024, 9:15 PM IST
దిశ మార్చుకునే లోపే నీట మునిగిన రెండొ బోటు - కొనసాగుతున్న తొలగింపు ప్రక్రియ - BOAT REMOVAL OPERATION
దీపావళికి ఉచిత గ్యాస్ ఇస్తాం - ఒక్కొక్కటిగా అన్ని పథకాలు అమలు చేస్తాం: సీఎం చంద్రబాబు - CM Chandrababu on Free Gas
CM Chandrababu on Free Gas Cylinders Distribution Scheme: సూపర్ 6లో భాగంగా ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని దీపావళి సందర్భంగా అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. మంత్రివర్గ భేటీలో చాలా సమస్యలకు శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు. సంక్షేమ పథకాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అమలుచేస్తామని హామీ ఇచ్చారు. | Read More
కొంచెం ఆలస్యం కావచ్చు కానీ, తప్పు చేసినవారు తప్పించుకోలేరు: సీఎం చంద్రబాబు - Chandrababu Speech in NDA Meeting
CM Chandrababu Speech in NDA legislative Party Meeting: పవన్ కల్యాణ్ నిజమైన పోరాట యోధుడని సీఎం చంద్రబాబు కొనియాడారు. ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేసిందని, కేంద్ర నిధులను పక్కదారి పట్టించిందని విమర్శించారు. తప్పు చేసినవాడు ఎటువంటి పరిస్థితుల్లో తప్పించుకోలేడని, కొంచెం ఆలస్యమైనా అవ్వచ్చు కానీ శిక్ష పడాల్సిందేనని హెచ్చరించారు. | Read More
వెయ్యి కోట్లతో అమరావతి రైల్వే లైన్ - పనులు వేగవంతం - New Amaravati Railway Line
Railway Department on Amaravati Railway Line: అమరావతి నూతన రైల్వేలైన్ కోసం 510 ఎకరాల భూములు అవసరమని రైల్వే శాఖ గుర్తించింది. అమరావతి నుంచి పెదకూరపాడు వరకు 24.5 కి.మీ, సత్తెనపల్లి నుంచి నరసరావుపేట వరకు 25 కి.మీ. మేర ప్రతిపాదించారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి ఆసక్తి చూపకపోతే 2013 భూ సేకరణ చట్టం ప్రకారం సేకరించాలని రెవెన్యూ యంత్రాంగం భావిస్తోంది. | Read More
సీఎం సహాయనిధికి రూ.300 కోట్లు - దాతలకు మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు - Donors Cheques to Minister Lokesh
Donors Present Cheques to Minister Nara Lokesh For Vijayawada Flood Victims at Undavalli Residence : వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు దాతలు విరాళాలు అందిస్తూ దాతృత్వం చాటుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సీఎంఆర్ఎఫ్కు రూ. 300 కోట్లకు పైగా వచ్చాయి. ఇంకా దాతలు తమ వంతు సాయం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేశ్‌ను కలిసి పలువురు చెక్కులు అందించారు. | Read More
చంద్రబాబు ఓపిక ఆశ్యర్యపరుస్తోంది - సీఎం నాయకత్వంలో పని చేయడం సంతోషం: పవన్ కల్యాణ్ - PAWAN KALYAN ON CM CHANDRA BABU
Pawan Kalyan Comments on CM Chandrababu : చంద్రబాబు నాయకత్వంలో పని చేయడం చాలా సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. కేవలం 100 రోజుల్లో చాలా హామీలు నెరవేర్చామన్నారు. ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతుగా వస్తే నన్ను చాలా ఇబ్బంది పెట్టారన్నారు. కూటని నేతల సమష్టి కృషితోనే ఎన్నికల్లో భారీ మోజార్టీతో గెలిచామని తెలిపారు. చంద్రబాబుకు భయం లేదు, ఆయన్ని ఎన్ని అవమానాలకు గురిచేసినా అధైర్య పడలేదని కొనియాడారు. సంక్షేమంలో తిరుగులేని చరిత్ర సృష్టించామని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశంలో పవన్ పవన్ కల్యాణ్ పాల్కొన్నారు. | Read More
వైఎస్సార్సీపీకి షాక్ - బాలినేని రాజీనామా - BALINENI SRINIVAS REDDY RESIGN
Balineni Srinivas Reddy resigned to YSRCP: తనకు ప్రాధాన్యం ఇవ్వని పార్టీలో కొనసాగలేనంటూ నేరుగా ఆ పార్టీ అధినేత జగన్‌కే చెప్పిన బాలినేని అన్నంత పని చేశారు. నిన్నామొన్నటి వరకు ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ పెద్దన్నలా వ్యవహరించిన బాలినేని ఇప్పుడు పార్టీకి షాక్ ఇచ్చారు. వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. | Read More
సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ - పలు అంశాలపై చర్చ - AP Cabinet Meeting Today
Andhra Pradesh Cabinet Meeting : ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఈ భేటీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రిమండలిలో పలు అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. | Read More
'భూమి కాజేసి ఇంట్లోంచి వెళ్లగొట్టారు - అన్నక్యాంటీన్లో తిని బతుకుతున్నా' - Public Grievances At TDP Party
Public Grievences At TDP Party Office in Mangalagiri : నవ మాసాలు మోసి కని పెంచి, సమాజంలో ప్రయోజకులుగా మారిన తమ పిల్లలను చూసుకుని తల్లిదండ్రులు మురిపిపోతుంటారు. పిల్లల అనురాగం, మనవడు, మనవరాళ్లు ఆప్యాయత మధ్య తమ ఆఖరి రోజులను గడపాలని కన్నవారు కలలు కంటారు. కానీ పిల్లల ఆప్యాయత కాదు కదా వారిని మోసం చేసి పట్టేడు అన్నం లేకుండా చేస్తున్నారు. | Read More
కాకినాడ వైద్యుల ప్రతిభ - 'అదుర్స్' మూవీ చూపిస్తూ రోగికి బ్రెయిన్ ఆపరేషన్ - Kakinada GGH Rare Brain Surgery
Kakinada GGH Rare Brain Surgery : 'సినిమా చూపిస్తూ సర్జరీ' వినేందుకు కొంచెం ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజమేనండీ. ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్న మహిళా రోగికి ఇష్టమైన సినిమా చూపిస్తూ సర్జరీని విజయవంతగా జరిపారు వైద్యులు. క్లిష్టమైన సర్జరీ అనగానే అందరికీ టక్కున గుర్తుచ్చేదీ కార్పొరేట్ ఆసుపత్రే కానీ, తెలివికి, టాలెంట్‌కు ఢోకా లేని ఎంతోమంది అత్యుత్తమ వైద్యులు ప్రభుత్వం ఆసుపత్రుల్లోనూ విధులు నిర్వహిస్తుంటారు. ఇదే విషయాన్ని కాకినాడలోని సర్వజన ఆసుపత్రి వైద్య బృందం తాజా సర్జరీతో నిరూపించారు. అరుదైన చికిత్స చేసి వైద్యులు ఓవైపు ప్రశంసలందుకుంటుంటే, మరోవైపు సినిమాల ప్రభావం మామూలుగా లేదు కదా అంటూ నెటిజన్లు అవాక్కవుతున్నారు. | Read More
రుషికొండపై కాటేజీలు కూల్చివేత - విచారణ అధికారిగా మాజీ మంత్రి రోజా ఓఎస్డీ - Rushikonda Cottages Demolition
Rushikonda Cottages Demolition Inquiry : విశాఖలో ప్రాజెక్టుల కేటాయింపులపై జగన్‌కు అనూకులంగా ఉన్న అధికారులు మరోసారి ఉడతా భక్తిని చాటుకుంటున్నారు. ఇందులో అక్రమాలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ క్రమంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులు వింత పోకడకు తెరలేపారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులకే విచారణ బాధ్యతలు అప్పగించడం గమనార్హం. | Read More
జెట్ స్పీడ్‌లో భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు - డిసెంబర్ నాటికి టెర్మినల్ పూర్తి - Bhogapuram Airport Works
Bhogapuram Airport Works Updates: ఎన్డీయే ప్రభుత్వం రాకతో భోగాపురం విమానాశ్రయం పనులు ఊపందకున్నాయి. మరోవైపు సీఎం చంద్రబాబు వరుస సమీక్షలతో అడ్డంకులు తొలుగుతున్నాయి. ఇందులో భాగంగానే డిసెంబర్ నాటికి టెర్మినల్ పూర్తి కానుంది. | Read More
వైఎస్సార్సీపీ నాయకులు వేధిస్తున్నారు - మంత్రి లోకేశ్ బాధితుల మొర - Nara Lokesh Praja Darbar
Nara Lokesh Praja Darbar : నారా లోకేశ్ చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రజాదర్బార్‌కు విన్నపాలు వెల్లువెత్తాయి. ప్రతి ఒక్కరి నుంచి లోకేశ్ వినతులు స్వీకరించారు. వారి సమస్యలు ఓపికగా విని వాటిని పరిష్కరిచేందుకు కృషి చేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. | Read More
ఏలూరు జిల్లాలో వార్డెన్ భర్త ఆకృత్యాలు - ఫొటోషూట్‌లంటూ బాలికలపై లైంగిక దాడి - Eluru Girls Hostel Incident
Eluru Girls Hostel Incident: మహిళలు, చిన్నారులపై కామాంధుల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒకచోట వారిపై లైంగిక దాడులు, అత్యాచారాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా వసతిగృహం ముసుగులో బాలికలపై ఓ వార్డెన్ భర్త లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. | Read More
చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు - నేడు కేబినెట్ ముందుకు దస్త్రం - 33 Percent BC Reservation in AP
33 Percent BC Reservation in AP: చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంబంధిత దస్త్రాన్ని నేడు రాష్ట్ర మంత్రివర్గం ముందుకు తీసుకురానుంది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై ప్రత్యేక తీర్మానం చేసిన కేంద్రానికి పంపనున్నారు. అలాగే 26 జిల్లాల్లో బీసీ భవన్‌లతోపాటు 68 కాపు భవనాలు నిర్మించనున్నారు. | Read More
లైంగిక వేధింపుల ఆరోపణలు - కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు తెలుగు ఫిలిం ఛాంబర్ షాక్ - Film Chamber reacts on Jani Master
Jani Master Controversy: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ ఉదంతంపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయగా, టాలీవుడ్‌లోని లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ కూడా తీవ్రంగా స్పందించింది. కొరియోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షుడి బాధ్యతల నుంచి జానీ మాస్టర్‌ను తాత్కాలికంగా తప్పించాలని సిఫారసు చేసిన కమిటీ, పని ప్రదేశాల్లో మహిళలకు చలన చిత్ర పరిశ్రమ ధైర్యాన్ని ఇవ్వలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. చిత్ర పరిశ్రమలో మహిళలు వేధింపులకు గురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కమిటీ స్పష్టం చేసింది.. | Read More
అధికారుల తప్పిదాలు - పోలవరం నిర్వాసితుల జీవితాల్లో తొలగని కష్టాలు - POLAVARAM COMPENSATION problems
Polavaram Residents Compensation Problems in AP: పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన తమకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదంటూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన తరగతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికుల కుటుంబాలకు పునరావాస ప్యాకేజీని అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వాపోతున్నారు. | Read More
మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ - సరసమైన ధరలకే లిక్కర్ అందించేలా కొత్త ఎక్సైజ్ పాలసీ - ఆ రోజు నుంచే అమలు - New Liquor Policy in AP
New Excise Policy in AP: ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నూతన మద్యం విధానంలో సరసమైన ధరలకే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. అక్టోబర్ 4,5 తేదీల్లో కొత్త మద్య విధానం అమల్లోకి రానుండటంతో దుకాణాల కోసం దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వ ఆదాయం పాలకుల జేబుల్లోకి వెళ్లిందని ఆక్షేపించింది. నాసిరకం బ్రాండ్లు తెచ్చి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడారని మండిపడింది. కొత్త మద్యం విధానంలో గీత కార్మికులకు 10 శాతం వైన్ షాపులు కేటాయించాలని ప్రతిపాదించినట్టు పేర్కొంది. | Read More
విజయవాడ రైల్వేస్టేషన్‌కు అరుదైన ఘనత - ఎన్‌ఎస్‌జీ1గా గుర్తింపు - NSG 1 designation for Vijayawada
Vijayawada Railway Station Receives NSG 1 Status in AP: దక్షిణ మధ్య రైల్వేలోనే అత్యంత కీలకమైన విజయవాడ రైల్వే జంక్షన్‌కు అరుదైన గుర్తింపు లభించింది. ఉత్తర, దక్షిణ భారతదేశాలను అనుసంధానించడంలో కీలకమైన విజయవాడ స్టేషన్ దేశంలోనే టాప్ రైల్వే స్టేషన్ల సరసన చేరుతూ ఎన్‌ఎస్‌జీ (NSG-1) గుర్తింపు సాధించింది. అత్యధిక మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంతోపాటు అధిక ఆదాయం ఆర్జించడంలో ముందువరసలో నిలిచింది. ఎన్‌ఎస్‌జీ 1 గుర్తింపు దక్కడంతో కేంద్రం నుంచి మరిన్ని నిధులు రానున్నాయి. | Read More