Constable Attempted Suicide Due to YSRCP Leader Harassment: అధికారంలో ఉన్నా లేకపోయినా వైఎస్సార్సీపీ నేతల వేధింపులకు అడ్డుకట్ట పడట్లేదు. సామాన్యల నుంచి అధికారుల వరకూ ఎందరూ వారి బాధితులే. తాజాగా నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ నేత వేధింపులతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. కాగా అతని పరిస్థితి విషమంగా ఉంది. | Read More
ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 17 September 2024
Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Tue Sep 17 2024- ఆగని వెఎస్సార్సీపీ నేతల వేధింపులు - కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం - YSRCP Leaders Harassment
By Andhra Pradesh Live News Desk
Published : Sep 17, 2024, 8:00 AM IST
|Updated : Sep 17, 2024, 10:33 PM IST
ఆగని వెఎస్సార్సీపీ నేతల వేధింపులు - కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం - YSRCP Leaders Harassment
గిరిజనుల భూమిపై వైఎస్సార్సీపీ దందా - ప్రశ్నించినందుకు రెండేళ్లుగా గ్రామ బహిష్కరణ - tribal land occupy ysrcp leader
Encroachment of tribal lands under YSRCP Leader Support : ఆధునిక కాలంలో గ్రామ బహిష్కరణలు పూర్తిగా తగ్గాయి. కానీ వైఎస్సార్సీపీ భూదాహం వల్ల అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం పెదనూతులులో ఓ మహిళ బహిష్కరణకు గురైంది. గత కొంత కాలంగా తాను సాగు చేసుకుంటున్న భూమిని తప్పుడు పత్రాలతో లాక్కునేందుకు యత్నించారని బాధితురాలు ఆరోపించారు. | Read More
'ఫేక్ జగన్ నువ్వు మారవు - నీ ఫేక్ మూకలు అస్సలు మారరు' - Sandhya rani Son Birthday Video
Minister Lokesh About Sandhya rani Son Birthday Video Issue : గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కొడుకు పుట్టిన రోజు వేడుకలపై వచ్చిన పలు తప్పుడు ప్రచారాలను మంత్రి ఖండించారు. ఈ నేపథ్యంలో మంత్రి లోకేశ్ స్పందిస్తూ ఇటువంటి ప్రచారాలు చేస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలకు తగిన విధంగా బుద్ది చెప్తామని అన్నారు. | Read More
భారీ వర్షాలు, వరదలు - కొట్టుకుపోయిన వంతెనలు, రోడ్లు - Heavy Rains in Alluri District
Heavy Rains and Floods in Alluri District: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అల్లూరి జిల్లాలో రహదారులు, వంతెనలు, కల్వర్టులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. అనేక ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల కొద్ది రహదారులు దెబ్బతిన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టింది. | Read More
రాష్ట్రంలో రహదారులపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ - 100 రోజుల యాక్షన్ ప్లాన్ - 100 Days Action Plan for Roads
AP Government 100 Days Action Plan for Roads: ఏపీ వ్యాప్తంగా రోడ్లపై గతుకులు అనేవే లేకుండా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. ఇప్పటికే నిధులు మంజూరు చేసినందున, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. | Read More
చైనాలో ఏపీ, తమిళనాడు MBBS విద్యార్థులకు జైలుశిక్ష - న్యాయం జరిగేలా చూస్తానని కేంద్రమంత్రి హామీ - MBBS Students Arrested in China
AP Students Arrested in China: చైనాలో జైలు శిక్ష అనుభవిస్తున్న తమ కుమారులను కాపాడాలంటూ బాధిత తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. 18 నెలలుగా జైల్లోనే ఉన్నారని, అత్యాచారం చేసినట్లు వారిపై తప్పుడు కేసు బనాయించారని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మకు వినతిపత్రం అందజేశారు. వివరాలన్నీ తెలుసుకున్న కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. | Read More
భక్తులకు నాణ్యమైన ఆహారం అందించపోతే కఠిన చర్యలు: టీటీడీ ఈవో శ్యామలరావు - TTD EO Syamala Rao on hotels
TTD EO Syamala Rao Warning to Hotels Shopkeepers: తిరుమలలో హోటళ్ల దుకాణదారులు ఆహార భద్రతా నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే తిరుమలలో ఒక హోటల్‌ను మూసివేశామని గుర్తు చేశారు. తిరుమలలో సౌకర్యాలు బాగలేవని తప్పుడు ఆరోపణలు చేయడం వల్ల అధికారుల ఆత్మసైర్యం దెబ్బ తింటుందని అన్నారు. భక్తులకు టీటీడీ అందిస్తున్న ఆహారం రుచి, నాణ్యతను పరిశీలించారు. | Read More
పంచాయతీ ఖాతాల్లో నిధులు జమ - నీళ్లు, వీధిదీపాలు, పారిశుద్ధ్యం పనులు వేగవంతం - Panchayati Raj Funds Released in AP
Panchayati Raj Funds Released in AP : వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసింది. కేంద్రం ఇచ్చిన 14, 15వ ఆర్ధిక సంఘం నిధులను సర్పంచులకు, కార్యదర్శులకు తెలియకుండా జేబులో వేసుకుంది. వాటి ఆర్థిక మూలాలకు గండికొట్టి, అభివృద్ధిని అడ్డుకుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పంచాయతీలకు నేరుగా నిధులు విడుదల చేసింది. పల్లెలకు జీవం పోసింది. | Read More
బై బోలో గణేశ్ మహరాజ్‌కీ - గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపతి - Khairatabad Ganesh Nimajjanam 2024
Ganesh Immersion in Hussain Sagar 2024 : వెళ్లి రావయ్యా గణపయ్య, మళ్లీ రావయ్యా లంబోదరా అంటూ ఖైరతాబాద్ సప్తముఖ మహా గణపతిని భక్తులు గంగమ్మ ఒడికి సాగనంపారు. అశేష భక్తుల పూజలందుకున్న బడా గణేశుడి నిమజ్జనం, ఘనంగా పూర్తైంది. శోభాయాత్ర ఆద్యంతం కనులవిందుగా సాగింది. మహాగణపతికి అడుగడుగునా భక్తులు నీరాజనం పలికారు. భారీ విజ్ఞాధిపతిని హుస్సేన్‌సాగర్‌లో నిజ్జమనం చేయడంతో మహాఘట్టం సంపూర్ణమైంది. | Read More
ఎనిమిదో రోజు బోట్ల తొలగింపు ప్రక్రియ షూరూ - రంగంలోకి దిగిన అధికారులు - Prakasam Barrage Boat Incident
Prakasam Barrage Boat Incident Updates : ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ వరుసగా ఎనిమిదో రోజు కొనసాగుతోంది. బోట్లను ఒడ్డుకు తెచ్చేందుకు ఇంజినీర్లు, అధికారులు, నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రెండు బోట్లను గడ్డర్లతో కలిపి చిక్కుకున్న బోట్లను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ పనులను మంత్రులు నిమ్మల రామానాయుడు, అనిత పరిశీలించారు. | Read More
ప్రభుత్వ భూమిలో గ'లీజు' దందా- భారీగా పెనాల్టీ - YSRCP Leader Quarry Seized
Officers Seized Quarry in Kadiri : జగన్ పాలనలో జరిగిన అక్రమాలు ఒక్కొటిగా వెలుగు చూస్తున్నాయి. మనదే ప్రభుత్వం, మనల్ని అడిగిదే ఎవరు అన్న రీతిలో అక్రమార్కులు చెలరేగిపోయారు. సత్యసాయి జిల్లాలో ఓ వైసీపీ సానుభూతిపరుడు లీజుకు తీసుకున్న భూమిలో కాకుండా, పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలోను తవ్వకాలు జరిపాడు. ఫిర్యాదులతో రంగంలోకి దిగిన అధికారులు, సదరు క్వారీపై భారీగా పెనాల్టీ వేశారు. | Read More
ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర - మధ్యాహ్నం 2 గంటలకల్లా గంగమ్మ ఒడిలోకి గణనాథుడు - Khairatabad Ganesh Nimajjanam 2024
Khairatabad Ganesh Shobhayatra 2024 : నవరాత్రులు పూజలందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడిలోకి చేరుకుంటున్నాడు. పది రోజుల పాటు పార్వతీ తనయునికి పూజలు చేసిన భక్తులు, కన్నుల పండువగా గజముఖున్ని గంగమ్మ దగ్గరికి సాగనంపుతున్నారు. ఈ మేరకు చివరి పూజ సోమవారం సాయంత్రం నిర్వహించారు. సకాలంలో నిమజ్జనం పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసున్నామని ఉత్సవ కమిటీ ప్రతినిధి మహేశ్ యాదవ్ తెలిపారు. ఇవాళ ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవ్వగా, మధ్యాహ్నం 2 గంటల వరకు నిమజ్జనం పూర్తి అవుతుందని పోలీసులు చెప్పారు. | Read More
అమెరికాలో బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలు - Balakrishna 50 years
Balakrishna 50 years Golden Jubilee Celebrations At America : నందమూరి బాలకృష్ణ తన వెండితెర ప్రయాణంలో 50 ఏళ్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా అమెరికాలో స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారు. బోళ్ల, తరణి పరుచూరి అధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. బాలయ్య అభిమానులు కేక్ కట్ చేసి జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. | Read More
"గణేశ్ నిమజ్జనోత్సవం" మెట్రో వేళల పొడిగింపు- హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు - Metro Train Timings
Metro Train Timings are Extended : హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనాల దృష్ట్యా మెట్రోరైలు సమయం పొడిగించారు. అన్ని మార్గాల్లో అర్ధరాత్రి ఒంటి గంటలకు చివరి ట్రిప్ బయల్దేరనుండగా 2 గంటల వరకు గమ్యం చేరనున్నాయి. | Read More
రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్ - కత్తులు, కర్రలతో వీరవిహారం - Ganja Batches Attack
Ganja Batches Attack Each other in Guntur District : గుంటూరు జిల్లాలో గంజాయి బ్యాచ్‌లు వీరంగం సృష్టించాయి. ఒకరిపై ఒకరు కత్తులు, సీసాలు, కర్రలతో పరస్పరం దాడులకు దిగాయి. ఈ సంఘటనలో నలుగురు గాయపడ్డారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీస్ అధికారులు తెలియజేశారు. | Read More
మోపిదేవిలో వడ్డీ వ్యాపారి దారుణ హత్య - 'చంటి చంటి' అంటూ మృతి - Moneylender Murder in Mopidevi
Moneylender Brutal Murder in Mopidevi : కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వడ్డీ వ్యాపారి గొంతు కోసి నిందితుడు పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో నిందితుడు బీచ్ సమీపంలో దుకాణాల వద్ద కుప్పకూలి మృతి చెందాడు. దీనిపై బాపట్ల గ్రామీణ పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. | Read More
గతేడాది రూ.27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ - ఈసారి ఎంత పలికిందంటే? - Balapur Laddu Auction 2024
Balapur Laddu Auction 2024: గణేశుడి పండుగంటే గల్లీ నుంచి దిల్లీ వరకు మాములుగా ఉండదు. ఈ ఉత్సవాల్లో లడ్డూ వేలం పాట ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇందులోనూ వేలంలో రికార్డు స్థాయి ధరతో ప్రత్యేక గుర్తింపు పొందాడు బాలాపూర్ గణేశుడు. గతేడాది రూ.27 లక్షలు పలికిన ఈ లడ్డూను, ఈసారి రూ.30.1 లక్షలకు కొలను శంకర్ రెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నారు. | Read More
రక్షించాల్సిన పోలీసులే రాంగ్ రూట్ - కేసు లేకుండానే యువకుడిపై దాడి - Guntur Police Violated Rules
Guntur Police Harassing A Young Man : క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పోలీసు శాఖలో కొందరి తీరు కంచే చేను మేసిన చందంగా మారుతోంది. ప్రజలకు భద్రత కల్పించాల్సిన కొందరు రక్షకభటులు అడ్డదారులు తొక్కుతున్నారు. కాసుల యావలో కుటుంబ, ఆర్థిక వివాదాల్లో తలదూర్చుతున్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఆ శాఖ ప్రతిష్ఠకే మచ్చతెస్తున్నారు. తాజాగా ఓ కేసులో గుంటూరు పోలీసులు గీత దాటి ప్రవర్తించడం కలకలం రేపింది. | Read More
దండి కుటీర్‌ను సందర్శించిన సీఎం చంద్రబాబు - CM Chandrababu Visit Dandi Kutir
గుజరాత్‌లోని గాంధీనగర్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు జాతిపిత మహాత్మాగాంధీ జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన 'దండి కుటీర్'ను సందర్శించారు. పునరుత్పాదక ఇంధన పెట్టుబడులపై సదస్సు సందర్భంగా దండి కుటీర్‌ను సందర్శించాల్సిందిగా చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. భావితరాలు స్ఫూర్తిదాయకమైన, విలువలతో కూడిన జీవితాన్ని గడిపేలా మార్గదర్శనం చేసేలా దండి కుటీర్‌ను నిర్మించిన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. | Read More
మున్నేరు వరద మిగిల్చిన నష్టం - 50 గ్రామాలకు నిలిచిన తాగునీటి సరఫరా - Drinking Water Schemes Damage
మున్నేరు వరద సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. గతంలో ఎన్నడూ లేనంతగా వరద పోటెత్తడంతో ఇళ్లు, పంట పొలాలు కొట్టుకుపోయాయి. ఇప్పుడు వరద తగ్గడంతో నష్టం అంచనాలు లెక్కకు మించిపోతున్నాయి. ముఖ్యంగా మున్నేరుపై ఉన్న తాగునీటి పథకాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. వరద బీభత్సానికి పైపులు, మోటార్లు కొట్టుకుపోయాయి. ఫలితంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో సుమారు 50 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. | Read More
'నా మాటే వినరా అంటూ' ఓ ప్రిన్సిపల్ నిర్వాకం - విద్యార్థినులతో రోజుకు 100కు పైగా గుంజీలు - Rampachodavaram Principal Issue
Students Sick After Sit ups in Rampachodavaram : విద్యార్థులను తమ సొంత పిల్లల వలే భావించి గురువులు విద్యాబుద్ధులు నేర్పిస్తారు. వారు ఏదైనా తప్పు చేస్తే వారిని సరైన దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ ఓ ప్రిన్సిపల్ తన మాట వినడం లేదనే కారణంతో విద్యార్థినుల పట్ల మూర్ఖంగా ప్రవర్తించింది. క్రమశిక్షణ పేరుతో వారికి దండన విధించింది. ఈ ఘటన అల్లూరి సీతరామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. | Read More
వెళ్లిరావయ్యా గణపయ్యా - ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేసిన భక్తులు - GANESH IMMERSION IN ap
Lord Ganesh Immersion Celebrations in AP : రాష్ట్రవ్యాప్తంగా వినాయకుడి నిమజ్జనం కార్యక్రమాలు పెద్దఎత్తున జరిగాయి. నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథులను భక్తులు ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమాల్లో చిన్నారులు, పెద్దలు నృత్యాలతో హోరెత్తించారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. | Read More
ఏకంగా రూ.1.87 కోట్లు పలికిన గణేశ్ లడ్డూ ధర - ఎక్కడో తెలుసా? - Bandlaguda Laddu Auction 2024
Ganesh Laddu Auctioned for ₹1.87 Crore: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడ జాగీర్‌లో గణేశ్ లడ్డూ వేలం పాట మరోసారి రికార్డు సృష్టించింది. కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో జరిగిన లడ్డూ వేలం పాటలో ఓ భక్తుడు ఏకంగా రూ.1.87 కోట్లు వెచ్చించి లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది ఇదే ప్రాంతంలో లడ్డూ ధర రూ.1.20 కోట్లు పలికింది. | Read More
ఆదుకోండి మహాప్రభు - సాయం కోసం రైతుల ఎదురుచూపులు - Crops Damaged By Heavy Rains
Crops Damaged By Heavy Rains And Krishna River Floods : భారీ వర్షాలు, కృష్ణానది వరదలతో పంట కోల్పోయిన రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా లంక గ్రామాల్లో అయితే ఒక్క పంటా మిగలకుండా తుడిచిపెట్టుకుపోయింది. అందుకే పరిహారం విషయంలో ఉదారంగా వ్యవహరించాలని కొత్తగా బ్యాంకు రుణాలు ఇప్పించాలని కోరుతున్నారు. | Read More
పీఎస్‌ఆర్ ఆదేశాలతోనే ముంబయి నటి అరెస్టు - విశాల్ గున్నీ మూడు పేజీల వాంగ్మూలం - Mumbai Actress Case Updates
IPS Vishal Gunni Testimony in Mumbai Actress Case: ముంబయి సినీనటిని అరెస్టు చేయాలని అప్పటి నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్ ఆంజనేయులు ఆదేశించినట్లు స్పష్టమైంది. ఈ ఏడాది జనవరి 31న అప్పటి విజయవాడ సీపీ కాంతిరాణా తాతాను, తనను ముఖ్యమంత్రి కార్యాలయానికి పిలిపించి, మౌఖికంగా చెప్పారని, నాటి విజయవాడ డీసీపీ, ఈ అక్రమ కేసు వ్యవహారంలో సస్పెండైన ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ లిఖితపూర్వక వాంగ్మూలమిచ్చారు. అనుసరించాల్సిన వ్యూహమంతా అక్కడే వివరించారని తేల్చిచెప్పారు. | Read More
ఏలేరు వరద ధాటికి పంట భూముల్లో ఇసుక మేటలు - దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు - Sand Dunes in Crop Felds Kakinada
Sand Dunes in Crop Felds in Kakinada : ఇసుక మేటలు ఆపై కొట్టుకొచ్చిన రాళ్లు పచ్చగా కళకళలాడుతున్న పంట పొలాలను నిలువునా దెబ్బతీశాయి. కాకినాడ జిల్లా మెట్ట ప్రాంతంలో ఇటీవల ఏలేరు వరదల ధాటికి పంటలన్నీ కకావికలమయ్యాయి. వరదలు తగ్గిన తర్వాత బయటపడుతున్న పొలాల్ని చూసి రైతులు తల్లడిల్లుతున్నారు. పంట భూములు సాగుకు పనిరాకుండా పోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. | Read More