Rangampet Pasuvula Panduga 2025 : తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో పశువుల పండగ ఉత్సాహంగా జరుగుతోంది. కోడెద్దులకు కట్టిన పలకలను సొంతం చేసుకునేందుకు యువకులు పోటీ పడ్డారు. పశువుల యజమానులు వాటిని అందంగా అలంకరించి కొమ్ములకు బహుమతులు, అభిమాన నేతలు, సినీ నటుల ఫొటోలతో పలకలు కట్టి వదిలారు. వాటిని పట్టుకునే యువకులకు వాటి యజమానులు భారీ బహుమతులు ప్రకటించారు. పశువుల పండుగ తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. మరోవైపు ఈ వేడుకల్లో సినీ నటుడు మంచు మనోజ్ పాల్గొన్నారు.
తిరుపతి జిల్లాలో అట్టహాసంగా జల్లికట్టు పోటీలు- కొత్త అనుభూతి కలిగిందన్న యువత