Chandrababu Convoy No Traffic : వరద ప్రాంతాల్లో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ప్రస్తుత సీఎం చంద్రబాబు చేస్తోన్న పర్యటనలు చూస్తుంటే ఔరా! అనిపించక మానదు. ఎలాంటి ట్రాఫిక్ నిలిపివేత లేకుండా సామాన్యల వాహనాల మాదిరిగానే సీఎం కాన్వాయ్ వెళ్తుంటే, నాటి సీఎం జగన్ పర్యటనలను గుర్తు చేసుకుంటున్నారు ప్రజలు. గంటల కొద్ది ట్రాఫిక్ నిలిపివేత, పరదాల చేదు జ్ఞాప్తికి తెచ్చుకుంటున్నారు. | Read More
ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 10 September 2024
Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Tue Sep 10 2024- సాదాసీదాగా చంద్రబాబు పర్యటనలు- నాటి పరదాలు, ట్రాఫిక్ నిలిపివేత ఎక్కడ? - No Traffic in Chandrababu Convoy
By Andhra Pradesh Live News Desk
Published : Sep 10, 2024, 7:00 AM IST
|Updated : Sep 10, 2024, 10:18 PM IST
సాదాసీదాగా చంద్రబాబు పర్యటనలు- నాటి పరదాలు, ట్రాఫిక్ నిలిపివేత ఎక్కడ? - No Traffic in Chandrababu Convoy
ప్రకాశం బ్యారేజ్ బోట్ల తొలగింపుకు ప్లాన్- బి - REMOVAL OF BOATS AT PRAKASAM
Heavy Boats Removing at Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ అనుకున్నంత సులువుగా లేదు. భారీ క్రేన్లతో బోట్లను తొలగించే ఆపరేషన్ చేపట్టినా అవి ఏ మాత్రం కదలలేదు. గంటల పాటు తీవ్రంగా శ్రమించినా బోట్లు కదలకపోవడంతే ప్లాన్-ఏ కు పులుస్టాప్ పెట్టారు. ఇక బోట్ల తొలగింపులో ప్లాన్-బి అమలు చేయాలని జలవనరులశాఖ అధికారులు నిర్ణయించారు. | Read More
వరద భయం నుంచి తేరుకుంటున్న విజయవాడ - Vijayawada Recover From Flood
Vijayawada Recover From Budameru Flood: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన విజయవాడ నెమ్మదిగా పూర్వ స్థితికి చేరుకుంటోంది. వరద తగ్గుముఖం పట్టడంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అటు ప్రజలకు సొంతిళ్లకు చేరుకుంటున్నారు. వారికి అవసరమైన కూరగాయలను కూడా రాయితీ ధరకు అందించే చర్యలను ప్రభుత్వం వేగం చేసింది. | Read More
వైఎస్సార్సీపీ దారుణాలకు లక్షలమంది బాధలు పడ్డారు- నేరస్థుల రాజకీయ ముసుగు తొలగిస్తాం: చంద్రబాబు - CM Chandrababu Inspected Budameru
CM Chandrababu Inspected Budameru Canal Breach: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు వరుస పర్యటనలు చేస్తున్నారు. బుడమేరు గండ్లు పూడ్చిన ప్రదేశాన్ని కాలినడకన వెళ్లి పరిశీలించారు. గండ్లు పడిన తీరు, వరద ప్రవాహం గురించి సీఎంకు అధికారులు వివరించారు. బుడమేరుకు ఎలాంటి ముప్పు లేదని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. | Read More
హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనంపై హైకోర్టు గ్రీన్‌సిగ్నల్- "కండిషన్స్ అప్లై" - HC GREEN SIGNAL GANESH IMMERSION
Ganesh Immersion at HussainSagar : హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలపై తెలంగాణ హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. 2021లో రూపొందించిన మార్గదర్శకాలనే పాటించాలని సూచించింది. మట్టి, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. | Read More
బుడమేరు ఆక్రమణల తొలగింపునకు సీఎం గ్రీన్‌సిగ్నల్- త్వరలోనే కార్యాచరణ: మంత్రి నారాయణ - Operation Budameru in Vijayawada
Minister Narayana on Operation Budameru: 'బుడమేరు ఆపరేషన్' త్వరలోనే చేపడతామని మంత్రి నారాయణ తెలిపారు. బుడమేరు ఆక్రమణలు తొలగింపుపై ఇప్పటికే సీఎం ఆదేశాలు ఇచ్చారని స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఆక్రమించుకుని ఉన్నవారికి తగిన ప్రత్యామ్నాయం చూపించే తొలగిస్తామని వివరించారు. | Read More
చెరువులు, ఏటిగట్ల గండ్లను వెంటనే గుర్తించాలి- జలవనరుల శాఖ అధికారులతో మంత్రి నిమ్మల సమీక్ష - Minister Nimmal Video Conference
Minister Nimmal Video Conference with Irrigation Officials: జలవనరుల శాఖ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాను, వరదల నేపథ్యంలో దెబ్బతిన్న కాలువలు, డ్రెయిన్లు, చెరువులు, రిజర్వాయర్లు, ఏటిగట్లకు పడ్డ గండ్లను వెంటనే గుర్తించాలని మంత్రి అధికారులకు సూచించారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. | Read More
ఉత్తరాంధ్ర ఉక్కిరిబిక్కిరి- ఎడతెరిపిలేని వర్షాలతో ప్రమాదకరంగా వాగులు - Heavy rains in Uttarandhra
Heavy Rains in Uttarandhra Updates : కుండపోత వర్షాలు ఉత్తరాంధ్రను అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపిలేని వానలతో జలాశయాల్లో నీటి మట్టాలు పెరిగాయి. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. కల్వర్టులు, రోడ్లు తెగి చాలా చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పంటలు నీట మునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. | Read More
ఉప్పొంగుతున్న ఏలేరు- పిఠాపురం నియోజకవర్గంపై తీవ్ర ప్రభావం - Yeleru Canal Floods
Yeleru Canal Floods in Kakinada District: ఎగువన కురుస్తున్న వర్షాలతో కాకినాడ జిల్లా ఏలేరు కాల్వకు భారీగా వరద కొనసాగుతోంది. వరద ఉద్ధృతికి పిఠాపురం నియోజకవర్గంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. | Read More
విజయవాడలో మళ్లీ విరిగిపడ్డ కొండచరియలు - ఒకరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు - One Person Died in Landslide
One Person Died in a Landslide at Machavaram: విజయవాడలో కొండచరియలు మీద పడి ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కొండ అంచున చెట్లు నరుకుతుండగా ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మద్యం మత్తులో మున్నేరులో దూకి గల్లంతైన యువకుడి ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. | Read More
బ్యారేజీని కూల్చి లక్షకుపైగా జనాన్ని చంపాలన్నదే జగన్ లక్ష్యం: మంత్రి లోకేశ్ - Nara Lokesh Fire on Jagan
Minister Nara Lokesh Fire on Jagan: వరదలకు ప్రభుత్వమే కారణమంటూ వైఎస్సార్సీపీ విష ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ కుట్రలు బయటపడకుండా ఆ పార్టీ నేతలు ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. లక్షలాది మంది జలసమాధి అయ్యేలా సైకో జగన్ పన్నిన కుట్ర బట్టబయలైందన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో లోకేశ్ పోస్ట్ చేశారు. | Read More
పోలీసులపై రౌడీషీటర్ దురుసు ప్రవర్తన- సెంట్రల్ జైలు వద్ద హల్చల్ - Rowdy Sheeter Halchal
Rowdy Sheeter Halchal in Central Prison Visakhapatnam : విశాఖపట్నం సెంట్రల్ జైలు గేటు వద్ద రౌడీ షీటర్ హల్చల్ చేశాడు. ఆర్మీ రిజర్వ్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు. జైల్లోకి వెళ్లకుండా ప్రధాన ద్వారం వద్దనే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. | Read More
దులీప్ ట్రోఫీ రెండో రౌండ్- అనంతపురంలో సందడే సందడి - Duleep Trophy IN ANANTAPUR
Indian Cricket Team At Anantapu : దేశవాళీలో అత్యంత ప్రతిష్ఠాత్మక దులీప్ ట్రోఫీ క్రికెట్ పోటీల సందడి ప్రారంభమైంది. పోటీల్లో పాల్గొనే భారత్ జట్లు అనంతపురం చేరుకున్నాయి. నగరంలోని మాసినేని గ్రాండ్ హోటల్‌కు భారత్-ఎ, బి జట్ల క్రీడాకారులు ఒక్కొక్కరు చేరుకుంటున్నారు. | Read More
రాష్ట్రంలో మరింతగా పెరుగుతున్న వరద నష్టం- అంచనా కమిటీ నియామకం - Flood Damage in AP
Flood Damage in AP: వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో నష్టం పెరుగుతోంది. ప్రాథమిక అంచనా మేరకు 6,882 కోట్లు నష్టం వాటిలినట్టు కేంద్రానికి నివేదిక పంపారు. వ్యవసాయం, ఉద్యాన పంటలు సహా రోడ్లు, ఇతర ఆస్తి నష్టాలపై పూర్తి స్థాయి నివేదిక కోసం ఎన్యూమరేషన్ ప్రక్రియ చేపట్టారు. వరదలు, నష్ట పరిహారం అంచనా, సహాయ చర్యల పర్యవేక్షణ కోసం మంత్రుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. | Read More
పారిశ్రామికవేత్తల పెద్ద మనసు - వరద బాధితులకు విరాళాలు వెల్లువ - Huge Donations to CMRF
Donations to AP CMRF: వరద బారిన పడి సర్వం కోల్పోయిన బాధితులకు అండగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సహాయక చర్యలను చేపడుతున్న ప్రభుత్వానికి తోడ్పాటు అందించేందుకు వివిధ వర్గాలు, ప్రాంతాల వారు తమ స్థాయిని బట్టి విరాళాలను అందిస్తున్నారు. | Read More
'హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనాలకు నో పర్మిషన్'- హైడ్రాను ప్రతివాదిగా చేర్చాలన్న పిటిషనర్- నేడు హైక్ర్టులో విచారణ - Ganesh Immersion Not Allowed
Not Allowing Ganesh immersion in Hussain Sagar : హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరోవైపు హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనంపై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టనుంది. | Read More
తెలుగు సినీ పరిశ్రమలోనూ అంతేనా?- రెండేళ్ల కిందటి రిపోర్టులో సంచలన విషయాలు - Sexual Assault in Tollywood
Sexual Assault in Tollywood: టాలీవుడ్లో మహిళలు, జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి దారుణంగా ఉంది. దీనిపై రెండేళ్ల క్రితమే ప్రభుత్వానికి ఉన్నతస్థాయి కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే అప్పట్లో సర్కారు దీనిని బయటపెట్టకపోవడంతో సిఫార్సులు అమలులోకి రాలేదు. ప్రస్తుతం మలయాళ పరిశ్రమను జస్టిస్ హేమ కమిటీ నివేదిక కుదిపేస్తున్న తరుణంలో టాలీవుడ్లో ఆర్టిస్టుల పరిస్థితిపై రిపోర్టు బయటపెట్టాలంటూ డిమాండ్లు పెరుగుతున్నాయి. | Read More
నేటి సాయంత్రంలోగా విజయవాడ సాధారణ స్థితికి రావాలి- అధికారులతో అర్ధరాత్రి వరకూ సీఎం సమీక్ష - CM Chandrababu on Relief Operations
CM Chandrababu on Relief Operations: రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ముంపుపై రేపు సాయంత్రానికి ఎన్యుమరేషన్ పూర్తి చేయాలని అన్నారు. విజయవాడ సాయంత్రంలోగా సాధారణ స్థితి నెలకొనాలని ఆదేశించారు. సహాయ చర్యలపై విజయవాడలో మంత్రులు, అధికారులతో అర్ధరాత్రి వేళ సమీక్ష నిర్వహించారు. | Read More
ఆర్టీసీ బస్సులో డ్రైవర్ల ఫైట్- ఇంజిన్ ఆన్‌లో ఉండడంతో ప్రయాణికుల ఆందోళన - RTC DRIVERS FIGHT
Clash Between Two RTC Drivers at Vijayawada Pandit Nehru Bus Stand : విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్ల మధ్య ఘర్షణ జరిగింది. ప్లాట్ ఫాం పైకి బస్సులను చేర్చే విషయమై వివాదం చెలరేగింది. ఓ బస్సులో ఉన్న బస్సు డ్రైవర్ పై మరో బస్సు డ్రైవర్ దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. | Read More
కళ్లముందే వేలాది మద్యం సీసాలు - ఆగలేకపోయిన మందుబాబులు - DRUNKARDS LOOTED LIQUOR
Drunkards Loot Liquor in Andhra Pradesh: గుంటూరు జిల్లాలోని ఓ డంపింగ్ యార్డులో జరిగిన తతంగాన్ని చూసిన మందుబాబులు తట్టుకోలేకపోయారు. పోలీసులు అడ్డుకున్నా తగ్గేదేలేదంటూ ఎగబడ్డారు. ఒక్కసారిగా గుంపులుగా వచ్చి తమకు చేతికందిన మద్యం బాటిల్ పట్టుకుని పరుగందుకున్నారు. | Read More
వరదల్లోనూ చేతివాటం చూపుతున్నారు - గ్యాస్ సిలిండర్‌నూ వదల్లేదుగా! - Thefts Flood Victims Houses
Thefts Flood Victims Houses in Vijayawada : వరదల కారణంగా విజయవాడ ముంపు ప్రాంతాల వాసులు ఎంతగానో నష్టపోయారు. ఎక్కడ చూసినా కన్నీటి చిత్రాలు మనసు కలిచివేసే దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇంత దారుణ పరిస్థితుల్లో ప్రజలు అల్లాడిపోతుంటే దొంగలు మాత్రం తమ పని చూపెడుతున్నారు. బాధితుల ఇళ్లలో దూరి సొమ్ము కాజేసి వారికి మరింత వేదన మిగులుస్తున్నారు. | Read More
బుడమేరు కన్నీరు - సర్వం తుడిచి పెట్టేసిందని ఘొల్లుమంటున్న బాధితులు - Home Appliances damage
Damage to Electronic And Home Appliances Due to Floods in Vijayawada : విజయవాడ ముంపు ప్రాంతాల్లో వరద వీడుతోంది. బాధితులకు వేదన ఉబికి వస్తోంది. ముంపు వీడుతున్న తరుణంలో చిరు వ్యాపారులు నుంచి ఇంట్లో ఉన్న గృహిణుల వరకు ఎవరిని కదిపిన సర్వం కొల్పోయామని ఘొల్లుమంటున్నారు. బుడమేరుకు పడిన గండి తమ బతుకు బండిని కుప్పకూల్చిందని గుండెలవిసేలా రోదిస్తున్నారు. | Read More
ఆయన అలంకరణకు 2.3 కోట్ల రూపాయల దండ - Decoration with Currency Notes
Ganesh Mandapam Decoration with Currency Notes: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తమ బొజ్జ గణపయ్యను ఒక్కొక్కరూ ఒక్కోలా తీర్చిదిద్దుతూ తమ భక్తిని చాటుకుంటున్నారు. మంగళగిరిలో 2.3 కోట్ల రూపాయల కరెన్సీ నోట్లతో గణపతిని అలంకరించనున్నారు. ఈ మేరకు భారీ దండలను తయారు చేశారు. ఇందుకోసం రూ.10 నుంచి రూ.500 వరకూ నోట్లను సేకరించి, వాటిని దండలు, పువ్వులుగా చేశారు. | Read More
కృష్ణమ్మ ప్రకోపానికి అన్నదాత విలవిల - వేలాది ఎకరాల్లో తుడిచిపెట్టుకుపోయిన పంటలు - Crops loss due to Krishna Floods
Crops loss due to Krishna River Floods: రైతు ఆరో ప్రాణంగా సాగుచేసిన పంటను వరద తుడిచిపెట్టేసింది. కోట్లాది రూపాయల పెట్టుబడులను మట్టిలో కలిపేసింది. అప్పులు తీర్చే మార్గం తెలియక అన్నదాత కుమిలిపోతున్నాడు. మట్టి, ఇసుక మేటలతో నిండిన పొలాలను చూసి రైతులు విలవిల్లాడిపోతున్నారు. | Read More
ముగింపు దశకు చేరిన పునరుద్ధరణ పనులు - నేడు విజయవాడలో కేంద్ర వైద్య బృందం పర్యటన - Vijayawada Gradually Recovering
Vijayawada Gradually Recovering From Flood Water : విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాలు క్రమంగా తేరుకుంటున్నాయి. వరద ఉద్ధృతి తగ్గిన కాలనీల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బాధితులకు ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలుస్తోంది. బాధిత ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్య శాఖ ఇంటింటి సర్వే చేసి, మందులను అందచేస్తోంది. | Read More
వైఎస్ జగన్ పాస్‌పోర్టు అంశంలో కొనసాగుతున్న సస్పెన్స్ - తీర్పు వచ్చేది అప్పుడే! - YS Jagan Passport Renewal Issue
YS Jagan Passport Renewal Issue: పాస్‌పోర్టు అంశంలో జగన్ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పాస్‌పోర్టు పునరుద్ధరణకు విజయవాడ కోర్టు విధించిన షరతులను సవాలు చేస్తూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇరువైపు వాదనలు ముగిశాయి. ఈనెల 11న ఈ వ్యవహారంపై నిర్ణయం వెల్లడించనుంది. | Read More
అర్బన్ యాప్ వినియోగంపై ప్రజల్లో చైతన్యం పెంచుతాం: చంద్రబాబు - CM Chandrababu in Flood Areas
CM Chandrababu in Flood Affected Areas Visit: ప్రకాశం బ్యారేజ్‌కు నష్టం కలిగించేలా వైఎస్సార్సీపీ వాళ్లే బోట్లు వదిలారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలకు అన్యాయం చేయడానికి జగన్ చేయని కుట్రంటూ లేదని ధ్వజమెత్తారు. వరద బాధితులు మళ్లీ మెరుగైన జీవితం గడిపేందుకు అవసరమైన తోడ్పాటు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇంట్లో పాడైన వస్తువుల్ని బాగుచేసుకోడానికి అర్బన్ కంపెనీ సహాయం తీసుకుంటామని అన్నారు. | Read More
భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర ఉక్కిరిబిక్కిరి - జలాశయాలకు పోటెత్తుతున్న వరద - HEAVY RAINS IN UTTARANDRA
Heavy Rains in Uttarandra District : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో ఉత్తరాంధ్ర జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద ఉద్ధృతికి రహదారులు దెబ్బతిని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జలాశయాలకు వరద ప్రవాహం పోటెత్తటంతో నీటిమట్టాలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. | Read More
పోటెత్తిన వరద - కాకినాడ జిల్లాలో ఏలేరు బీభత్సం - Yeleru Reservoir Flood
Yeleru Reservoir Flood Effect: కాకినాడ జిల్లాలోని కొన్ని మండలాలపై ఏలేరు విరుచుకుపడింది. అల్లూరి జిల్లాలో కొండ వాగులు పొటెత్తి ఏలేరు జలాశయానికి భారీగా వరద చేరుతోంది. దిగువకు వదులుతున్న నీరు ఊళ్లను ముంచెతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉప మఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించారు. | Read More