Donations To CM CMRF For Flood Victims: వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు దాతలు విరాళాలు అందిస్తూ దాతృత్వం చాటుకుంటున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ని సచివాలయంలో కలిసిన పలువురు దాతలు చెక్కులు అందించారు. వీరిని సీఎం చంద్రబాబు అభినందించారు. | Read More
ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 19 September 2024
Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Thu Sep 19 2024- అదానీ గ్రూప్ భారీ విరాళం- వరద బాధితుల కోసం వెల్లువెత్తుతున్న విరాళాలు - Donations To CM CMRF
By Andhra Pradesh Live News Desk
Published : Sep 19, 2024, 7:00 AM IST
|Updated : Sep 19, 2024, 10:33 PM IST
అదానీ గ్రూప్ భారీ విరాళం- వరద బాధితుల కోసం వెల్లువెత్తుతున్న విరాళాలు - Donations To CM CMRF
రెండో విడత అన్న క్యాంటీన్లు ప్రారంభం- స్వయంగా అన్నం వడ్డించిన సీఎం - second phase of Anna Canteens
CM Chandrababu Inaugurated Anna Canteens: రెండో విడత అన్న క్యాంటీన్లను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. వెలగపూడి సచివాలయం వెలుపల ఉన్న అన్న క్యాంటీన్‌ను ఆయన ప్రారంభించారు. పేదలకు స్వయంగా టోకెన్లు ఇచ్చి అన్నం వడ్డించారు. పేదలకు కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమం చేపట్టామన్న చంద్రబాబు, రెండు విడతల్లో కలిపి 175 క్యాంటీన్లను ప్రారంభించామని తెలిపారు. | Read More
కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలున్నాయి- ఎవరినీ వదిలిపెట్టం: నారా లోకేశ్ - Nara Lokesh on TTD Ghee Issue
Minister Nara Lokesh on TTD Ghee Issue: వైఎస్సార్సీపీ హయాంలో భక్తులను దేవుడికి దూరం చేశారని, టీటీడీలో జరిగిన అవినీతిపై స్పష్టంగా చెప్పాని మంత్రి నారా లోకేశ్ అన్నారు. అన్నదానం, లడ్డూలో నాణ్యతను తగ్గించారని, శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారన్నారు. కల్తీ నెయ్యి వాడినట్లు మా దగ్గర ఆధారాలున్నాయని తెలిపారు. | Read More
మూడేళ్లలో 95 లక్షల ఇళ్లకు సురక్షిత నీరు: సీఎం చంద్రబాబు - CM CBN Review on Jaljeevan Mission
CM Chandrababu Review on Jaljeevan Mission: వచ్చే మూడేళ్లలో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సురక్షిత నీటిని అందిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇంటింటికీ తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. దీనికి సంబంధించి ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. | Read More
ప్రకాశం బ్యారేజీ రెండవ పవడ తొలగింపు- మూడో దానికి ముహూర్తం ఎప్పుడో! - 2nd Boat Removed at Prakasam
Engineers Removed Second Boat at Prakasam Barrage: ఎట్టకేలకు ప్రకాశం బ్యారేజీ వద్ద బొట్లను ఇంజనీర్లు తొలగించారు. తొమ్మిది రోజులుగా బ్యారేజీ గేట్ల వద్ద అడ్డుగా ఉన్న మూడు పడవలను ఇంజినీర్లు, అధికారులు శతవిధాలుగా ప్రయత్నించి రెండు పడవలను వెలికితీశారు. | Read More
తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు- ముప్పేట దాడికి దిగిన రాజకీయ పార్టీలు - Tirupati Laddu Ghee Issue
Tirupati Laddu Ghee Issue: తిరుమల లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరాపై దుమారం రేగుతోంది. కమీషన్ల కోసమే నాటి ఈవో ధర్మారెడ్డి అర్హత లేని కంపెనీకి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు NDDB నివేదికలో సైతం జంతువుల కొవ్వు ఉన్నట్లు నిర్దారణ అవ్వడంతో వైఎస్సార్సీపీపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. | Read More
ప్రియురాళ్ల సిగపట్లు-మంటల్లో కారు! అపార్టమెంట్లో రచ్చరచ్చ - Triangle Love Story
Triangle Love Story at Machilipatnam in Krishna District : ఓ వ్యక్తి నిర్వాకం స్థానిక ప్రజలను బెంబేలెత్తించింది. ప్రియుడి నిర్వాకంతో ఇద్దరు ప్రియురాళ్ళ జనాల మద్యే సిగపట్లు పట్టారు. ఈ క్రమంలో కారుకు మంటలు పెట్టారు. అది కాస్త, జనరేటర్ కు ఎక్కడ అంటుకుంటుందోనన్న ఆందోళనతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురైయ్యారు. ఈ సిగపట్ల కథేంటో తెలుసుకోవాలంటే కృష్ణాజిల్లా మచిలీపట్నం వెళ్లాల్సిందే. | Read More
వైద్యుడిని భయపెట్టి రూ.33 లక్షలు దోచేసిన సైబర్ నేరగాళ్లు - Cyber Crime in Satya Sai District
Cyber Crime in Satya Sai District ₹33 Lakh Fraud : సైబర్ నేరగాళ్ల వలలకు ఎక్కువ చదువుకున్నవారు, ఉన్నత స్థాయిల్లో ఉన్నవారే ఎర అవుతున్నారు. అధికారులు ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించినా ఈ మోసాలకు అడ్డుకట్ట పడటం లేదు. కష్టపడి సంపాదించిని సొమ్ము అనాలోచితంగా సైబరాసుల ఖాతాల్లో కుమ్మరిస్తున్న ఘటనలు కోకొల్లలు. | Read More
ఫంకా ప్యాకప్: పవన్‌తో బాలినేని, సామినేని భేటీ - జగన్‌ను ఝలక్ ఇస్తున్న నేతలు - YSRCP Leaders met with Pawan Kalyan
జగన్‌కు తమ పార్టీ నేతలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. తాజాగా బాలినేని, సామినేని ఉదయభాను వైఎస్సార్సీపీకి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఇరువురు ఒకరితరువాత ఒకరు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. తాము పార్టీలోకి చేరేందుకు సిద్థంగా ఉన్నట్లు దీనిగురించి పవన్‌తో చర్చించినట్లు తెలిపారు. | Read More
తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు - నిర్ధారించిన NDDB ల్యాబ్ - TTD GHEE ISSUE FACTS
TDP Anam Venkata Ramana Reddy on TTD Ghee: వైఎస్సార్సీపీ హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు NDDB CALF ల్యాబ్ నిర్ధారించిన నివేదికలను టీడీపీ నేతలు బయటపెట్టారు. తిరుపతి లడ్డులో నెయ్యి విషయమై నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు ల్యాబ్‌లో పరీక్షలు చేసినట్లు పేర్కొన్నారు. నెయ్యిలో చేప నూనె, పామాయిల్, గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలు కలిపినట్లు తేలిందన్నారు. | Read More
ఐ ఫోన్లు ఓపెన్ కాకపోవడంతో డేటా డిలీట్ చేయాలని చూశారు: ముంబయి నటి - Mumbai Actress Meet Home Minister
Mumbai Actress Jethwani Meet Home Minister Anita: తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని హోమంత్రి అనితని కోరినట్లు ముంబయి నటి తెలిపారు. తనకి, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలకు నటి ధన్యవాదాలు తెలిపారు. | Read More
పేదింట్లో పుట్టిన విద్యాకుసుమం - నీట్ పీజీలో సత్తా చాటిన లావణ్య - Lavanya From Anantapur neet ranker
Lavanya From Anantapur Secured 65th Rank in NEET PG : తల్లిదండ్రుల కష్టాన్ని చూసి జీవితంలో ఎదగాలని లక్ష్యం పెట్టుకుందా యువతి. కన్నవారు చేసే పాడి పనుల్లో సాయం చేస్తూనే చదువుల్లో రాణిస్తోంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదివి ఉత్తమ మార్కులు సాధించింది. తన ప్రతిభను గుర్తించి ఉన్నత చదువులు చదివించేందుకు ముందుకు వచ్చింది ఆర్డీటీ సంస్థ. ఆ అవకాశాన్ని అందుకుని ఏకంగా నీట్ పీజీ పరీక్షల్లో 65వ ర్యాంకు సాధించింది శ్రీ సత్యసాయి జిల్లాకి చెందిన లావణ్య. | Read More
శరన్నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం ? అమ్మవారిని ఎలా పూజించాలో తెలుసా - Dasara Celebration Arrangements
Dasara Celebration Arrangements 2024 at Indrakeeladri : తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ దసరా. ఈ ఉత్సవంలో తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని రోజుకో రూపంలో కొలుస్తారు భక్తులు. భక్తి శ్రద్దలో శరన్నవరాత్రుల్లో అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగగా ప్రతీతి. | Read More
లోకేశ్ ప్రజాదర్బార్‌కు అనూహ్య స్పందన- రాష్ట్ర వ్యాప్తంగా తరలివస్తున్న బాధితులు - Nara Lokesh Praja Darbar
Nara Lokesh Praja Darbar : నారా లోకేశ్ చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలోనే 33వ రోజు ప్రజాదర్బార్‌కు విన్నపాలు వెల్లువెత్తాయి. ప్రతి ఒక్కరి నుంచి లోకేశ్ వినతులు స్వీకరించారు. వారి సమస్యలు ఓప్పిగా విన్న ఆయన వాటిని పరిష్కరిచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. | Read More
వైఎస్సార్సీపీ నేతలు తిరుమల లడ్డూనూ అపవిత్రం చేశారా? - రాజకీయ దుమారం - FAT IN TIRUMALA LADDU ISSUE
Animal Fat In Tirumala Laddu : తిరుపతి లడ్డూ ఎంత ప్రఖ్యాతి గాంచింతో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి దైవ ప్రసాదం తయారీలో వైఎస్సార్సీపీ నేతలు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారన్న వార్త తీవ్ర దుమారం రేపుతుంది. ఈ నేపథ్యంలో పార్టీలకు అతీతంగా పలువురు రాజకీయ వేత్తలు వైఎస్సార్సీపీ వ్యవహారంపై మండిపడుతున్నారు. | Read More
ఆనందంగా కుమార్తెను స్కూల్‌కు పంపింది - అంతలోనే ఆ తల్లికి - Woman Died in Road Accident
Woman Died in Road Accident in Hyderabad : హైదరాబాద్ నాచారం పోలీసుస్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. కుమార్తెను స్కూల్లో విడిచి పెట్టి ఇంటికి వెళ్తున్నా ఆ తల్లిని మృత్యువు కబలించింది. ఈ విషయం తెలియని ఆమె కుమార్తె సాయంత్రం ఆనందంగా ఇంటికి వచ్చింది. ఇక తన తల్లి లేదన్నా విషయం తెలుసుకుని కన్నీటి పర్యంతమయ్యింది. ఈ విషయం స్థానికుల సైతం కంటతడి పెట్టించింది. | Read More
తిరుమలలో మహిళలు పూలు పెట్టుకోరు - ఎందుకో తెలుసా? - Devotees Not Put Flowers Tirumala
Devotees Not Put flowers Tirumala : దేశంలో సుప్రసిద్ధ ఆలయాల్లో ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం. ఏడుకొండలపైన కొలువైన కలియుగ శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. నిత్యం లక్షలాది భక్తులతో మాడ వీధులు కిటకిటలాడుతుంటాయి. అయితే తిరుమల కొండపైన పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. అందులో ఒకటి కొండపైన పుష్పాలంకర నిషిద్ధం. ఈ నియమం గురించి మీకు తెలుసా? | Read More
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు - బెంగళూరులో జానీ మాస్టర్ అరెస్టు - Jani Master Arrest in Bangalore
Jani Master Arrest News : అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసులో నిందితుడు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరుకు వెళ్లిన రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకువస్తున్నారు. | Read More
కాశీ యాత్ర ఎందుకు - హిందువులు అక్కడే చనిపోవాలని ఎందుకు కోరుకుంటారు? - Moksha Yatra to Kashi
Kashi Moksha Yatra : ప్రతి ఒక్కరూ జీవిత చరమాంకంలో కాశీకి పంపించమని తమ పిల్లల్ని అడుగుతుంటారు. అక్కడే తనువు చాలించాలని వారు ఆరాటపడుతుంటారు. ఎందుకంటే కాశీలోని గంగలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందనే విశ్వాసం. అందుకే కాశీకి వెళ్తే మళ్లీ తిరిగి రారనే నానుడి ఉంది. | Read More
జెత్వానీ ఐఫోన్లలో ఆధారాలు చెరిపేందుకు విఫలయత్నం - వెలుగులోకి పీఎస్‌ఆర్ అరాచాకాలు - Kadambari Jethwani Case Updates
Kadambari Jethwani Case : బాలీవుడ్ నటి కాదంబరీ జెత్వానీ కేసులో రోజుకో వ్యవహారం వెలుగులోకి వస్తోంది. ఈ క్రమంలోనే అప్పటి నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్ చేసిన అరాచకాలు బయటపడుతున్నాయి. ముంబయిలో ఆమెపై ఉన్న కేసుకు సంబంధించిన ఆధారాలను సీతారామాంజనేయులు చేజిక్కించుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కంటే ముందు అక్రమంగా నిఘా కార్యాలయానికి తరలించి తెరిచే ప్రయత్నం చేశారు. కానీ అది ఫలించలేదు. | Read More
పొలాల్లో రెండడుగుల మేర ఇసుక మేటలు - ఆవేదనలో రైతులు - Crop Loss in Munneru Floods
Sand Dunes in Crop Felds at Jaggaiahpet : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఇటీవల మున్నేరు సృష్టించిన వరద బీభత్సానికి పంటపొలాలు తుడుచుపెట్టుకుపోయాయి. భూములన్నీ ఇసుక మేటలు వేశాయి. పంట నష్టపోయిన బాధలో ఉన్న రైతులకు పొలాల్లోని ఇసుక మేటలు గుదిబండలుగా మారాయి. ప్రభుత్వం ఆదుకుంటే తప్ప ఈ గండం గట్టెక్కలేమని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. | Read More
సామాన్యులకు కరెంట్ షాక్ - తెలంగాణలో మళ్లీ పెరగనున్న విద్యుత్ ఛార్జీలు - TG Electricity Charges Revise
Telangana Electricity Charges Revise : తెలంగాణలో కరెంట్ ఛార్జీలు సవరించాలని విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక ఆదాయ అవసరాల నివేదికను ఈఆర్సీకి సమర్పించాయి. పరిశ్రమలకు ఒకే కేటగిరీ కింద బిల్లు, ఇళ్లకు 300 యూనిట్లు దాటితే స్థిర ఛార్జీ కిలోవాట్‌కు రూ.40 పెంచాలని కోరాయి. 80 శాతానికి పైగా గృహాలు 300 యూనిట్లలోపే ఉండటం వల్ల ఎలాంటి భారం ఉండబోదని డిస్కంలు వివరణ ఇచ్చాయి. | Read More
ప్రజలకు ప్రతిరోజూ రాజకీయ నేతల దర్శనం అవసరం లేదు: హైకోర్టు - AP HC on Illegal Hoardings
High Court on Unauthorised Flexis : రాష్ట్రంలో అనధికార హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను తొలగించడంలో అధికారులు విఫలమయ్యారని పిల్ దాఖలైంది. దీనిపై బుధవారం నాడు హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే అనధికారికంగా ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్‌లు, ప్లెక్సీలు, కటౌట్ల విషయంలో ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రజలకు ప్రతిరోజూ రాజకీయ నేతల దర్శనం అవసరం లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. | Read More
నేహారెడ్డి అక్రమ నిర్మాణాలు కూల్చేయండి - అధికారులకు హైకోర్టు ఆదేశం - Neha Reddy Illegal Construction
High Court on Nehareddy Illegal Construction at Bhimili Beach : విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని హైకోర్టు మరోసారి సృష్టం చేసింది. రాజకీయ జోక్యంతో కూల్చివేత చర్యలను ఆపవద్దని జీవీఎంసీకి సూచించింది. అక్రమ నిర్మాణం విషయంలో చీసుకున్న చర్యలతో స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. | Read More
కాదంబరీ జెత్వానీపై అక్రమ కేసు - సీఎంఓలో ఆ ఇద్దరిదే కీలక పాత్ర - Mumbai Actress Case Updates
Mumbai Actress Case Updates : ముంబయి నటి కాదంబరీ జెత్వానీని వేధించిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంలో సకల శాఖల మంత్రి, ముఖ్య ఐఏఎస్ అధికారి కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. వారి సమక్షంలోనే కాంతిరాణా, విశాల్ గున్నీలకు పీఎస్‌ఆర్ ఆదేశాలు ఇచ్చినట్లు నిర్ధారించారు. కుక్కల విద్యాసాగర్‌తోనూ సీఎంఓలో మంతనాలు జరిపి కుట్రకు వ్యూహరచన చేసినట్లు గుర్తించారు. | Read More
దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు - 20 నుంచి ప్రజల్లోకి వెళ్దాం: సీఎం చంద్రబాబు - CM Chandrababu on Free Gas
CM Chandrababu on Free Gas Cylinders Distribution Scheme: సూపర్ 6లో భాగంగా ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని దీపావళి సందర్భంగా అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. మంత్రివర్గ భేటీలో చాలా సమస్యలకు శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు. సంక్షేమ పథకాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. | Read More