Khairatabad Ganesh 70 Years History: శ్రీ సప్తముఖ మహా శక్తి గణపతిగా ఏ ఏడాది ఖైరతాబాద్ గణనాథుడు భక్తుల నీరాజనాలందుకున్నాడు. 70 అడుగుల ఎత్తులో భారీ కాయుడై ప్రపంచ రికార్డు సృష్టించాడు. మరి ఈ గణపయ్య ప్రయాణం ఖైరతాబాద్‌లో ఎలా ప్రారంభమైంతో తెలుసా? స్వాతంత్య్ర ఉద్యమకారుడు తిలక్ ప్రేరణతో సింగరి శంకరయ్య అనే వ్యక్తి 1954లో గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, నాటి నుంచి నేటి వరకు ఖైరతాబాద్ వినాయకుడి ప్రస్థానం కొనసాగుతోంది. | Read More
ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 16 September 2024
Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Mon Sep 16 2024- ఒక్క అడుగుతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణనాథుడు - 70 ఏళ్ల చరిత్ర ఏంటో తెలుసా? - khairatabad ganesh 70 Years history
By Andhra Pradesh Live News Desk
Published : Sep 16, 2024, 8:00 AM IST
|Updated : Sep 16, 2024, 10:12 PM IST
ఒక్క అడుగుతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణనాథుడు - 70 ఏళ్ల చరిత్ర ఏంటో తెలుసా? - khairatabad ganesh 70 Years history
ఎలక్ట్రికల్ వాహనాలలో బ్యాటరీ పేలుళ్లకు చెక్ - సరికొత్త ఏఐ ఈ-బైక్ తయారుచేసిన విట్ విద్యార్థులు - E Bike Designed by Prayana Startup
Amaravathi VIT University Students Designed E Bike : పెరుగుతున్న జనాభాతో పాటే వాహనాల వాడకమూ ఎక్కువై కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. ప్రజలూ పర్యావరణహితం కోసం ఎలక్ట్రికల్ వాహనాలవైపు మెుగ్గు చూపుతున్నారు. ఐతే అక్కడక్కడ ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీలు పేలడంతో ఈ-వాహనాల వినియోగంపై సందిగ్ధం నెలకొంది. ఇందుకు పరిష్కారంగా AI సాంకేతికతతో ఈ-బైక్ తయారు చేసిందీ VIT బృందం. ఆ విశేషాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. | Read More
బాలాపూర్ వేలంపాటలో నూతన నిబంధనలు - పోటీలో పాల్గొనాలంటే ఎన్ని లక్షలు చెల్లించాలంటే? - Balapur Ganesh Laddu Auction
Balapur Ganesh Laddu Auction 2024: బాలాపూర్‌లో భారీ గణనాథుడు కొలువుదీరాడు. మనకు బాలాపూర్ అనగానే ముందుగా గుర్తొచ్చేది లడ్డూ. ఏటా నిర్వహించే వేలంపాటలో రికార్డుస్థాయిలో ధర పలుకుతూ అందరిని దృష్టిని ఆకర్షిస్తోంది. ఈసారీ బాలాపూర్ లడ్డూ వేలంపాటలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. | Read More
విశాఖ-దుర్గ్ వందే భారత్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ - ఈనెల 20 నుంచి రెగ్యులర్ సర్వీస్ - Vande Bharat Inauguration
PM Modi Inaugurated Vande Bharat Trains: విశాఖపట్నం-దుర్గ్ వందేభారత్ ట్రైన్‌ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. అంతే కాకుండా పలు వందే భారత్ రైళ్లకు మోదీ వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ క్రమంలో విశాఖలో ప్రారంభించిన వందే భారత్ ట్రైన్‌కు కేంద్ర మంత్రి రామ్మెహన్ నాయుడు జెండా ఊపారు. | Read More
ఏడో రోజు బోట్ల తొలగింపు ప్రక్రియ - ప్లాన్ 5తో రంగంలోకి దిగిన అధికారులు - PRAKASAM BARRAGE BOATS INCIDENT
PRAKASAM BARRAGE BOATS INCIDENT: ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ వరుసగా ఏడో రోజు కొనసాగుతోంది. బోట్లను ఒడ్డుకు తెచ్చేందుకు ఇంజినీర్లు, అధికారులు, నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీని కోసం నేడు సరికొత్త ప్లాన్ అమలు చేస్తున్నారు. రెండు బోట్లను గడ్డర్లతో కలిపి చిక్కుకున్న బోట్లను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. | Read More
గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం - రేపు ఉదయం ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర - భారీ బందోబస్తు - TELANGANA GANESH IMMERSION 2024
Ganesh Immersion 2024 : జీహెచ్ఎంసీ పరిధిలో వినాయక నిమజ్జనాలకు 360 క్రేన్లను సిద్ధం చేసినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. భక్తులు కూడా శాంతియుతంగా నిమజ్జనం జరిగేలా సహకరించాలని ఆయన కోరారు. | Read More
అమరావతి చాలా భద్రతతో కూడుకున్న నగరం - ఎవరెన్ని చెప్పినా నమ్మొద్దు: మంత్రి నారాయణ - Minister Narayana on Amaravati
Minister Narayana Press Meet on Amaravati: అమరావతిలో వరద సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. అమరావతి నిర్మాణంలో భాగంగా 3 కెనాల్స్‌ను డిజైన్ చేసినట్లు వివరించారు. కొండవీటివాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్‌ను డిజైన్ చేశామన్నారు. మూడు కెనాల్స్‌పై ఏడీసీ ఛైర్మన్, అధికారులతో చర్చించినట్లు తెలిపారు. వచ్చే వర్షాకాలానికి 3 కాల్వలు పూర్తి కావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు | Read More
పొలంలో రాళ్లు ఉన్నా చింత అవసరం లేదు - కొత్త యంత్రం వచ్చేసిందంటున్న రైతులు - stone removal machine in farms
Stone Removal Machine Available In Prakasam District : మీ పొలంలో రాళ్లు ఉన్నాయా. ఇక చింతించకండి. ఎలాంటి రాళ్ల నేలనైనా చక్కగా సాగు భూమిగా మార్చే యంత్రం ఒకటి రైతులకు అందుబాటులోకి వచ్చింది. కూలీలతో రోజుల తరబడి రాళ్లు ఏరించినా సాగుకు అంత అనుకూలంగా ఉండని నేలలో ఈ యంత్రం ద్వారా రాళ్లు ఏరిస్తే గంటల్లో సాగుకు తయారవుతుంది. ఇంతకీ ఆ యంత్రం ఏమిటో? దాన్ని ఎవరూ? అందుబాటులోకి తెచ్చారో తెలుసుకుందామా? | Read More
ఏఐ సాయంతో నీటి వృథాను ఆరికట్టే పరికరాన్ని డిజైన్ చేశాం - పేటెంట్ పొందాం: నాగార్జున - Guntur Man Developed Water Sensor
Guntur Man Made Water Sensor for People : సోషల్ చదువుకున్న వ్యక్తి కంప్యూటర్ ఇంజినీర్ కాగలరా! చరిత్ర చదివిన వారు చిప్ డిజైనింగ్ చేయగలరా? అని ప్రశ్నిస్తే సాధ్యం కాదనే సమాధానం వస్తుంది. కానీ గుంటూరుకు చెందిన నాగార్జున అనే వ్యక్తి దీన్ని సాధ్యం చేసి చూపించాడు. ఏఐ సహకారంతో జల సంరక్షణ ఉపకరణాలు తయారు చేశాడు. సొంతంగా మొబైల్ యాప్ రూపొందించి ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ కంపెనీల నుంచి అవార్డు అందుకున్నాడు. మరి ఇదంతా అతనికెలా సాధ్యమైంది? నీటి సంరక్షణకు ఏ విధంగా సాయపడుతున్నాడు? ఈ కథనంలో తెలుసుకుందాం. | Read More
ఒకేరోజు 13,326 గ్రామసభలు - గుర్తించిన ప్రపంచ రికార్డు యూనియన్ - World Record in Holding Gram Sabhas
World Record in Holding Gram Sabhas in AP : రాష్ట్రంలో ఆగస్టు 23న రికార్డు స్థాయిలో ఒకేరోజు 13,326 చోట్ల గ్రామ సభలను కూటమి ప్రభుత్వం నిర్వహించింది. ఈ విషయాన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. ఈ మేరకు రికార్డు ధ్రువపత్రాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అందజేశారు. పంచాయతీరాజ్ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే ప్రపంచ రికార్డు నమోదు అవడం గమనార్హం. | Read More
మొగల్తూరులో వరుస దొంగతనాలతో రెచ్చిపోతున్న దొంగలు - Serial Thefts in West Godavari Dist
Serial Thefts in West Godavari Districts : ఎప్పుడు వస్తారో, ఎటు నుంచి వస్తారో తెలియదు. తాళమేసిన ఇంటిని ఎలా కొల్లగొడుతున్నారో అర్థం కాదు. సినిమా రేంజ్లో ప్లాన్ చేసి అందినకాడికి దోచుకుంటున్నారు దొంగలు. ఉమ్మడి జిల్లాలో ఇటీవల వరుసగా దొంగతనాలు పెరుగుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దొంగతనాల ముఠా దిగిందేమోనన్న సందేహం ప్రజల్లో వ్యక్తమవుతోంది. | Read More
రేషన్ మాఫియా గ్యాంగ్‌వార్ - ఆధిపత్యం కోసం పరస్పరం కార్లతో ఢీ - Ration Mafia Gang War in Tiruvuru
Illegal Ration Rice Seized in NTR District : ఎన్టీఆర్ జిల్లాలో రేషన్ మాఫియా ఆగడాలు మితిమిరిపోతున్నాయి. చౌక బియ్యం అక్రమ రవాణాలో ఆరితేరిన వర్గాలు ఆధిపత్యం కోసం ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ ముఠా అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని మరో వర్గం అడ్డుకుంది. దీంతో ఆగ్రహించిన ఆ గ్రూప్‌కు చెందిన వ్యక్తులు ప్రత్యర్థులపై దాడికి పాల్పడి కారుతో ఢీ కొట్టారు. ఇది చూసి అక్కడి ప్రజలకు భయాందోళనకు లోనయ్యారు. | Read More
బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు - 14 మందికి గాయాలు - Blast in Fire Crackers Factory
Blast in Fire Crackers Factory at Amalapuram of Konaseema District : అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో బాణ సంచాపేలి 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిని అమలాపురం ఏరియా ఆస్పత్రికి స్థానికులు తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలికి స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు, జిల్లా ఎస్పీ కృష్ణారావు చేరుకుని పరిశీలిస్తున్నారు. | Read More
ఎంబీబీఎస్ విద్యార్థులకు అలర్ట్ - రాష్ట్రంలో కన్వీనర్ కోటా సీట్ల జాబితా విడుదల - MBBS Seats Allotment in AP
Allotment MBBS Convener Quota Seats : ఏపీలో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల జాబితాను విడుదల చేశారు. మొదటి విడతలో కౌన్సిలింగ్లో 3612 సీట్లు కేటాయించగా అందులో 3507 భర్తీ చేశారు. సీట్లు పొందిన వారు ఈనెల 19 మధ్యాహ్నం 3 గంటల్లోగా కళాశాలల్లో చేరాలని అధికారులు తెలిపారు. | Read More
మరోసారి ట్రాప్ కెమెరాకు చిక్కిన చిరుత - భయాందోళనల్లో ప్రజలు - Leopard in Rajahmundry Updates
Operation Leopard in Rajamahendravaram : రాజమహేంద్రవరంలోని దివాన్ చెరువులో చిరుత సంచారం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఆదివారం నాడు చిరుత తిరగడం ట్రాప్ కెమెరాకు చిక్కింది. దీంతో ఎప్పుడు ఎటువైపు నుంచి ఆపద వస్తుందోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామని అటవీశాఖ అధికారులు తెలిపారు. | Read More
పసిపిల్లలకెన్ని కష్టాలో- కాస్త పట్టించుకోరూ ...ప్లీజ్! - Marripalem Orphanage Visakha
Sad Stories Of Children in Marripalem Orphanage : శిశుగృహలో ఆశ్రయం పొందుతున్న చిన్నారుల దీనగాథలు వర్ణణాతీతం. కన్న తల్లే వదిలేసిన పాప, నెలలు నిండకుండానే అమ్మకు దూరమైన పసికందులు. ఏళ్లు గడుస్తున్నా అక్కడే ఉండాల్సిన పరిస్థితి మరో పాపది. కారణమేదైనా వారందరూ చిన్నతనంలోనే ఎన్నో కష్టాలననుభవించాల్సి వస్తుంది. | Read More
గంగమ్మ ఒడికి 2 వేల గణనాథులు- కోలాహలంగా కేసీ కెనాల్ - Lord Ganesh Immersion Celebrations
Lord Ganesh Immersion Celebrations in Kurnool District : కర్నూలు నగరంలో 9 రోజుల పాటు పూజలందుకున్న బొజ్జ గణపయ్యల నిమజ్జనం కోలాహలంగా సాగింది. వేలాది వినాయకులు గంగమ్మ ఒడికి చేరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు చేపట్టిన పటిష్ఠ బందోబస్తుతో నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. | Read More
రైతులకు అలర్ట్ - ఈ-పంట నమోదు ప్రక్రియ పూర్తి చేసుకున్నారా? లేకుంటే అంతే సంగతులు! - government on e crop registrations
Government has Expedited the E Crop Registration Process : ప్రభుత్వం ఈ-పంట నమోదు ప్రక్రియను వేగవంతం చేసింది. వ్యవసాయ సహాయకులు, వీఆర్వోలు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ ఏ రైతుకు ఎంత భూమి ఉంది, ఏయే పంటలు సాగు చేస్తున్నారు, ఇలా అన్ని వివరాలను నమోదు చేస్తున్నారు. రైతులందరూ అవగాహనతో తమ పంట వివరాలు నమోదు చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు. పంట నష్టం పరిహారంతోపాటు ఉత్పత్తులను విక్రయించాలన్నా ఈ-పంట వివరాలే ఆధారని చెబుతున్నారు. | Read More
విజయవాడ ముంపు బాధితులకు అండగా రాస్తా - ఉచితంగా గృహోపకరణాల సర్వీసింగ్ - Free Service to Vijayawada Victims
Free Service to Vijayawada Flood Victims : కృష్ణా, బుడమేరు వరదలతో విజయవాడలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు సర్వం కోల్పోయారు. ఖరీదైన వస్తువులు పనికి రాకుండా మూలన పడ్డాయి. వేల రూపాయలు ఖర్చు పెట్టి రిపేర్ చేయించుకోలేక సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అండగా నిలుస్తోంది. | Read More
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై రేప్ కేసు - RAPE CASE AGAINST JANI MASTER
Rape Case Filed Against Jani Master : నేషనల్ అవార్డ్ విన్నర్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. తనను అత్యాచారం చేశాడంటూ, పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ అతడి వద్ద పని చేసే ఓ డ్యాన్సర్ ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. | Read More
గుంటూరు మిర్చియార్డుకు అవినీతి వైరస్ - Corruption in Guntur Mirchi Yard
YSRCP Corruption in Guntur Mirchi Yard : ఆసియాలోనే అతి పెద్దదిగా పేరున్న గుంటూరు మిర్చి యార్డును కొందరు వైఎస్సార్సీపీ నేతలు, ఆ పార్టీ విధేయ అధికారులు అవినీతి వైరస్‌లా పట్టి పీడిస్తున్నారు. మార్కెట్ సెస్, జీఎస్టీ, 'జీరో', కటింగ్, బిల్ టు బిల్ రూపాల్లో యార్డు ఆదాయానికి రూ. 700 కోట్ల రూపాయలకు పైగా గండి కొట్టారు. అందులో అధికారులు, సిబ్బంది కలిసి రూ. 150 కోట్ల వరకు దండుకున్నట్లు విజిలెన్స్ విచారణలో వెలుగు చూసింది. | Read More
ఆక్రమణల అంతుచూస్తాం - ఏపీలోనూ హైడ్రా తరహాలో వ్యవస్థ : మంత్రి నారాయణ - Minister Narayana Interview 2024
Narayana Special Interview 2024 : భవిష్యత్‌లో వరదల వల్ల విజయవాడ నగరం మునిగిపోకుండా ఉండేలా ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటుందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వివరించారు. కృష్ణానదిపై మరో బ్యారేజీ నిర్మించడం సహా బుడమేరు డైవర్షన్ పనులు సత్వరం పూర్తి చేయాలని సీఎం నిర్ణయించారని పేర్కొన్నారు. ఆ పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా తెలంగాణలో హైడ్రా తరహాలోనే ఆపరేషన్ బుడమేరు పేరిట ప్రత్యేక కార్యక్రమం వీలైనంత త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ‘ఈనాడు - ఈటీవీ భారత్‌కు' ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. | Read More
వినాయక నిమజ్జన వేడుకల్లో అపశ్రుతులు- 40 మందికి గాయాలు - Fire Accident in Ganesh Immersion
Fire Accident in Ganesh Immersion Celebration In Nellore District 40 Injured : రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. పలు ప్రాంతాల్లో ఆదివారం నిమజ్జన వేడుకలను నిర్వహించారు. ఈ క్రమంలో నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. | Read More