ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 20 September 2024 

Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Fri Sep 20 2024- హాస్టల్​ ముసుగులో బాలికలపై లైంగిక దాడి - ముగ్గురు అరెస్ట్​ - sexual harassment case in eluru

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By Andhra Pradesh Live News Desk

Published : Sep 20, 2024, 8:00 AM IST

Updated : Sep 20, 2024, 10:42 PM IST

10:40 PM, 20 Sep 2024 (IST)

హాస్టల్​ ముసుగులో బాలికలపై లైంగిక దాడి - ముగ్గురు అరెస్ట్​ - sexual harassment case in eluru

Sexual Harassment Case in Eluru District: ఏలూరు జిల్లాలో వసతిగృహం ముసుగులో బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన వ్యక్తిని, అతడికి సహకరించిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో దీనికి సంబంధించిన వూర్తి వివరాలను వెల్లడించారు. నిందితుడు హాస్టల్ వార్డెన్​గా పని చేస్తుండటంతో పాటు ఓ ఫొటో స్టూడియో కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. | Read More

ETV Bharat Live Updates

09:28 PM, 20 Sep 2024 (IST)

అప్రమత్తమైన దేవాదాయశాఖ - ప్రముఖ దేవాలయాల్లో ఆవు నెయ్యి కొనుగోళ్లపై ఆరా - Collecting Details on Ghee Quality

Endowment Department Collecting Details on Ghee Quality in all Temples: తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా కాకరేపుతున్న వేళ దేవాదాయశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో వాడే ఆవు నెయ్యి నాణ్యత వివరాలు సేకరిస్తోంది. ప్రముఖ దేవాలయాల్లో తయారు చేసే ప్రసాదాల్లో ఆవు నెయ్యి కొనుగోళ్లపై ఆరా తీయనుంది. | Read More

ETV Bharat Live Updates

09:29 PM, 20 Sep 2024 (IST)

యువగళం నాటి జ్ఞాపకాలు - కాన్వాయ్​ ఆపి కార్యకర్తలతో చాయ్ తాగిన మంత్రి లోకేశ్ - Nara Lokesh Yuva Galam Memories

Minister Nara Lokesh Recalled Memories of Yuva Galam Padayatra : రాష్ట్ర రాజకీయాల్లో సంచలన ఘట్టాలను నమోదు చేసిన చారిత్రాత్మక యువగళం నాటి అనుభవాలను యువనేత నారా లోకేశ్ ఏ మాత్రం మర్చిపోలేదు. గతంలో చిత్తూరు జిల్లాలో యువగళం పాదయాత్ర సాగిన సమయంలో గాదంకి టోల్ గేట్ వద్దకు చేరుకున్నప్పుడు లోకేశ్ అక్కడే ఆగి టీ తాగారు. ఈరోజు రేణిగుంట ఎయిర్ పోర్టుకు రోడ్డు మార్గాన వెళ్తున్నప్పుడు గత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని మళ్లీ అక్కడికే వెళ్లి కార్యకర్తలతో కలిసి చాయ్ తాగారు. ఈ సందర్భంగా యువగళం నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు. | Read More

ETV Bharat Live Updates

08:27 PM, 20 Sep 2024 (IST)

నెల్లూరు జిల్లాలో దారుణం - మాట వినడం లేదని కుమార్తెను చంపిన తల్లిదండ్రులు - parents killed daughter in nellore

Parents Killed Daughter in Nellore District: మాట వినడం లేదని సొంత కుమార్తెను తల్లిదండ్రులు హత్యచేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో కుమార్తెను హత్య చేసిన తల్లిందండ్రులు ఇంటి పక్కనే ఉన్న గడ్డివామిలో పాతి పెట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates

07:46 PM, 20 Sep 2024 (IST)

'జగన్‌ బ్యాచ్‌ తిరుమలను నాశనం చేశారు - ప్రజల మనోభావాలతో ఆడుకున్నారు' - Political Leaders on Laddu Issue

Political Leaders Comments on Tirumala Laddu Issue: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం రాజకీయంగా ప్రకంపంనలు సృష్టిస్తోంది. నెయ్యి కల్తీపై తాను ఎంతో కలత చెందానన్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ బాధ్యులపై కఠిన చర్యలకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అప్పటి టీటీడీ ఈవో, ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ బ్యాచ్‌ తిరుమలను కూడా నాశనం చేశారన్న మంత్రి లోకేశ్​ తమ ప్రభుత్వం తిరుమల పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై సీబీఐ విచారణకు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్‌ చేశారు. | Read More

ETV Bharat Live Updates

07:39 PM, 20 Sep 2024 (IST)

కారులో తనిఖీలు - రూ. 50 లక్షలు దోపిడీ - Fake Police 50 lakh Robbery

Fake Police 50 lakh Robbery in Nellore District : పోలీస్ యూనిఫాంను అడ్డు పెట్టుకుని ఓ ముఠా రూ. 50 లక్షలు దొచుకున్న ఘటన నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది. తనిఖీల పేరుతో ఓ కారులో నకిలీ పోలీసులు సోదాలు నిర్వహించగా ఈ డబ్బు బయటపడింది. దీంతో ముందే సిద్దం చేసుకున్న వాహనంలో డబ్బుతో పాటు పరారయ్యారు. వెంటనే తేరుకున్న బాధితులు వారు నకిలీ పోలీసులని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీల కోసం పోలీసులు గాలింపు చర్యలు మెుదలు పెట్టారు. | Read More

ETV Bharat Live Updates

05:06 PM, 20 Sep 2024 (IST)

వైఎస్సార్సీపీ విశ్వసనీయత కోల్పోయింది - 'కల్తీ నెయ్యి'పై సీబీఐ విచారణ జరిపించాలి : వైఎస్ షర్మిల - Sharmila Comments On YS Jagan

Congress State President Sharmila Comments On YS Jagan : వైఎస్సార్సీపీ విశ్వసనీయతను కోల్పోయింది, వైఎస్సార్ మంచి పేరు సాధిస్తే జగన్‌ చెడ్డపేరు తెచ్చుకున్నారని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జగన్​పై విమర్శలు గుప్పించారు. వైఎస్సార్​కి జగన్‌కు పొంతనే లేదన్నారు. ఆ పార్టీ అంతం అయినట్లే, అందులో జగన్‌ తప్ప ఎవరూ మిగలన్నారు. తిరుపతి లడ్డూ నాణ్యతపై సీబీఐతో విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు. | Read More

ETV Bharat Live Updates

05:00 PM, 20 Sep 2024 (IST)

తిరుమల లడ్డూ ఎలా తయారు చేస్తారు? - ఏయే వస్తువులు వినియోగిస్తారో తెలుసా! - How to make Tirumala Laddu

How to Make Tirumala Laddu: వేదాలే శిలలై వెలసిన కొండ! భక్త కోటి ముక్త కంఠంతో ఎలుగెత్తి పిలిచే తిరుమల కొండ! "వేం కటేశ్వరుడు" వెలసిన కొండ. ఆ తిరుమలేశుని దర్శనానంతరం అందరూ భక్తిభావంతో స్వీకరించే ప్రసాదమే "తిరుమల లడ్డూ". ఎన్ని లడ్డూలున్నా శ్రీవారి లడ్డూకున్న ప్రాముఖ్యత దేనికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈ లడ్డూ రుచి, సుచి, సువాసన ఈ భూమండలంలో ఏ లడ్డూకు ఉండదు. మరి అంతటి ప్రాముఖ్యత ఉన్న శ్రీ వేంకటేశ్వరుని లడ్డూ ప్రసాదాన్ని ఎలా తయారు చేస్తారు? ఏ ఏ వస్తువులు వినియోగిస్తారో మీకు తెలియదా? అయితే ఒకసారి ఈ కథనాన్ని సంపూర్ణంగా చదవండి! | Read More

ETV Bharat Live Updates

04:43 PM, 20 Sep 2024 (IST)

'జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారు - అప్పుడు ఆమె వయస్సు 16ఏళ్లు'- రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు - Jani Master Remand Report

JANI MASTER REMAND REPORT: లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన ప్రముఖ కొరియోగ్రాఫర్​ జానీ మాస్టర్​ను పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్​ రిమాండ్ విధించగా, చంచల్​గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు కీలక విషయాలు వెల్లడించారు. | Read More

ETV Bharat Live Updates

04:30 PM, 20 Sep 2024 (IST)

వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ అరెస్టు - Kukkala Vidya Sagar Arrest

YSRCP Leader Kukkala Vidya Sagar Arrest: ముంబయి హీరోయిన్ పై వేధింపుల కేసులో వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్​ను పోలీసులు అరెస్టు చేశారు. వేరే రాష్ట్రంలో ఉండగా విద్యాసాగర్‌ను అదుపులోకి తీసుకున్నారు. | Read More

ETV Bharat Live Updates

03:42 PM, 20 Sep 2024 (IST)

నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు ఎన్‌డీడీబీ తేల్చింది - చర్యలపై కమిటీ వేశాం: టీటీడీ ఈవో - TTD EO on Laddu Controversy

TTD EO Comments on Tirumala Laddu Controversy: లడ్డూ నాణ్యతగా ఉండాలంటే నెయ్యి నాణ్యంగా ఉండాలని ఈవో టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. తిరుమల లడ్డూలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా కాకరేపుతున్న వేళ తాజాగా ఆయన స్పందించారు. 4 ట్యాంకర్లలోని నెయ్యిని 10 ప్రయోగశాలలకు పంపినట్లు ఈవో తెలిపారు. నెయ్యి నాణ్యత నిర్ధరణ కోసం ఎన్‌డీడీబీ ల్యాబ్‌కు పంపినట్లు వెల్లడించారు. | Read More

ETV Bharat Live Updates

03:12 PM, 20 Sep 2024 (IST)

అత్యాచారం జరిగిందనడానికి సాక్ష్యమేంటి? - నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్‌ సతీమణి - Jani Master Wife Comments

Jani Master Wife Sensational Comments on Her Husband Arrest Issue : తన భర్త, జానీ మాస్టర్‌ ప్రతిభను ప్రోత్సహించేవారని, ఎవరికైనా అవకాశాల్లేకుండా ఆయనెందుకు చేస్తారని సుమలత అలియాస్‌ ఆయేషా ప్రశ్నించారు. ఫిర్యాదు చేసిన మహిళా అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ నిజం నిరూపిస్తే భర్తను వదిలేస్తానని ఆయేషా పేర్కొన్నారు. మైనర్‌గా ఉన్నప్పుడు అత్యాచారం జరిగిందనడానికి సాక్ష్యమేంటి? జానీ మాస్టర్‌తో సాన్నిహిత్యంగా ఉందని ఎవరైనా చూశారా? ఇప్పటి వరకూ ఆ అమ్మాయి బయటకొచ్చి మాట్లాడిందా? అని ప్రశ్నించారు. | Read More

ETV Bharat Live Updates

02:57 PM, 20 Sep 2024 (IST)

'సాయంత్రంలోపు నివేదిక ఇవ్వాలి' - టీటీడీ ఈవోకు సీఎం చంద్రబాబు ఆదేశం - CM Chandrababu on TTD Laddu Issue

CM Chandrababu on TTD Laddu Issue: తిరుమల లడ్డూ కల్తీ అంశంపై సమగ్ర వివరాలతో సాయంత్రంలోపు నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. శ్రీవారి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై మంత్రులు, అధికారులతో జరిగిన సమీక్షలో సీఎం చంద్రబాబు ఈ మేరకు ఆదేశాలిచ్చారు. | Read More

ETV Bharat Live Updates

02:32 PM, 20 Sep 2024 (IST)

తిరుమల లడ్డూ వివాదంపై కేంద్ర మంత్రుల స్పందన - బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి - Union Ministers on Tirumala Laddu

Central Ministers Tirumala Laddu Row : తిరుమల లడ్డూపై వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై కేంద్ర మంత్రులు స్పందించారు. ఈ వ్యవహారం అందరినీ ఆందోళనకు గురి చేసే అంశమని పేర్కొన్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని తెలిపారు. | Read More

ETV Bharat Live Updates

01:52 PM, 20 Sep 2024 (IST)

మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ నివాసంలో సోదాలకు యత్నం - Search in Nandigam Suresh House

Mangalagiri Police Try To Search in Nandigam Suresh House: వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ నివాసంలో సోదాలకు మంగళగిరి పోలీసులు యత్నించారు. ఉద్దండరాయునిపాలెంలోని ఆయన నివాసంలో తనిఖీలు చేపట్టేందుకు వెళ్లారు. కానీ ఇంట్లో పెద్దవారెవరూ లేకపోవడంతో సోదాలు చేయలేదు. మంగళగిరి పీఎస్‌కు రావాలని అక్కడ ఉన్నవారికి నోటీసులు ఇచ్చారు. | Read More

ETV Bharat Live Updates

01:50 PM, 20 Sep 2024 (IST)

"ఆటో"పై 4 ఇన్‌ అల్‌ అంటే- 4X6=24 అని అర్థమట - Dangerous traveling

రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఆటోపై 4ఇన్‌ ఆల్‌ అని ఉంటుంది. అంటే ఆటోలో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు మాత్రమే కూర్చోవాలి. కానీ ఈ నిబంధనలను ఆటోవాలాలు ఎక్కడాపాటించడం లేదు. ఇష్టాసానుసారం ఎక్కించేస్తున్నారు. స్కూల్‌ పిల్లల విషయంలోనైతే ఇది మరీ సుతిమించుతోంది. నెల్లూరు నగరంలో 25 మంది పాఠశాల విద్యార్ధులను ఒకేసారి ఆటోలో ఎక్కించారు. | Read More

ETV Bharat Live Updates

12:51 PM, 20 Sep 2024 (IST)

లడ్డూ నాణ్యతపై ప్రమాణం చేసేందుకు సిద్ధమా?- వైవీ సుబ్బారెడ్డికి మంత్రి నారా లోకేశ్ సవాల్ - Lokesh on Tirumala Laddu Issue

Lokesh Speech in Bangarupalyam : టీటీడీ మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. తిరుమల లడ్డూ నాణ్యతపై ప్రమాణం చేసేందుకు సుబ్బారెడ్డి సిద్ధమా అని ప్రశ్నించారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని తెలిసి షాక్‌ అయ్యానని తెలిపారు. దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేశారని విమర్శించారు. ప్రజాప్రభుత్వం టీటీడీని ప్రక్షాళన చేస్తుందని లోకేశ్ వ్యాఖ్యానించారు. | Read More

ETV Bharat Live Updates

11:40 AM, 20 Sep 2024 (IST)

24గంటలూ ఇసుక బుకింగ్ ఛాన్స్- ఆన్​లైన్​లో ఎలా బుక్ చేసుకోవాలంటే! - How to Book Free Sand in Online

AP Free Sand Portal: ఆన్‌లైన్‌ ఇసుక బుకింగ్‌కు 24 గంటలూ అవకాశం ఉండాలని, పరిమితంగా కొంత సమయం అనే నిబంధన వద్దని, ఎవరైనా ఎక్కడి నుంచైనా ఏ సమయంలో అయినా సులువుగా ఇసుక బుక్‌చేసుకునేలా పోర్టల్‌ను నవీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. శాండ్ మేనేజ్మెంట్ సిస్టం పోర్టల్​ను చంద్రబాబు ఆవిష్కరించారు. | Read More

ETV Bharat Live Updates

11:33 AM, 20 Sep 2024 (IST)

ఐదేళ్లూ నిరభ్యంతరంగా ఈ మహాపాపం- తిరుమల లడ్డూపై వివాదంపై రమణ దీక్షితులు - Ramana Deekshitulu onTirumala Laddu

Tirumala Laddu Ghee Issue Updates : తిరుమల లడ్డూ వివాదం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు స్పందించారు. తిరుమలలో ప్రసాదాల నాణ్యతపై గతంలో ఎన్నోసార్లు టీటీడీ ఛైర్మన్‌, ఈవో దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకపోయిందని తెలిపారు. దీంతో గత ఐదేళ్లుగా నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయిందని పేర్కొన్నారు. | Read More

ETV Bharat Live Updates

11:08 AM, 20 Sep 2024 (IST)

'తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి'పై స్పందించిన పవన్- ఏమన్నారంటే? - Pawan About Tirumala Laddu Issue

Deputy cm Pawan kalyan About Tirumala Laddu Issue : వైఎస్సార్సీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారన్న అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై గుజరాత్‌కు చెందిన నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు(NDDB) ఇచ్చిన నివేదికలో నిజాలు నిర్దారణకు వచ్చాయి. దీంతో పలువురు ప్రముఖులు, రాజకీయనేతలు సహా స్వామివారి భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates

10:56 AM, 20 Sep 2024 (IST)

5 లక్షల మందికి ఉపాధి లక్ష్యం- ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగాలపై ప్రభుత్వం ఫోకస్ - Government Focus on IT in AP

Government Focus on IT in AP: ఐదేళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగాల ద్వారా సుమారు 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. సాధ్యమైనంత త్వరగా కొత్త ఐటీ విధానాన్ని ప్రకటించడం ద్వారా ఐటీ రంగంలో సంస్థలను ఆకర్షించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. నూతనంగా కృత్రిమ మేధ, డ్రోన్‌ విధానాల రూపకల్పన తీసుకురాబోతోంది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక్కో గుర్తింపు తెచ్చేలా కసరత్తు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. | Read More

ETV Bharat Live Updates

10:47 AM, 20 Sep 2024 (IST)

బుడమేరు బురదలో వస్త్రాలు​ - కన్నీటి తడిలో విజయవాడ వ్యాపారులు - Heavy Losses to Textile Traders

Heavy Losses to Textile Traders Due to Floods in Vijayawada : బుడమేరు వరద తగ్గినా బాధితుల కష్టాలు తీరడంలేదు. అనుకోని వరదల కారణంగా విజయవాడ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ విపత్తుతో వేలాది మంది రోడ్డుపాలయ్యారు. సర్వం కోల్పోయిన వారికి ఇప్పుడ ప్రభుత్వ సాయమే దిక్కు. చిరు వ్యపారులు లక్షల్లో నష్టపోయామని వాపోతున్నారు. ఇక వస్త్ర వ్యాపారుల వ్యథ వర్ణనాతీతంగా ఉంది. | Read More

ETV Bharat Live Updates

10:41 AM, 20 Sep 2024 (IST)

'ఇది మంచి ప్రభుత్వం'- ప్రకాశం జిల్లాలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు - Chandrababu Prakasam District Tour

Chandrababu Prakasam District Tour : సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లాలో నేడు పర్యటించనున్నారు. నాగులుప్పలపాడు మండలంలో "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. | Read More

ETV Bharat Live Updates

09:53 AM, 20 Sep 2024 (IST)

టెక్నికల్​గా దొరికిపోయారుగా!- సినీనటి ఫోన్​లోకి ఆ ముగ్గురు ఐపీఎస్​ల చొరబాటు - Jethwani Icloud Account Was Hacked

Jethwani Icloud Account Was Hacked : ముంబయి సినీనటి ఫిర్యాదుతో జేఎస్​డబ్లూ గ్రూపు ఛైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌పై ముంబయి పోలీసులు పెట్టిన అత్యాచారం కేసు ఆధారాల ధ్వంసానికి ఐపీఎస్‌ అధికారులు అనేక ప్రయత్నాలు చేసినట్లు సాంకేతిక ఆధారాలతో స్పష్టంగా వెల్లడైపోయింది. కేసు విచారణకు ఐజీ స్థాయి అధికారిని నియమించాలని ప్రభుత్వాన్ని బాధితురాలు కోరారు. | Read More

ETV Bharat Live Updates

09:44 AM, 20 Sep 2024 (IST)

అనుబంధాలు, వివాహ బంధాలపై స్టడీస్ - మహిళా యూనివర్సిటీలో కొత్త కోర్సు - Family and Marriage Counseling

Family and Marriage Counselling Course : ఈ మధ్యకాలంలో ఉద్యోగాల కారణంగా తమ వ్యక్తిగత జీవితాన్ని చాలామంది ఆస్వాదించలేకపోతున్నారు. ఇవి కుటుంబ బంధాలపై మరింత ప్రభావం చూపుతున్నాయి. దీంతో కౌన్సిలింగ్ బాట పడుతున్నారు. అలా ఫ్యామిలీ, మ్యారేజీ కౌన్సిలింగ్​ కోర్సులకు బాగా డిమాండ్ పెరిగింది. ఈ కోర్సును ప్రస్తుతం తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో బోధిస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates

07:59 AM, 20 Sep 2024 (IST)

ప్రజలు మెచ్చేలా - చంద్రబాబు పాలన @ 100 రోజులు - Chandrababu Hundred Days Ruling

100 Days Of NDA Govt in AP : ఈ ఏడాది జూన్‌ 12న సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు నేటితో 100 రోజుల పాలన పూర్తిచేసుకుంటున్నారు. ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నా, ఏపీకి పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా ఆయన గట్టి ప్రయత్నమే చేశారు. రూ.10 లక్షల కోట్లకు పైగా అప్పు భారం ఉన్నా, ప్రజల అవసరాలు తీర్చే విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. వంద రోజుల్లోనే 100కు పైగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి తనకున్న పరిపాలనా అనుభవం ఏ పాటిదో చాటారు. | Read More

ETV Bharat Live Updates

07:30 AM, 20 Sep 2024 (IST)

అంబటి రాంబాబు సోదరుడి అక్రమ లీలలు - అనుమతులు లేకుండానే భారీ అపార్ట్‌మెంట్‌ నిర్మాణం - Ambati MuraliKrishna Irregularities

Ambati Murali Krishna Irregularities : అధికారం అడ్డుపెట్టుకుని వైఎస్సార్సీపీ నేతలు ఇష్టానుసారంగా చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గుంటూరు పట్టాభిపురంలో మాజీమంత్రి అంబటి రాంబాబు సోదరుడు మురళీకృష్ణ నిర్మిస్తున్న గ్రీన్‌గ్రేస్‌ అపార్ట్‌మెంట్‌ ఉల్లంఘనలు అన్నీ ఇన్నీ కావు. భజరంగ్ జూట్‌మిల్లు యాజమాన్యాన్ని బెదిరించి మొత్తం ప్రాజెక్ట్ సొంతం చేసుకోవడమే కాక అనుమతులు లేకుండానే నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వం మారడంతో అప్రమత్తమైన మురళీకృష్ణ జులై నెలలో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఉల్లంఘనలు పరిశీలించకుండానే పాత అధికారులు పర్మిషన్ ఇవ్వడంతో ప్రస్తుతం ఉన్న అధికారులు తలలు పట్టుకుంటున్నారు. | Read More

ETV Bharat Live Updates
Last Updated : Sep 20, 2024, 10:42 PM IST

ABOUT THE AUTHOR

...view details