AP High Court Hearing on Visakha Steel Plant Privatization Petition :విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. ఏ చట్ట నిబంధనలను అనుసరించి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. నిర్ణయం తీసుకోవడానికి ముందు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు చెందిన ఉద్యోగులు, భాగస్వాములు, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించారా లేదా అని కోర్టు నిలదీసింది.
ప్రైవేటీకరణపై ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆలోచించాలంటూ సీఎం జగన్ ఇచ్చిన లేఖ ఏమి చేశారో చెప్పాలని ఆ లేఖపై స్పందించాల్సిన బాధ్యత కేంద్రపై ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. విశాఖ ఉక్కు నిర్వహణకు కావాల్సిన నిధులు విదేశాల నుంచి తెచ్చేందుకు, ఫెరా చట్టం కింద ప్రత్యేక బ్యాంక్ ఖాతా తెరిచేందుకు అనుమతించాలని కోరుతూ కేఏ పాల్ ఇచ్చిన వినతిపై ఏ చర్యలు తీసుకున్నారో తెలపాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.
విశాఖ ఉక్కుకు తుప్పు పట్టిస్తున్న సీఎం జగన్
High Court on Steel Plant Lands:గతంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక ప్రశ్నలు సంధించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదన ఏ దశలో ఉంది? పిటిషనర్ ఆరోపిస్తున్నట్లు ఉక్కు పరిశ్రమకు చెందిన భూములను విక్రయించారా? విక్రయిస్తే ఎన్ని ఎకరాలు విక్రయించారు? తదితర వివరాలను సమర్పించాలని విశాఖ ఉక్కు పరిశ్రమ సీఎండీని న్యాయస్థానం ఆదేశించింది. విశాఖ ఉక్కు పరిశ్రమను కొనుగోలు చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా ఉందా? చెప్పాలని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. భూముల విక్రయానికి సంబంధించిన దస్త్రాలను కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్‌కు న్యాయస్థానం సూచించింది.
జిందాల్‌తో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఒప్పందం - వ్యతిరేకిస్తున్న కార్మికులు
స్టీల్ ప్లాంట్‌పై సీఎం జగన్ నిర్లక్ష్యం: ప్రత్యక్షంగా, పరోక్షంగా 75వేల మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం ఒక్కో అడుగూ ముందుకెళ్తుంటే దాన్ని ఆపేందుకు సీఎం జగన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. తిరిగి తెరచాటున విశాఖ ఉక్కు గొంతు కోసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తే ఎక్కడ కేంద్రానికి కోపం వస్తుందేమోనన్న భయంతోనే ఒక్క మాట కూడా అనడం లేదు. ప్రైవేటు స్టీల్ కర్మాగారాలకు అడిగిన వెంటనే ఇనుప ఖనిజం, బొగ్గు గనులు కేటాయిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కును మాత్రం పట్టించుకోవడం లేదు. సీఎం జగన్ ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులతో మాట్లాడిన పాపాన పోలేదు. ప్రస్తుతం ప్లాంటుకు సొంత గనుల్లేక ఎన్ఎండీసీ నుంచి ఇనుప ఖనిజం తెచ్చుకుంటోంది.
'ప్రశ్నించే నాయకుడు ఏపీలో లేరు - ఉక్కు ప్రైవేటీకరణను తెలుగువాళ్లం అందరం కలిసి అడ్డుకుందాం'