AP Govt Relieved Telangana Native Employees: ఏపీలో తెలంగాణా స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి వారి స్వరాష్ట్రానికి పంపేలా ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 122 మంది తెలంగాణ స్థానికత కలిగిన నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఆదేశాలిచ్చింది.
తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేసిన ఏపీ ప్రభుత్వం - TELANGANA EMPLOYEES RELIVE - TELANGANA EMPLOYEES RELIVE
AP Govt Relieved Telangana Native Employees : తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. విభజన సమయంలో కేటాయించిన వారిని స్వరాష్ట్రానికి పంపేలా ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు మొత్తం 122 మంది నాన్‌గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేసింది.
Published : Aug 13, 2024, 6:28 PM IST
|Updated : Aug 13, 2024, 8:42 PM IST
తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్ధన మేరకు 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను తెలంగాణకు రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం వేర్వేరు విభాగాల్లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను రిలీవ్ చేసే ముందు వారి నుంచి అంగీకారం తీసుకోవాలని స్పష్టం చేసింది. తెలంగాణాకు రిలీవ్ అవుతున్న ఉద్యోగులు తమ కేడర్‌లోని చివరి ర్యాంక్‌లో మాత్రమే విధుల్లో చేరతారని స్పష్టం చేసింది.