Bar License Application in Andhra Pradesh :ఏపీ వ్యాప్తంగా 53 బార్ లైసెన్సుల జారీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏడాది కాలపరిమితితో ఉన్న లైసెన్సులకు నోటిఫికేషన్ను అబ్కారీ శాఖ ఇచ్చినట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్ తెలిపారు. ఈ బార్ లైసెన్స్ 2024 డిసెంబరు 1 నుంచి 2025 ఆగష్టు 31వ తేదీ వరకు ఉండనుంది.
ఈ-వేలం, ఆన్లైన్ లాటరీ విధానంలో బార్లను ఎక్సైజ్ శాఖ కేటాయించనుంది. ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభమై 22తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియనుంది. 50 వేల జనాభా వరకూ రూ.5 లక్షల నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుము చెల్లించాలి. 50 వేల నుంచి 5 లక్షల లోపు జనాభా వరకూ ఉన్న ప్రాంతాలకు రూ.7.5 లక్షల దరఖాస్తు రుసుము ఇవ్వాలి. అదే 5 లక్షల పైచిలుకు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.10 లక్షల దరఖాస్తు రుసుముగా నిర్ధారించారు.
దరఖాస్తు వివరాలు :
- డిసెంబరు 16వ తేదీ నుంచి డిసెంబరు 22 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ
- 50 వేల జనాభా వరకూ ఉంటే రూ.5 లక్షలు నాన్ రిఫండబుల్ రుసుము
- 50 వేల నుంచి 5 లక్షల లోపు జనాభా ఉంటే రూ.7.5 లక్షల దరఖాస్తు రుసుము
- 5 లక్షల పైచిలుకు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.10 లక్షల దరఖాస్తు రుసుము