తెలంగాణ

telangana

ETV Bharat / state

సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్ : ఏపీ డిప్యూటీ సీఎం హెచ్చరిక​​ - Pawan Kalyan on Sanatana Dharma - PAWAN KALYAN ON SANATANA DHARMA

Pawan Kalyan Prayaschitta Diksha : తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో ఆయన శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో మెట్లను పవన్‌ కల్యాణ్‌ శుభ్రం చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో ఆలయాల్లో తప్పు జరిగిందని చెబితే అపహాస్యం చేసేవారని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Pawan Kalyan Prayaschitta Diksha
Pawan Kalyan Prayaschitta Diksha (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 24, 2024, 1:04 PM IST

Pawan Kalyan on Sanatana Dharma in AP :తిరుమల లడ్డూలో కల్తీ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష కొనసాగుతోంది. దీనిలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలో పవన్‌ కల్యాణ్‌ శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పవన్‌కు ఆలయ మర్యాదలతో అర్చకులు, ఆలయ ఈవో రామారావు, దేవదాయశాఖ కమిషనర్‌ సత్యనారాయణ ఘన స్వాగతం పలికారు. ముందుగా ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో మెట్లను పవన్‌ కల్యాణ్‌ శుభ్రం చేశారు. ఆ తర్వాత మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య మెట్ల పూజ చేశారు. అనంతరం కనకదుర్గమ్మను జనసేనాని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్ హెచ్చరిక : తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ పాలనలో ఆలయాల్లో తప్పు జరిగిందని చెబితే అపహాస్యం చేసేవారని అన్నారు. అపవిత్రం జరిగినప్పుడు బాధ్యత ఉన్న వ్యక్తులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

తోటి హిందువులను దూషించడం మంచిది కాదు :ధర్మారెడ్డి ఎక్కడ కనిపించట్లేదని పవన్‌ కల్యాణ్‌ గుర్తు చేశారు. తిరుమలను ఇష్టారాజ్యంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం పాటించేవాళ్లు ఇతర మతాలను గౌరవిస్తారని అన్నారు. సగటు హిందువుకు వేరే మతం, వ్యక్తిపై ద్వేషం ఉండదని వెల్లడించారు. సాటి హిందువులు, తోటి హిందువులను దూషించడం మంచిది కాదని సూచించారు. సనాతన ధర్మంపై పోరాటం చేయగలిగితే తనను ఎవ్వరూ ఆపలేరని అన్నారు. ఈ నేల అన్ని మతాలను గౌరవించేదని, ధర్మానికి విఘాతం కలిగినప్పుడు అందరూ మాట్లాడాలని పిలుపునిచ్చారు.

పొగరుగా మాట్లాడితే ఊరుకునేది లేదు :తనపై విమర్శలు కాదు.. అపవిత్రం జరిగిందని తెలిసినప్పుడు మీ బాధ్యతేంటి? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఇప్పటికీ వైఎస్సార్సీపీ నేతలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. సున్నిత అంశాలపై ఆ పార్టీ నేత పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యలు బాధాకరని, ఇలాంటి పరిస్థితుల్లో పొగరుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విమర్శించే వైఎస్సార్సీపీ నేతలకు చెబుతున్నా సనాతన ధర్మం జోలికి రావొద్దని అన్నారు. తప్పు జరిగితే ఒప్పుకోవాలని, లేకపోతే సంబంధం లేదని చెప్పాలని అన్నారు. తప్పు జరిగిందంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలని లేదా మౌనంగా ఉండాలని సూచించారు. తప్పు చేసిన వాళ్ల నాశనం మొదలైందని తెలిపారు.

విషయం తెలుసుకుని మాట్లాడండి ప్రకాశ్‌రాజ్‌ : సున్నితాంశాలపై నటుడు ప్రకాశ్‌రాజ్‌ విషయం తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. ఆయనతో పాటు అందరికీ చెబుతున్నా విమర్శలకు ముందు ఏం జరిగిందో తెలుసుకోండని పవన్‌ వ్యాఖ్యానించారు.

శ్రీవారి ఆస్తులను పరిరక్షించాల్సింది పోయి పప్పుబెల్లాల్లా అమ్మేస్తారా? : ఏపీ డిప్యూటీ సీఎం - Pawan Kalyan on TTD Properties

కల్తీ నెయ్యి మరువకముందే - తిరుమల లడ్డూ ప్రసాదంలో పొగాకు పేపర్ - tobacco packet in tirumala laddu

ABOUT THE AUTHOR

...view details