సీ ప్లేన్‌లో ప్రయాణించిన ఏపీ సీఎం చంద్రబాబు - అధికారులతో కలిసి శ్రీశైలం మల్లన్న చెంతకు - CHANDRABABU TRAVEL BY SEA PLANE
విజయవాడలో సీ ప్లేన్‌ను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు - అధికారులతో కలిసి శ్రీశైలం బయలుదేరిన ముఖ్యమంత్రి
Published : Nov 9, 2024, 1:08 PM IST
|Updated : Nov 9, 2024, 1:22 PM IST
AP CM Chandrababu Travel Seaplane : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోని పున్నమిఘాట్లో సీ ప్లేన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీశైలం బయలుదేరారు. అక్కడ మల్లికార్జున స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొననున్నారు. మళ్లీ సాయంత్రం తిరిగి విజయవాడకు చేరుకోనున్నారు. 14 సీట్ల సామర్థ్యంతో సీ ప్లేన్‌ను రూపొందించారు. త్వరలో ఈ సీ ప్లేన్ సామాన్య ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. దేశంలో తొలిసారి పర్యాటకంగా సీ ప్లేన్ వినియోగిస్తున్నారు.