Autonomous Drones For AP CM Chandrababu Security Monitor :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సాంకేతిక సాయాన్ని వినియోగించుకుంటూ తనకున్న భద్రతను గణనీయంగా తగ్గించుకున్నారు. భారీ భద్రత, బందోబస్తుకు ఆయన దూరంగా ఉంటున్నారు. ముఖ్యమంత్రి నివాసంలో అటానమస్ డ్రోన్ల సాయంతో పరిసర ప్రాంతాల భద్రత పర్యవేక్షణను పోలీసులు చేపట్టారు.
తక్కువ మంది సిబ్బంది, టెక్నాలజీ సాయంతో ప్రణాళికతో వ్యవహరించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఉండవల్లిలోని సీఎం నివాసంలో అత్యాధునిక డ్రోన్ పరికరాన్ని ఏర్పాటు చేశారు. ఆ డ్రోన్ తనకు ప్రోగ్రాం ఇచ్చిన విధంగా ప్రతి 2 గంటలకు ఒకసారి పరిసర ప్రాంతాల్లో ఎగిరి వీడియోను షూట్ చేస్తుంది. సాధారణ పరిస్థితుల కంటే భిన్నంగా ఏవిధమైన మూమెంట్(కదలికలు) కనిపించినా కొత్త, అనుమానాస్పద వస్తువులు కనిపించినట్లయితే మానిటరింగ్ టీమ్‌కు సందేశం పంపుతుంది. చంద్రబాబు నివాసంలో పెట్టినటువంటి ఈ డ్రోన్ అటానమస్ విధానంలో ఆటోపైలట్‌గా ఆయా ప్రాంతాల్లో ఎగురుతూ పర్యవేక్షిస్తుంది. మళ్లీ వచ్చి నిర్దేశిత డక్‌పై ల్యాండ్ అయి తానే ఛార్జింగ్ కూడా పెట్టుకుంటుంది. ఈ డ్రోన్ పంపేటువంటి డేటాను విశ్లేషించడం ద్వారా ఇంటి పరిసర ప్రాంతాల్లో భద్రతను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.