తెలంగాణ

telangana

ETV Bharat / state

పింఛన్​దారులకు సర్కార్​ తీపికబురు - ఒకేసారి 3 నెలల డబ్బులు! - CM CHANDRABABU ON PENDING PENSION

ఏపీ పింఛన్​దారులకు గుడ్​న్యూస్ - ఇకపై ఏ నెలలోనైనా పింఛను తీసుకోకపోతే ఆ మరుసటి నెల మొత్తం కలిపి ఇవ్వనున్న ప్రభుత్వం

Ap GOVT ON Pending Amount Of Pension
Ap CM Chandrababu On Pending Amount Of Pension (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 4, 2024, 12:44 PM IST

Updated : Nov 4, 2024, 12:52 PM IST

Ap CM Chandrababu On Pending Amount Of Pension : ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకిచ్చిన మరో హామీని నెరవేర్చేందుకు ముందడుగు వేసింది. పింఛన్​దారులు ఇకపై ఏ నెలలోనైనా పింఛను తీసుకోకపోతే ఆ మరుసటి నెల మొత్తం కలిపి ఇవ్వనున్నారు. రెండు నెలలు తీసుకోలేకపోతే ఆ తర్వాత నెలలో 3 నెలల డబ్బులను ఒకేసారి ఇవ్వనున్నారు. దీనిపై ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ఈ విధానం అమలైంది.

ఏ నెలలోనైనా పింఛన్ తీసుకోకపోతే : కానీ అప్పట్లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక జగన్‌ దీన్ని రద్దు చేసి ఏ నెలకు ఆ నెలే పింఛను తీసుకోవాలనే నిబంధన తెచ్చారు. దీంతో పింఛనుదారులు అప్పట్లో చాలా ఇబ్బందులకు గురయ్యారు. తాజాగా ఏపీ సీఎం ఆదేశాలతో డిసెంబర్​ నుంచే పాత విధానాన్ని పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నవంబర్​లో పింఛను తీసుకోని వారికి డిసెంబరు 1న రెండు నెలల పింఛను ఒకేసారి ఇవ్వనున్నారు. ఈ మేరకు దస్త్రాన్ని సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు. నవంబరులో దాదాపు 45 వేల మంది వివిధ కారణాలతో పింఛన్ తీసుకోలేదని అధికారులు వెల్లడించారు.

ఎన్టీఆర్‌ భరోసా కింద : ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయంతో నెలనెలా వేల మంది పింఛనుదారులకు లబ్ధి చేకూరుతుంది. ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్‌ భరోసా కింద రాష్ట్రవ్యాప్తంగా 64.14 లక్షల మందికి పింఛన్లు అందిస్తోంది. పింఛన్ ఇచ్చే సమయానికి కొంత మంది అందుబాటులో ఉండకపోవచ్చు. వృద్ధులైతే వేరే ఊళ్లో పిల్లల దగ్గర ఉండొచ్చు. కొందరు శుభకార్యాలకు లేదా ఆసుపత్రికి, పనుల మీద వేరే ప్రాంతానికి వెళ్తారు.

పనుల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లే ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు ఎక్కువగానే ఉంటారు. ఇలాంటి వారంతా పింఛన్ కోసం నెలనెలా రావాలంటే ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి వారంతా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల నెలా పింఛన్ తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరైతే సమయానికి అందుబాటులో లేక పింఛన్ వదులుకున్నారు. వీరి ఇబ్బందులను గుర్తించి కూటమి పార్టీలు పాత విధానాన్ని పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో హామీనిచ్చాయి.

జగన్‌ పాలనలో ఒక నెల తీసుకోకపోతే ఆ మొత్తం కోతే : గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైనా కారణంతో ఒక నెల పింఛన్ తీసుకోకపోతే వారికి ఆ నెల మొత్తం ఇవ్వకపోయేవారు. ఒకవేళ అందుబాటులో లేక రెండు నెలలు పింఛను తీసుకోలేకపోతే ఆ మొత్తాన్నీ ఇవ్వకుండా మూడో నెల పింఛను (ఒక నెల) మాత్రమే ఇచ్చేవారు. దీంతోపాటు రాష్ట్రంలో ఎక్కడున్నా పింఛన్ తీసుకునే పోర్టబులిటీ సౌకర్యాన్ని తీసేసి గతంలో వేల మంది ప్రజల పొట్టకొట్టారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎంతోమందికి లబ్ధి చేకూరనుంది.

గుడ్​న్యూస్ - ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచిన సర్కార్

ఫ్రీ గ్యాస్​ సిలిండర్ల పంపిణీకి వేళాయే - బుకింగ్స్​​లో ప్రాబ్లమ్స్​ ఉంటే వెంటనే ఇలా చేయండి

Last Updated : Nov 4, 2024, 12:52 PM IST

ABOUT THE AUTHOR

...view details