జగన్ పాలనలో అటకెక్కిన అభివృద్ధి- మూలధన వ్యయాన్ని మూలకు నెట్టిన సర్కార్ AP Capital Expenditure in YSRCP Govt: రాష్ట్ర బడ్జెట్ స్వరూపం ఎంతున్నా మూలధన వ్యయం కింద చేసే ఖర్చులే రాష్ట్ర ప్రగతిని నిర్దేశిస్తాయి. అభివృద్ధికి నిధులే వెచ్చించకుంటే పనులెలా పూర్తవుతాయి? రాష్ట్ర ఆదాయమెలా పెరుగుతుంది? 2022-23 లో మూలధన వ్యయం కింద ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం రూ.7వేల 244 కోట్లు మాత్రమే.
అయితే ఆ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ ఖర్చు రూ.2లక్షల 25 వేల 853 కోట్లు. అభివృద్ధి పనులకు ఎంత అత్యల్పంగా ఖర్చు చేశారనేందుకే ఇదే ఉదాహరణ అంటూ కాగ్ లెక్కలతో సహా వెల్లడించింది. గత ఎనిమిదేళ్లలో ఎప్పుడూ ఇంత అత్యల్ప వ్యయం లేదు.
AP Capital Expenditure: ఇదేందయ్యా ఇది.. మూలధన వ్యయం ఇంత తక్కువా!.. మరి ఆ డబ్బంతా ఏమైంది?
కాగ్ లెక్కల ప్రకారం 2018-19లో మూలధన వ్యయంగా రూ.19వేల 976 కోట్లను ఖర్చు చేయగా జగన్ సర్కారు తొలి ఆర్థిక సంవత్సరం 2019-20లో పెట్టిన మూలధన వ్యయం రూ.12వేల 242 కోట్లు మాత్రమే. అంటే అభివృద్ధి పనులపై చేసిన నిధుల ఖర్చు అంతకుముందు ఏడాది కన్నా 39శాతం తగ్గిపోయింది.
మౌలిక సౌకర్యాలు కల్పిస్తే పరిశ్రమలు పెరిగి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయి. ఈ ఆర్థిక చక్రమే రాష్ట్రం, అన్నివర్గాల ప్రజలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఉపకరిస్తుంది. కానీ 2024 నాటికి మొత్తం 42 ప్రాజెక్టులు పూర్తి చేసేస్తామని ప్రణాళికలు రూపొందించిన ప్రభుత్వం కేవలం నెల్లూరు, సంగం బ్యారేజీలు, అవుకు రెండో టన్నెల్ పనులు మాత్రమే పూర్తి చేసింది.
Capital Expenditure: మూలధన వ్యయంలో దయనీయ స్థితిలో రాష్ట్రం.. చిన్న రాష్ట్రాలకంటే కూడా
కొత్త ఆయకట్టు ఏదీ సాగులోకి తీసుకురాలేకపోయింది. రోడ్ల నిర్మాణమూ జరగలేదు. పోర్టులు, ఇతర అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయాయి. ఇలా జగన్ సర్కార్ నిర్వాకంతో ఆర్థిక చక్రానికి బీటలు వారాయి. మూలధన వ్యయం అంచనాలు తగ్గిపోవడమే కాదు మొత్తం ఖర్చులోనూ ఈ కేటగిరీ వ్యయంలో తిరోగమనమే తప్ప పురోగమనం లేదు. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి 2022-23 వరకు పరిశీలిస్తే మొత్తం బడ్జెట్ అంచనాల్లో మూలధన వ్యయం అంచనాలు వరుసగా 14.60 శాతం నుంచి 13.30 శాతానికి, ఆ తర్వాత 8.06 శాతానికి తగ్గిపోయాయి.
ఆ తర్వాత 11.97శాతం మేర కేటాయింపులు చూపారు. మొత్తం బడ్జెట్ ఖర్చులో మూలధన వ్యయం కింద చేసిన ఖర్చు బాగా తగ్గుతూ వచ్చింది. 2020-21లో అది 10.14శాతం ఉంటే ఆ మరుసటి ఏడాది 8.54 శాతానికి, ఆ తర్వాత ఏకంగా 3.20 శాతానికి తగ్గిపోయింది. ఇదీ జగన్ జమానాలో అభివృద్ధి నమూనా అంటూ కాగ్ గణాంకాలు వెల్లడించింది.
Pattabhi on Jagan: 'జగన్‌ది రివర్స్ గేర్ ప్రభుత్వం.. అందుకే మూలధన వ్యయం తగ్గింది': పట్టాభి