ETV Bharat / offbeat

సంక్రాంతి స్పెషల్​: నోట్లో వేసుకోగానే కరిగిపోయే "అటుకుల కేసరి"- ఇలా చేస్తే టేస్ట్​ అద్భుతం! - ATUKULA KESARI IN TELUGU

-రవ్వ కేసరి, సేమియా కేసరి రొటీన్​ -ఈజీగా ఇలా అటుకుల కేసరి చేసేయండి

How to Make Poha Kesari
How to Make Poha Kesari (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 12, 2025, 2:46 PM IST

How to Make Poha Kesari : మనలో చాలా మందికి కేసరి అంటే ఎంతో ఇష్టం. ఒక కప్పు తినగానే మళ్లీ మరో కప్పు వేసుకుని తింటుంటాం. ఎందుకంటే నోట్లో వేసుకోగానే ఆ స్వీట్​ ఫ్లేవర్​కి ఇంకాస్త తినాలనిపిస్తుంది. అయితే, నార్మల్​గా అందరూ బొంబాయి రవ్వ, సేమియాతో కేసరి చేస్తుంటారు. అయితే, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రస్తుతం అందరి అభిరుచులు కూడా ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అన్నట్లుగా ప్రయోగాలు చేస్తున్నారు. ఆ కోవలోనే ఇటీవల అటుకులతో చేసే కేసరిపై ప్రజల్లో మక్కువ పెరుగుతోంది. దీంతో ఈ రెసిపీ మీ వద్దకు తీసుకొచ్చాం. ఒక్కసారి ఇలా సంక్రాంతి పండక్కి కేసరి చేసి పెట్టారంటే పిల్లలు, పెద్దలందరూ 'వన్ మోర్​ కప్​' అని పక్కా అంటారు. ఈ అటుకుల కేసరి వేడివేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా సింపుల్​గా అటుకుల కేసరి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

అటుకుల కేసరికి కావలసిన పదార్థాలు :

  • అటుకులు - కప్పు
  • వాటర్ - ఒకటిన్నర కప్పు
  • పాలు - కప్పు
  • ఆరెంజ్ ఫుడ్ కలర్​ - చిటికెడు (ఆప్షనల్​)
  • కిస్​మిస్‌ - 10
  • జీడిపప్పులు -10 గుప్పెడు
  • యాలకుల పొడి -అర టీస్పూన్​
  • నెయ్యి - రెండు టేబుల్​స్పూన్లు
  • పంచదార - కప్పు

తయారీ విధానం :

  • ముందుగా స్టౌపై పాన్ పెట్టండి. ఇందులో అటుకులు వేసి ఒక రెండు నిమిషాలు దోరగా వేపుకోండి. (స్టౌ లో ఫ్లేమ్​లో అడ్జస్ట్​ చేసి అటుకులు ఫ్రై చేస్తే రంగు మారకుండా వేపుకోవచ్చు.)
  • అటుకులు చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకుని రవ్వలాగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు అదే పాన్​లో నెయ్యి వేసి కరిగించండి. వేడివేడి నెయ్యిలో జీడిపప్పులు, కిస్ మిస్‌లు వేయించండి. ఆపై వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి.
  • తర్వాత అదే పాన్​లో గ్రైండ్​ చేసుకున్న అటుకుల పొడి వేసి వేపుకోండి. అటుకుల నుంచి మంచి సువాసన వస్తున్నప్పుడు నీరు వేసి కలపండి.
  • మిశ్రమం చిక్కగా మారిన తర్వాత పాలు పోసి మిక్స్​ చేయండి. అలాగే ఆరెంజ్ ఫుడ్​ కలర్​ వేసి కలపండి.
  • ఇప్పుడు స్టౌ మీడియం ఫ్లేమ్​లో అడ్జస్ట్​ చేసి అటుకుల మిశ్రమం ఉడికించుకోండి.
  • అనంతరం కేసరిలో కాస్త నెయ్యి, యాలకుల పొడి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్​ వేసి కలపండి.
  • ఒక రెండు నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్​ చేస్తే వేడివేడి అటుకుల కేసరి మీ ముందుంటుంది.
  • ఈ కేసరి నచ్చితే మీరు ఈ సంక్రాంతికి తప్పకుండా ట్రై చేయండి.

​కజ్జికాయలు పీటలేకుండానే చేతులతో వత్తేయండిలా - నిమిషానికి ఒకటి చేసేస్తారు!

పిండి లేకుండా చిలగడదుంపతో "గులాబ్​జామున్​" - నోట్లో వేసుకోగానే కరిగిపోతాయ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.