AP Cabinet Decisions :నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయించింది. వైఎస్సార్సీపీ హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాల భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించారు. దీనిపై అధ్యయనం చేసి ఆయా భూములను ఏం చేయాలన్న దానిపై మంత్రుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఎన్నికల హామీ మేరకు పేదలకు స్థలం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
గ్రామీణంలో 3 సెంట్లు, అర్బన్ ప్రాంతంలో 2 సెంట్లు భూమి ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా అమలుకు సిద్ధం కావాలని నిర్దేశించారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ వెంటనే ప్రారంభమవుతుందన్న సీఎం అమరావతి పనులు కూడా వెంటనే మొదలవుతాయని తెలిపారు. మంత్రివర్గ సమావేశం తర్వాత పలు రాజకీయ అంశాలపై చర్చ జరిగింది.
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 11,440 కోట్లు - కేంద్రం అధికారిక ప్రకటన
ధాన్యం కొనుగోలు కోసం 700 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు ఏపీ మార్క్ఫెడ్ కు ప్రభుత్వ హామీ ప్రతిపాదన పై కేబినెట్ లో చర్చజరిగింది. అలాగే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల రేషన్లజేషన్ ప్రతిపాదనపై చర్చ జరగింది. గ్రామ వార్డు సచివాలయాల్లో రియల్ టైం గవర్నెన్స్ వ్యవస్థ ఏర్పాటు కు సంబంధించి మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నారు. ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ టారిఫ్ తగ్గింపు ప్రతిపాదన పై చర్చించారు.
అలాగే నాగావళి నది పై గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్ పై కుడి, ఎడమ వైపు మిని హైడల్ ప్రాజెక్టుల నిర్మాణం ప్రతిపాదన కు కేబినెట్ ఆమోదం తెలిపింది. కడప జిల్లా సీకే దిన్నె మండలం లో ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ ఇన్ఫ్రా కార్పొరేషన్ కు కేటాయించిన 2595 ఎకరాల బదిలీ కి స్టాంపు డ్యూటీ మినహాయింపు ప్రతిపాదన పై కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. అభ్యంతరం లేని ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ ప్రతిపాదన పైనా కేబినెట్లో చర్చించారు.
రాష్ట్రాన్ని అత్యంత పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం - 18న 'స్వచ్ఛ దివస్'
కేబినెట్లో చర్చించిన అంశాలను మంత్రి కొలుసు పార్థసారధి వెల్లడించారు. ప్రతి రైతుకు సేకరించిన ధాన్యానికి 24 గంటల్లో చెల్లించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తెలిపారు. ఇప్పటికే రైతుల ఖాతాల్లో రూ.6200 కోట్లు జమ చేశామని గుర్తు చేశారు. ఈ సీజన్‌లో 4.6 లక్షల రైతుల నుంచి 28.83 లక్షల టన్నుల ధాన్యం సేకరించామన్నారు. మిగిలిన ధాన్యాన్ని రైతుల నుంచి సేకరిస్తామని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాలని సీఎం ఆదేశించారన్నారు. విద్యుత్ సుంకంలో టారిఫ్‌ల తగ్గింపును మార్చి వరకు పొడిగింపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. దీనివల్ల రూ.300 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడుతుందని వెల్లడించారు. ఫెర్రో అలాయిస్ పరిశ్రమలో కార్మికుల కోసం ప్రభుత్వం భారం భరిస్తుందన్నారు.
అలాగే 62 నియోజకవర్గాల్లో 63 అన్న క్యాంటీన్ల ప్రారంభానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. విజయవాడలో రూ.294 కోట్లతో అభివృద్ధి పనులకు ఆమోదం లభించిందని వెల్లడించారు. వైఎస్‌ఆర్, కర్నూలు జిల్లాల్లో 2 కారిడార్లకు భూమి బదిలీ కోసం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఉంటుందన్నారు. అలాగే వైఎస్‌ఆర్ జిల్లాలో 2,590 ఎకరాలు ఏపీఐఐసీకి బదిలీకి ఆమోదం తెలిపిందన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 2600 ఎకరాలు ఏపీఐఐసీకి బదిలీకి ఆమోదం లభించిందన్నారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తుల దాఖలు గడువు డిసెంబర్ 31 వరకు పొడిగింపు ఉంటుందని వెల్లడించారు. అలాగే పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లలో ఇళ్ల పట్టాల పంపిణీ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి కొలుసు పార్థసారధి వెల్లడించారు.
ఇసుక రీచ్‌ల కోసం 'టెండర్వార్' - కడపలో బీటెక్ రవి అనుచరుల హల్చల్