ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

LIVE UPDATES: గవర్నర్ ప్రసంగం పూర్తి - సభ రేపటికి వాయిదా - AP ASSEMBLY BUDGET SESSION

AP Assembly Live Updates
AP Assembly Live Updates (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 24, 2025, 9:49 AM IST

Updated : Feb 24, 2025, 11:19 AM IST

LIVE UPDATES: శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచి జరగనున్నాయి. కాసేపట్లో తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించనున్నారు. ఈ నెల 28న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ సభలో వార్షిక బడ్జెట్‌ని ప్రవేశపెట్టనున్నారు. మార్చి 3 నుంచి బడ్జెట్‌ సహా అనేక అంశాలపై చర్చ జరగనుంది. మరోవైపు గవర్నర్‌ ప్రసంగం తర్వాత శాసనసభ, శాసన మండలి వ్యవహారాల సలహా కమిటీలు భేటీ కానున్నాయి. సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి? ఏ రోజు ఏ అంశంపై చర్చించాలనే అజెండాను అందులో ఖరారు చేస్తారు.

LIVE FEED

10:35 AM, 24 Feb 2025 (IST)

స్పీడ్ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ఉండాలనేది సీఎం ఆకాంక్ష: గవర్నర్‌

  • 'మన బడి - మన భవిష్యత్తు' ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు: గవర్నర్‌
  • మెరిట్‌ ఆధారంగా 9 వర్సిటీలకు వీసీలను నియమించాం: గవర్నర్‌
  • స్థానికసంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధన ఎత్తివేశాం: గవర్నర్‌
  • మా ప్రభుత్వం వచ్చాక పారిశ్రామికవేత్తలను ఆహ్వానించాం: గవర్నర్‌
  • ఐటీఐలు, పాలిటెక్నిక్‌ల్లో 200 స్కిల్‌ హబ్‌లు ఏర్పాటు చేశాం: గవర్నర్‌
  • ప్రస్తుతం స్పీడ్ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ఉండాలనేది సీఎం ఆకాంక్ష: గవర్నర్‌
  • మా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో టూరిజంలో పెట్టుబడులు పెరిగాయి: గవర్నర్‌
  • ఎంఎస్‌ఎంఈలకు అండగా ఉన్నాం.. అన్నివిధాలా ప్రోత్సహిస్తున్నాం: గవర్నర్‌
  • నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా అనేక చర్యలు: గవర్నర్‌
  • తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలకు నీరందించేలా కార్యక్రమాలు: గవర్నర్‌
  • 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం: గవర్నర్‌
  • పోలవరం-బనకచర్ల పూర్తయితే రాష్ట్ర రూపురేఖలు మారతాయి: గవర్నర్‌
  • పోలవరం-బనకచర్ల పూర్తయితే రాయలసీమలో కరవు అనేదే ఉండదు: గవర్నర్‌

10:18 AM, 24 Feb 2025 (IST)

స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తాం: గవర్నర్‌

  • 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తాం: గవర్నర్‌
  • ప్రతినెలా 1వ తేదీనే ఇంటికి వెళ్లి పింఛన్లు అందిస్తున్నాం: గవర్నర్‌
  • పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు అందిస్తున్నాం: గవర్నర్‌
  • విద్య, వైద్యం, మౌలికవసతులపై ప్రత్యేక దృష్టి సారించాం: గవర్నర్‌
  • బీసీవర్గాలు సమాజానికి వెన్నెముక.. వారికోసం ప్రత్యేక కార్యక్రమాలు: గవర్నర్‌
  • స్థానికసంస్థలు, నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు: గవర్నర్‌
  • ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు అనేక పథకాలు ప్రవేశపెట్టాం: గవర్నర్‌
  • అర్హులైన అందరికీ సొంతిల్లు ఉండాలనేది మా ఆకాంక్ష: గవర్నర్‌
  • ప్రతి కుటుంబానికి సురక్షిత తాగునీరు, విద్యుత్‌ ఉండాలి: గవర్నర్‌
  • యువతకు మెరుగైన శిక్షణ ఇవ్వాలనేది మా విధానం: గవర్నర్‌
  • పీ-4 విధానం ద్వారా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నాం: గవర్నర్‌
  • రాష్ట్రంలో పేదరికం నిర్మూలించేందుకు కట్టుబడి ఉన్నాం: గవర్నర్‌
  • ప్రజలకు మెరుగైన వైద్యసేవల కోసం సరికొత్త విధానాలు తీసుకువచ్చాం: గవర్నర్‌
  • ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్ట్ ద్వారా పేదలకు మెరుగైన వైద్యసేవలు: గవర్నర్‌

10:13 AM, 24 Feb 2025 (IST)

అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయిన జగన్‌, వైఎస్సార్సీపీ సభ్యులు

  • అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయిన జగన్‌, వైఎస్సార్సీపీ సభ్యులు
  • సభలో 10 నిమిషాలు నినాదాలు చేసి బయటకు వెళ్లిపోయిన జగన్
  • జగన్ వెంట బయటకు వెళ్లిపోయిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

10:08 AM, 24 Feb 2025 (IST)

ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది: గవర్నర్

  • ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు: గవర్నర్
  • ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది: గవర్నర్
  • గత ఐదేళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైంది: గవర్నర్
  • గత ప్రభుత్వ పాలనతో రాష్ట్రం ఎంతో నష్టపోయింది: గవర్నర్
  • సూపర్‌ సిక్స్‌ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నాం: గవర్నర్
  • అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్‌ను రద్దు చేశాం: గవర్నర్
  • అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్‌సీ దస్త్రంపై సంతకం చేశాం: గవర్నర్
  • అన్న క్యాంటీన్లు తెచ్చి పేదవాళ్ల ఆకలి తీరుస్తున్నాం: గవర్నర్
  • కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం: గవర్నర్
  • మా ప్రభుత్వం వచ్చాక తలసరి ఆదాయం పెరిగింది: గవర్నర్
  • అవకాశాలిస్తే ప్రతి ఒక్కరూ మెరుగైన సేవలు అందిస్తారు: గవర్నర్‌

10:06 AM, 24 Feb 2025 (IST)

వైఎస్సార్సీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని ఆ పార్టీ సభ్యుల నినాదాలు

  • శాసనసభలో వైఎస్సార్సీపీ సభ్యుల నినాదాలు
  • వైఎస్సార్సీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని ఆ పార్టీ సభ్యుల నినాదాలు
  • వైఎస్సార్సీపీని ప్రతిపక్షంగా గుర్తించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినాదాలు
  • వియ్ వాంట్ జస్టిస్‌ అంటూ వైఎస్సార్సీపీ సభ్యుల నినాదాలు
  • వైఎస్సార్సీపీ సభ్యుల నినాదాల మధ్యే గవర్నర్ ప్రసంగం

10:02 AM, 24 Feb 2025 (IST)

గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

  • అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం
  • గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

9:57 AM, 24 Feb 2025 (IST)

అసెంబ్లీ వద్దకు చేరుకున్న గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌

  • అసెంబ్లీ వద్దకు చేరుకున్న గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌
  • గవర్నర్‌కు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, సభాపతి అయ్యన్న
  • గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు

8:58 AM, 24 Feb 2025 (IST)

ఈనెల 28న శాసనసభలో 2025-26 వార్షిక బడ్జెట్

  • నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు
  • ఉ.10 గoటలకు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
  • నేడు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్
  • గవర్నర్ ప్రసంగం అనంతరం వాయిదా పడనున్న శాసనసభ
  • సభ నిర్వహణపై శాసనసభ, శాసనమండలి వ్యవహారాల సలహా కమిటీలు భేటీ
  • అసెంబ్లీ సమావేశాల అజెండా ఖరారు చేయనున్న బీఏసీ
  • అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు దాదాపు 3 వారాలు నిర్వహించే అవకాశం
  • గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రేపు చర్చ
  • చివరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానo
  • 26న శివరాత్రి, 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ దృష్ట్యా 2 రోజులు సభకు సెలవు
  • ఈనెల 28న శాసనసభలో 2025-26 వార్షిక బడ్జెట్
  • 2025-26 వార్షిక బడ్జెట్‌కు లాంఛనంగా ఆమోదముద్ర వేయనున్న మంత్రివర్గం
  • మార్చి1, 2తేదీలు అసెంబ్లీకి సెలవు
  • మార్చి 3 నుంచి బడ్జెట్ సహా వివిధ అంశాలపై అసెంబ్లీలో చర్చలు

8:57 AM, 24 Feb 2025 (IST)

అసెంబ్లీ సమావేశాలు దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

  • అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణకు సర్వం సిద్ధం
  • అసెంబ్లీ సమావేశాలు దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
  • సభకు వచ్చే సభ్యులు మారణాయుధాలు, ప్లకార్డులు తీసుకురాకూడదని స్పష్టం
  • అసెంబ్లీ ఆవరణలో సభ్యులు నినాదాలు చేయడం, ప్లకార్డులను ప్రదర్శించకూడదని స్పష్టం
  • కరపత్రాలు పంపిణీ చేయడం వంటివి చేయరాదని స్పష్టం చేసిన సభాపతి
  • సభా పరిసరాల్లో సమావేశాలు, ప్రదర్శనలు, ధర్నాలు పూర్తిగా నిషేదం
  • అసెంబ్లీ ప్రాంగణంలో ఇతరులకు ఎట్టిపరిస్తితుల్లో అమనుతి లేదని స్పష్టీకరణ
  • భద్రతా దృష్ట్యా సభ్యుల పీఏలకు ప్రాంగణంలోకి వచ్చేందుకు పాస్‌లు రద్దు
  • అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధం లేని ఉద్యోగులు, సిబ్బందికి అనుమతి నిరాకరణ
Last Updated : Feb 24, 2025, 11:19 AM IST

ABOUT THE AUTHOR

...view details