Karnataka Kumki Elephants for AP :రాష్ట్రంలో గజరాజుల దాడిని అరికట్టేందుకు కర్నాటక నుంచి 8 కుంకీ ఏనుగులు ఏపీకి రానున్నాయి. వీటిని మన్యం పార్వతీపురం, చిత్తూరు జిల్లాలకు తరలించనున్నారు. మన్యం ప్రాంతాలు, చిత్తూరు అటవీ ప్రభావిత ప్రాంతాల్లో ఏనుగుల గుంపు జనారణ్యంలోకి వస్తున్నాయి. తద్వారా జరుగుతున్న నష్టం, వాటి దాడులతో ప్రాణాలను కోల్పోతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి చెక్ పెట్టేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చర్యలు తీసుకుంటున్నారు.
కర్ణాటక నుంచి ఏపీకి 8 కుంకీ ఏనుగులు - రాష్ట్రంలో గజరాజుల బెడదకు చెక్ - Pawan Kalyan on Kumki Elephants - PAWAN KALYAN ON KUMKI ELEPHANTS
Pawan Kalyan on Kumki Elephants : ఏపీకి 8 కుంకీ ఏనుగులు రానున్నాయి. రాష్ట్రంలో గజరాజుల దాడిని ఆరికట్టడంలో భాగంగా కర్ణాటక నుంచి వీటిని తీసుకొస్తున్నారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ప్రతినిధులు ఈ నెల 27న సమావేశమై అంగీకార పత్రంపై సంతకం చేయనున్నారు. ఈ విషయంపై పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 25, 2024, 2:02 PM IST
ఇందులో భాగంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అక్కడి అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి.ఖండ్రేతో పవన్ కల్యాణ్ ఇప్పటికే చర్చలు జరిపారు. ఏపీలో గజరాజుల దాడులు అరికట్టేందుకు కుంకీ ఏనుగుల ఆవశ్యకతను తెలియజేశారు. రాష్ట్రానికి 8 కుంకీ ఏనుగులు కావాలని కోరారు. దీనికి సంబంధించి ఇరు రాష్ట్రాల ప్రతినిధులు, అధికారులు ఈ నెల 27న సమావేశమై అంగీకార పత్రంపై సంతకం చేయనున్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గజరాజుల దాడులకు పరిష్కారం లభించినందుకు పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
మడ అడవులు విధ్వంసం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు : పవన్ కల్యాణ్ - Pawan on Mada Forests Protection