CM Chandrababu Coming Back From Davos: ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం దావోస్ నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. జూరిచ్ వినాశ్రయం నుంచి స్వదేశానికి పయనం అయ్యారు. గురువారం రాత్రికి దిల్లీకి చేరుకోనున్నారు. దిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా 1 జన్‌పథ్‌లోని నివాసానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ద్వారా ప్రపంచ వేదికపై ఏపీలో పరిశ్రమల అనుకూల విధానాల సీఎం వెల్లడించారు. ప్రభుత్వ పాలసీలు, అవకాశాలు, ఆలోచనలను వివరించి పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ సంస్థలకు ఆహ్వానం పలికారు. ముఖాముఖి భేటీలు, సదస్సులు, చర్చలు నిర్వహించారు. మెర్ ఎస్కే నుంచి మైక్రోసాఫ్ట్ వరకూ ప్రపంచ స్థాయి సంస్థలు, సీఈవోలతో చర్చలు జరిపారు. సీఎం చంద్రబాబు బృందం నెట్వర్క్ విస్తరణ, బ్రాండ్ ప్రమోషన్లో విజయం సాధించింది.
దిల్లీలో కేంద్రమంత్రులు, ప్రముఖులతో భేటీ: శుక్రవారం పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులను చంద్రబాబు కలవనున్నారు. కేంద్ర ఆర్ధిక, వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖల మంత్రులతో భేటీ కానున్నారు. ఫిబ్రవరి 1న పార్లమెంటు ముందుకు కేంద్ర బడ్జెట్ రానున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు.
ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ని మర్యాదపూర్వకంగా కలుస్తారు. అనంతరం కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో భేటీ తరువాత విజయవాడ బయలుదేరనున్నారు. సమయం ఇస్తే పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని సైతం సీఎం చంద్రబాబు కలిసే అవకాశం ఉంది.
దావోస్‌లో మీటింగ్‌కు కాలినడకన వెళ్లిన మంత్రి లోకేశ్ - విప్రో, టెమాసెక్ ప్రతినిధులతో భేటీ
అప్పుడు ఐటీ - ఇప్పుడు ఏఐ: బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు సమావేశం