Anna Canteens Reopening on August 15 : రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఆగస్టు 15న వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 83 క్యాంటీన్లను సెప్టెంబరు నెలాఖరుకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. 183 క్యాంటీన్లను ఒకే రోజు ప్రారంభించాలని మొదట ప్రభుత్వం భావించింది. కానీ కొన్నిచోట్ల భవన నిర్మాణ పనుల్లో జాప్యమయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో రెండు విడతల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో నిలిచిన అన్న క్యాంటీన్లు :2014-19లో టీడీపీ హయాంలో 5 రూపాయలకే పేదలకు భోజనం అందించడానికి ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూసేసింది. క్యాంటీన్ల భవనాలను వార్డు సచివాలయాలకు, మున్సిపల్ కార్యాలయాలకు కేటాయించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే అన్న క్యాంటీన్లు తిరిగి తెరవడానికి ఏర్పాట్లు చేస్తోంది. క్యాంటీన్ల భవనాలకు మరమ్మతులు చేసి, వాటిలో సౌకర్యాలు కల్పించేందుకు నిధులు విడుదల చేసింది. గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన అసలు పనులే ప్రారంభించని చోట కొత్త క్యాంటీన్ భవన నిర్మాణాలకు టెండర్లు పిలిచి పనులు అప్పగించింది.
త్వరలో మళ్లీ ఐదు రూపాయలకే భోజనం - సీఎం ఆదేశాలతో అన్న క్యాంటీన్లు తెరిచేందుకు అధికారుల చర్యలు - CM Orders To Anna Canteen Reopens
ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లు ప్రారంభం :తొలి విడతగా వంద క్యాంటీన్లను స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. వీటికి ఆహారం సరఫరా చేయడానికి ఇటీవలనే టెండర్లు కూడా పిలిచారు. మొత్తం ప్రక్రియను వచ్చే నెల మొదటి వారంలోగా పూర్తి చేయాలని పుర, నగరపాలక సంస్థలకు ప్రభుత్వం ఆదేశించింది. అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
"అన్న క్యాంటీన్ల వల్ల పేదవారికి ఉపయోగమే. వ్యాపారస్థులకు, బయట పనిమీద వచ్చి వెళ్లే వారికి ఇవి చాలా ఉపయోగపడతాయి. బయట టిఫిన్ చేయడానికే రూ. 30 అవుతున్నాయి. ఇంకా రూ. 5లకే భోజనం అంటే చాలా మంచిది. కూలీ పనులు, చిన్న వ్యాపారస్థులకు అంతో ఇంతో డబ్బులు కూడా ఆదా అవుతుంది. చంద్రబాబు ప్రభుత్వం బాగా చేస్తోంది." -స్థానికులు
టీడీపీ అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తాం: నారా భువనేశ్వరి
ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు రీ ఓపెన్ - ఐదు రూపాయలకే భోజనం: మంత్రి నారాయణ - Anna Canteens ReOpen in ap