Decrease Liquor Prices : మందుబాబులకు గుడ్‌న్యూస్.. కొన్ని మద్యం బాటిల్స్ క్వార్టర్‌పై ఏకంగా రూ.50 తగ్గుతుంది. అదే ఫుల్ బాటిల్ అయితే చూసుకొండి ఇక ఏకంగా రూ.100 దాటే ఉంటుంది. దీంతో మద్యం ప్రియులు తెగ సంతోషపడిపోతున్నారు. కానీ ఇది తెలంగాణ రాష్ట్రంలో కాదు.. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో. జగన్ రెడ్డి సర్కారు ఉన్నప్పుడు మద్యం ధరలను విచ్చల విడిగా పెంచేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చి.. బ్రాండెడ్ మద్యాన్ని ఏపీలోకి తీసుకొచ్చారు. దీంతో నకిలీ మద్యం(జే బ్రాండ్స్) పోయి మళ్లీ పాత మద్యం రావడంతో మందుబాబులు సందడి చేసుకుంటున్నారు.
వివరాల్లోకి వెళితే, ఏపీలో మూడు ప్రముఖ మద్యం కంపెనీలు మద్యం ధరలను తగ్గించేందుకు ముందుకు వచ్చాయి. దీంతో అక్కడి ఎక్సైజ్ శాఖ ఆమోదం తెలిపి వెంటనే ఆ ధరలను అమల్లోకి వస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మద్యం బాటిళ్లను అదే ధరకు అమ్మి.. ఆ తర్వాత కొత్తగా వచ్చిన మద్యం సీసాలను తగ్గించిన ధరలతో అమ్మనున్నారు. అయితే గత ఐదేళ్లుగా ప్రముఖ బ్రాండ్ల విక్రయాలకు అవకాశం లేదు.. కానీ తాజాగా అన్ని బ్రాండ్లను విక్రయించుకోవడానికి అనుమతిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మద్యం బాటిళ్ల ధరలు దాదాపు రూ.50 వరకు తగ్గాయి.
ధరలు తగ్గిన మద్యం బాటిళ్లు :
- రాయల్ చాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ క్వార్టర్ ధర రూ.230 నుంచి రూ.210 వరకు తగ్గింది. అదే ఫుల్ బాటిల్ అయితే రూ.920 నుంచి రూ.840కి తగ్గింది.
- మాన్షన్ హౌస్(MH) క్వార్టర్ ధర 2019లో రూ.110గా ఉంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.300 చేసింది.. దీనిపై విమర్శలు రావడంతో రూ.220కి తగ్గించారు. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం మారడంతో క్వార్టర్ ధర రూ.220 నుంచి రూ.190కి తగ్గింది. హాఫ్ ఫుల్ బాటిల్ అయితే రూ.440 నుంచి రూ.380కి తగ్గగా, ఫుల్ బాటిల్ ధర రూ.870 నుంచి రూ.760కి భారీగా తగ్గింది.
- యాంటీక్విటీ విస్కీ ఫుల్ బాటిల్ ధర రూ.1,600 నుంచి రూ.1,400కు తగ్గి మందుబాబుకి రూ.200లకు మిగులుతోంది.