తెలంగాణ

telangana

ETV Bharat / state

అల్లు అర్జున్​ అరెస్ట్​ వ్యవహారంపై పవన్​ కల్యాణ్​ రియాక్షన్​ ఇదే - AP DY CM PAVAN REACTION ON ARJUN

'పుష్ప' హీరో అల్లు అర్జున్​ అరెస్ట్​ వ్యవహారంపై స్పందించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్​ కల్యాణ్ - నకిలీ ఐపీఎస్​ అధికారి వ్యవహారంపై పవన్​ సీరియస్​

AP DY CM Pawan Kalyan Reaction On Allu Arjun Arrest
AP DY CM Pawan Kalyan Reaction On Allu Arjun Arrest (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 28, 2024, 9:43 PM IST

Updated : Dec 28, 2024, 10:53 PM IST

AP DY CM Pawan Kalyan Reaction On Allu Arjun Arrest :ఆంధ్రప్రదేశ్​లోని అన్నమయ్య జిల్లాలో ప్రత్యర్థుల దాడిలో గాయపడ్డ గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబును కడప రిమ్స్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పరామర్శించారు. అనంతరం పవన్‌ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధ్యులను వదిలిపెట్టమని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా ఆయన స్పందించారు. సమస్యలు చాలా ఉన్నాయని, సినిమా అనేది చిన్న సమస్యని పవన్ అన్నారు. బాధితుడి పరామర్శకు వచ్చినప్పుడు ఇలాంటి విషయాలు మాట్లాడడం సరికాదని హితవు పలికారు.

భద్రత బాధ్యత పోలీసులదే :పవన్ కల్యాణ్పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి కూడా ఉన్నారన్న వ్యవహారంపై కూడా పవన్ కల్యాణ్‌ స్పందించారు. నకిలీ ఐపీఎస్‌ అధికారి ఎలా వచ్చాడనేది ఉన్నతాధికారులు చూసుకోవాలని, ఆ బాధ్యత ఇంటెలిజెన్స్, డీజీపీ, హోంమంత్రిదేనని తెలిపారు. తనకు పని చేయడం ఒక్కటే తెలుసన్న ఆయన తన భద్రత బాధ్యతలను చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు పెద్దలదేనని వివరించారు. ఈ అంశంపై తన పేషీ అధికారులు ఏపీ డీజీపీ దృష్టికి తీసుకెళ్లారని, ఈ విషయంపై తాను కూడా డీజీపీతో మాట్లాడతానని పవన్​ కల్యాణ్ తెలిపారు.

అభిమానులపై పవన్ అసహనం :ఇదిలా ఉండగా, డిప్యూటీ సీఎం పవన్​ను చూసేందుకు అక్కడికి వచ్చిన పలువురు ఆయన అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయన సీరియస్‌గా మీడియాతో మాట్లాడుతున్నప్పుడు 'ఓజీ ఓజీ ఓజీ' అంటూ స్లోగన్లు చేశారు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఏంటయ్యా మీరు. ఎప్పుడు ఏ స్లోగన్‌ ఇవ్వాలో మీకు తెలియదు. పక్కకు రండి" అంటూ వారిపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్​ అసహనం వ్యక్తం చేశారు.

పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్న విషయం విధితమే. వరుస సమావేశాలు, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. మరోవైపు, దర్శక, నిర్మాతలకు ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే పట్టాలెక్కించిన సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. తన తదుపరి చిత్రాలు ఓజీ, హరిహర వీరమల్లు సినిమా చిత్రీకరణలో వీలు కుదిరినప్పుడు హాజరవుతున్నారు. సుజీత్‌ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రమే ఓజీ. యాక్షన్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌గా ఇది సిద్ధమవుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ పర్యటనలో నకిలీ ఐపీఎస్

'రేవతి చనిపోయిన విషయం నాకు ఎవరూ చెప్పలేదు' - పోలీసుల విచారణలో అల్లుఅర్జున్‌ భావోద్వేగం ​

Last Updated : Dec 28, 2024, 10:53 PM IST

ABOUT THE AUTHOR

...view details