Kadapa Election Results 2024 :కడపలో తెలుగుదేశం అభ్యర్థి రెడ్డప్పగారి మాధవి వైఎస్సార్సీపీ అభ్యర్థి ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషాపై 22 వేల 852 ఓట్ల ఆధిక్యంతో విజయ దుందుభి మోగించారు. ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. పులివెందులలో ముఖ్యమంత్రి జగన్ 61 వేల 176 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిపై గెలుపొందారు. 2019 ఎన్నికలతో పోలిస్తే జగన్ మెజార్టీ 28 వేల ఓట్లు తగ్గింది. బద్వేలులో వైఎస్సార్సీపీ అభ్యర్థి దాసరి సుధ బీజేపీ అభ్యర్థి బొజ్జా రోషన్నపై గెలిచారు. కోడూరులో జనసేన అభ్యర్థి ఆరవ శ్రీధర్ వైఎస్సార్సీపీ అభ్యర్థి కోరుముట్ల శ్రీనివాసులుపై విజయం సాధించారు. జమ్మలమడుగులో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి వైఎస్సార్సీపీ అభ్యర్థి సుధీర్‌రెడ్డిపై గెలుపొందారు. కమలాపురంలో టీడీపీ అభ్యర్థి కృష్ణచైతన్యరెడ్డి వైఎస్సార్సీపీ అభ్యర్థి రవీంద్రనాథ్‌రెడ్డిపై ఆధిక్యం సాదించారు.
ప్రొద్దుటూరులో టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి వైఎస్సార్సీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిపై స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించారు. మైదుకూరులో తెలుగుదేశం అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ వైఎస్సార్సీపీ అభ్యర్థి రఘురామిరెడ్డిపై విజయకేతనం ఎగురవేశారు. రాజంపేటలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆకెపాటి అమర్నాథ్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి సుగవాసి బాల సుబ్రహ్మణ్యంపై గెలుపొందారు. రాయచోటిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి రామ్‌ప్రసాద్‌రెడ్డిపై విజయం సాధించారు.కడప పార్లమెంటు స్థానంలో వై.ఎస్.అవినాష్‌రెడ్డి విజయం సాధించగా రాజంపేట పార్లమెంట్ సీటును మిథున్‌రెడ్డి గెలుచుకున్నారు.
LIVE UPDATES: ఎన్డీయే ఘన విజయం - హిందూపురం నుంచి బాలకృష్ణ హ్యాట్రిక్ - AP ELECTION RESULTS 2024