Alwal Road Accident Boy Died : ఇప్పటికే ఆ కుటుంబ పెద్ద ఆరోగ్యం సరిగ్గా లేక నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు కళ్ల ముందే కుమారుడి మృతితో ఆ ఇంటి ఇల్లాలి రోదనకు అంతే లేదు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి తండ్రి.. ఆ కుమారుడి మరణ వార్త విని తట్టుకుంటాడా? ఇలా కష్టకాలంలో చేతికి అందుతున్న వంశ వృక్షాన్ని కోల్పోయిన ఆ కుటుంబం పరిస్థితి తెలుసుకుందాం.
DCM Van Crash in Alwal Boy Died :తన భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తన తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో తల్లితో కలిసి ఆసుపత్రికి వెళ్లి ఇంటికి వెళుతున్నారు. అల్వాల్‌లోని రిలయన్స్ ఫ్రెష్‌కు సరుకులతో వచ్చిన డీసీఎం వాహనం హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో రోడ్డుపైకి దూసుకొచ్చింది. రహదారిపై నడుచుకుంటూ వెళ్లుతున్న వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడు తిరుపాల్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లినా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో తల్లికి స్వల్ప గాయాలయ్యాయి.
వరుడి ఇంట్లో 'తిలక్' వేడుక- తిరిగివస్తుండగా ప్రమాదం- 'వధువు' కుటుంబంలో ఆరుగురు మృతి