తెలంగాణ

telangana

ETV Bharat / state

'సంధ్య థియేటర్‌' ఘటన - స్పందించిన బన్నీ టీమ్ - ఏమందంటే? - ALLU ARJUN ON SANDHYA THEATRE ISSUE

సంధ్య థియేటర్‌ వద్ద తోపులాట ఘటన - స్పందించిన అల్లు అర్జున్ టీమ్ - చికిత్సకు అవసరమైన సహాయాన్ని అందజేస్తామని వెల్లడి.

Sandhya theatre issue
Allu Arjun Team Responded On Sandhya theatre issue (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 5, 2024, 2:35 PM IST

Updated : Dec 5, 2024, 3:34 PM IST

Allu Arjun Team Responded On Sandhya theatre issue :అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప ది రూల్‌’ ప్రీమియర్‌ షోలో భాగంగా సంధ్య థియేటర్‌ వద్ద బుధవారం రాత్రి తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఇందులో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు శ్రీతేజ అస్వస్థతకు గురయ్యాడు. ఈ ఘటనపై తాజాగా అల్లు అర్జున్‌ టీమ్‌ స్పందించింది. నిన్న రాత్రి సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరమని తెలిపింది. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. తమ బృందం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తామని తెలిపింది.

స్పందించిన 'మైత్రి' :మరోవైపు సంధ్య థియేటర్ ఘటనపై మైత్రీ మూవీ మేకర్స్ స్పందించారు. బుదవారం రాత్రి ప్రీమియర్ షో సమయంలో జరిగిన విషాద సంఘటనతో తాము చాలా బాధపడుతున్నమని తెలిపారు. చికిత్స పొందుతున్న బాలుడు క్షేమంగా బయటపడాలని కోరుకుంటున్నామన్నారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబానికి సాధ్యమైనంత వరకు అన్ని విధాల సహాయపడతామని తెలిపారు.

అలాంటి వార్తలు ప్రసారం చేయకండి : మరోవైపు తోపులాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ కిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరో 78 గంటలు గడిస్తే గాని బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పలేమన్నారు. ప్రస్తుతం శ్రీతేజ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. మరోవైపు సామాజిక మాధ్యమాలు, పలు యూట్యూబ్ ఛానళ్లలో బాలుడు చనిపోయినట్టు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమమ్యారు. దయచేసి అలాంటి వార్తలు ప్రసారం చేయొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ తమకు అండగా నిలవాలని కోరారు.

అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు :పుష్ప-2 బెనిఫిట్‌ షో కోసం హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్దకు బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో వచ్చిన చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీఛార్జి చేయడంతో రేవతి(35) అనే మహిళతోపాటు ఆమె కుమారుడు శ్రీతేజ(9) కింద పడిపోయి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. గమనించిన పోలీసులు వెంటనే తల్లీకుమారులను పక్కకు తీసుకెళ్లి సీపీఆర్​ చేశారు. వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ తల్లి మృతి చెందారు. కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది.

'పుష్ప' తీసిన ప్రాణం : సంధ్య థియేటర్​కు అల్లుఅర్జున్ - తొక్కిసలాటలో మహిళ మృతి

పుష్ప-2 చిత్రం నిలిపివేయాలంటూ పిటిషన్‌ - కొట్టేసిన హైకోర్టు

Last Updated : Dec 5, 2024, 3:34 PM IST

ABOUT THE AUTHOR

...view details