తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ నిఘా విభాగాలకు నిధులు కేటాయించాలి - అమిత్ షాకు సీఎం రేవంత్ విజ్జప్తి - CM Revanth Reddy Meets Amit Shah

CM Revanth Reddy Meets Amit Shah : రాష్ట్ర సమస్యలు, విభజన హామీలపై కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో అత్యున్న‌త నిఘా విభాగాలైన తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (టీజీ న్యాబ్‌), తెలంగాణ సైబ‌ర్ సెక్యూరిటీ బ్యూరో ఆధునీక‌ర‌ణ‌కు అవ‌స‌ర‌మైన నిధులు మంజూరు చేయాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు రేవంత్ రెడ్డి విజ్జప్తిచేశారు.

By ETV Bharat Telangana Team

Published : Jul 4, 2024, 8:28 PM IST

CM Revanth Reddy Meets Amit Shah in Delhi Today
CM Revanth Reddy Meets Amit Shah (ETV Bharat)

CM Revanth Reddy Meets Amit Shah in Delhi Today : రాష్ట్రంలో అత్యున్న‌త నిఘా విభాగాలైన తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (టీజీ న్యాబ్‌), తెలంగాణ సైబ‌ర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్‌బీ) ఆధునీక‌ర‌ణ‌కు అవ‌స‌ర‌మైన నిధులు మంజూరు చేయాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దిల్లీలో అమిత్ షాను కలిసిన రేవంత్ రెడ్డి సుమారు గంట‌పాటు కొన‌సాగిన భేటీలో వివిధ అంశాల‌ను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. భేటీలో ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క పాల్గొన్నారు. డ్రగ్స్, సైబర్ నేరాలను అరికట్టడానికి కావ‌ాల్సిన ఆధునిక సాంకేతిక పరిజ్జానం, ప‌రిక‌రాల‌ కొనుగోలు కోసం టీజీ న్యాబ్‌కు రూ.88 కోట్లు, టీజీ సీఎస్‌బీకి రూ.90 కోట్లు కేటాయించాల‌ని కేంద్ర మంత్రి అమిత్ షాను సీఎం రేవంత్ కోరారు.

'తెలంగాణ అభివృద్ధికి సహకరించండి' - ప్రధాని మోదీకి మరోసారి విజ్ఞప్తి చేసిన సీఎం రేవంత్

ఐపీఎస్ పోస్టుల మంజూరు :ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఐపీఎస్ క్యాడర్ సమీక్ష చేయడం తప్పనిసర‌ని, తెలంగాణ‌కు సంబంధించి 2016లో మొదటి సారి సమీక్ష నిర్వహించార‌ని నాటి నుంచి చేయ‌నుందున వెంట‌నే స‌మీక్ష చేయాల‌ని కోరారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు 61 ఐపీఎస్ పోస్టులు కేటాయించార‌ని అద‌నంగా మరో 29 ఐపీఎస్‌ పోస్టులు కేటాయించాల‌ని విజ్ఙ‌ప్తి చేశారు. గతంలో తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలైన ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, మ‌హారాష్ట్రల్లో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో సెక్యూరిటీ ఫోర్స్ క్యాంపులు ఏర్పాటు చేసిన విష‌యాన్ని అమిత్ షాకు గుర్తు చేశారు. ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా క్యాంపులను ఏర్పాటు చేయాలని తెలిపారు.

సీఆర్పీఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేయాలి : తెలంగాణ రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదాన్ని అణిచి వేసేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండవాయి గ్రామం, ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామ పరిధిలో సీఆర్ఫీఎఫ్ జేటీఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేయాల‌ని సీఎం రేవంత్ తెలిపారు. మావోయిస్టుల కద‌లికల నియంత్ర‌ణ‌కు జేటీఎఫ్ క్యాంపులు ఉపయోగపడ‌తాయ‌ని తెలిపారు. ఎస్పీవోల‌కు చెల్లించాల్సిన నిధుల్లో కేంద్ర వాటా పెండింగ్​లో ఉంద‌ని ఆ మొత్తం రూ.18.31 కోట్లు విడుదల చేయాల‌ని కోరారు. మావోయిస్టుల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ఎస్పీవోల్లో మాజీ సైనికులు, మాజీ పోలీసులను మాత్రమే చేర్చుకోవాలనే నిబంధన ఇబ్బందిగా ఉంద‌న్నారు. 1065 మందిని ఎస్పీవోల్లో చేర్చుకోవడానికి నిబంధనలు స‌డ‌లించాలని కోరారు.

హైదరాబాద్​లో రియల్ ఎస్టేట్ పుంజుకుంది : సీఎం రేవంత్ రెడ్డి

నేడు ప్రధాని, కేంద్ర హోం మంత్రితో సీఎం రేవంత్​ భేటీ!

ABOUT THE AUTHOR

...view details