ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైల్వే స్థలాల విషయంలో శాశ్వత పరిష్కారం చూపుతాం : మాగుంట శ్రీనివాసులు రెడ్డి - issue of homesteads in ongole

ఒంగోలులో ఎన్నో ఏళ్లుగా ఉన్న రైల్వే స్థలాల విషయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శాశ్వత పరిష్కరం చూపుతామని ఒంగోలు పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, దామచర్ల జనార్ధన్ నేతలు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నవరప్పాడు ప్రాంతంలో బాధితులతో సమావేశం నిర్వహించారు.

Alliance_Leaders_Assured_About_Railway_Sites_in_ongole
Alliance_Leaders_Assured_About_Railway_Sites_in_ongol

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 4:55 PM IST

సమస్యాత్మకంగా ఉన్న రైల్వే స్థలాల విషయంలో శాశ్వత పరిష్కారం చూపుతాం : మాగుంట శ్రీనివాసులు రెడ్డి

Alliance Leaders Assured About Railway Sites in ongole:ఒంగోలు పట్టణంలో ఎన్నో ఏళ్లుగా సమస్యాత్మకంగా ఉన్న రైల్వే స్థలాల విషయంలో శాశ్వత పరిష్కరం చూపుతామని టీడీపీ ఒంగోలు పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, దామచర్ల జనార్ధన్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నవరప్పాడు ప్రాంతంలో గుడిసెవాసుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గుడిసె వాసులు తమ సమస్యలను నేతల దృష్టికి తీసుకువచ్చారు. అన్నవరప్పాడులో రైల్వే శాఖకు సంబంధించిన స్థలాలలో దాదాపు 2000 కుటుంబాలకు నివసిస్తున్నామని, తమకు పట్టాలు ఇచ్చేందుకు గతంలో ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. ఈ మేరకు తము దిల్లీ వరకు వెళ్లీ రైల్వే శాఖను అభ్యర్థించామని కాలనీవాసులు పేర్కొన్నారు.

ఒంగోలు గిత్తల ఊసే లేదు - పాల డెయిరీకి పాడె కట్టిన జగన్ - cm ys jagan neglected ongole dairy

వైసీపీ ప్రభుత్వంలోని నేతలను గత ఐదేళ్లుగా అభ్యర్థిస్తున్న ఎటువంటి లాభం లేదని వాపోయారు. సమస్యను పరిష్కరించమని అడిగిన ప్రతిసారి ఈరోజు రేపు అంటూ నీతులు చెబుతూ ఐదేళ్లు గడిచిపోయాయని విమర్శించారు. గత ఐదు సంవత్సరాలుగా ఇంటి స్థాలాలకు సంబంధించిన ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తమ సమస్యకు పరిష్కారం చూపాలని గుడిసే వాసులు అభ్యర్థించారు. దీనికి అభ్యర్థులు ఇద్దరు సానుకూలంగా స్పందించారు.

స్వామిభక్తిని చాటుకున్న పోలీసులు-బాలినేని నామినేషన్ దాఖలులో అడుగడుగునా ఉల్లంఘనలు - Balineni Srinivasa Reddy

ఈ సందర్భంగా ఎంపీ మాగుంట మాట్లాడుతూ, గతంలో ఈ సమస్యపై తాను కేంద్ర రైల్వే శాఖ అధికారులు సంప్రదించానని గుర్తుచేశారు. అప్పట్లో కొంతవరకు ఇందుకు సంబంధించిన ఫైల్ ముందుకు నడిచినప్పటికీ తరువాత అర్ధాంతరంగా పని నిలిచిపోయిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్య పరిస్కరిస్తామని వెల్లడించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ, తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దృష్టికి ఈ సమస్య తీసుకు వెళ్లాను. కొంతమందితో దిల్లీ కూడా వెళ్లామని గుర్తుచేశారు. తరువాత వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఇందుకు సంబంధించిన ప్రక్రియ నిలిచిపోయిందని తెలిపారు. మళ్లీ తము అధికారంలోకి వస్తే కాలనీవాసులకు పట్టాలు ఇచ్చి హక్కుదారులుగా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

అనంతరం ఇద్దరు నేతలు సభ ముగించుకొని స్థానిక పాత బైపాస్ లోని ఓ ఫంక్షన్ హాలులో జిల్లాలోని న్యాయవాదులతో కలిసి ఆత్మీయ సమావేశంలో పాల్కొన్నారు. న్యాయవాదులకు ఇంటి స్థలాలతోపాటు, బీమాను వర్తింపజేయనున్నట్లు చెప్పారు. ప్రమాద బీమా రూ.15 లక్షలు అందించేలా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. న్యాయవాద మిత్ర పేరుతో యువ న్యాయవాదులకు రూ.7 వేలు చొప్పున స్టయిఫండ్ అందించనున్నట్లు చెప్పారు.

అణువణువు తనిఖీలు ఎక్కడపడితే అక్కడ బారికేడ్లు- పోలీసుల అత్యుత్సాహం - People Problems in kanigiri

ABOUT THE AUTHOR

...view details