A Boy Has Been Born With a Small Tail : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. పుట్టుకతోనే తోకతో పుట్టిన ఆర్నెళ్ల బాలుడికి సర్జరీ చేసి తోకను తొలగించారు. గత ఏడాది అక్టోబర్‌లో ఓ మహిళకు తోకతో ఉన్న బాలుడు జన్మించాడు. బాలుడికి మూడు నెలలు నిండేసరికి అది 15సెంటిమీటర్లు కావాడంతో, కంగారుపడిన తల్లిదండ్రులు బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తోక వెన్నుపూసకి అనుసంధానం అయి ఉన్నట్లు గుర్తించిన వైద్యులు, ఆపరేషన్ చేసి తోకను తొలగించారు.
తోకతో జన్మించిన బాలుడు - శస్త్రచికిత్స చేసి తొలగించిన వైద్యులు - The Boy With A Tail - THE BOY WITH A TAIL
Boy Born With a Tail : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. తోకతో జన్మించిన బాలుడికి శస్త్రచికిత్స చేసి తొలగించారు. ఆరు నెలల కిందట జరిగిన ఈ ఆపరేషన్ తరువాత బాలుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Published : Jul 16, 2024, 2:48 PM IST
|Updated : Jul 16, 2024, 3:54 PM IST
ఆరు నెలల కిందట జరిగిన ఈ ఆపరేషన్ తరువాత బాలుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇలాంటి కేసుల్లో సర్జరీ అనంతరం నాడి సంబంధిత సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంటుందని, కానీ బాలుడు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించటం అరుదని వెల్లడించారు. ప్రపంచంలో కేవలం ఇలాంటి 40 కేసులు మాత్రమే ఇప్పటి వరకు గుర్తించినట్లు వైద్యులు తెలిపారు.
ఎలాంటి యోగాసనాలైనా ఫుల్ ఈజీగా!- 'హర్షిక' సూపర్ టాలెంట్- ఇంటి నిండా మెడల్సే!! - Child Expert In Yoga