Minister Tummala Review on Kharif Seed Availability : గత వారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల ధాటికి మొత్తం ఒకటేసారి పచ్చిరొట్ట విత్తనాలకు కొన్ని ప్రాంతాల్లో అధికంగా డిమాండ్ ఏర్పడిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ ఏడాది వానా కాలం సీజన్ పురస్కరించుకుని రైతులకు రాయితీపై సరఫరా చేయనున్న పచ్చిరొట్ట ఎరువుల విత్తనాల పంపిణీ వివరాలు, వివిధ జిల్లాలవ్యాప్తంగా అమ్మకాలు, సన్న రకాల వడ్ల విత్తనాల లభ్యతపై సంబంధిత అధికారులతో సచివాలయంలో మంత్రి సమీక్షించారు.
పచ్చిరొట్ట విత్తనాలు సంబంధిత ఏజెన్సీలు, టీజీ సీడ్స్, నేషనల్ సీడ్ కార్పోరేషన్‌తో సమన్వయం చేసుకొంటూ రైతుల అవసరాల మేరకు అందుబాటులో ఉంచుతున్నామని ఈ సందర్భంగా అధికారులు మంత్రి వద్ద తెలియజేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 50,942 క్వింటాళ్ల జిలుగు, 11,616 క్వింటాళ్ల జనుము, 236 క్వింటాళ్ల పిల్లి పెసర విత్తనాలు అందుబాటులోకి తీసుకురాగా, 20,518.40 క్వింటాళ్ల విత్తనాలు రైతులు కొనుగోలు చేశారని, ఇంకా 30,400 క్వింటాళ్ల విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నాయని ప్రస్తావించారు.
రైతులకు అందుబాటులో ఉంచిన పత్తి విత్తనాల వివరాలపై తుమ్మల ఆరా :అందుకోసం రాయితీ భరించేందుకు ప్రభుత్వం 1140.22 కోట్ల రూపాయలు భరిస్తోందని చెప్పుకొచ్చారు. మిగతా విత్తనాలు కూడా సాధ్యమైనంత త్వరగా తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచగలమని అధికారులు తెలిపారు. గత సంవత్సరం ఆయా కంపెనీల బకాయిలు అంశం అధికారులు దృష్టికి తీసుకురాగా, వెంటనే ఆ నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సంవత్సరం గత ఏడాది కంటే ఎక్కువ 15.75 లక్షల క్వింటాళ్ల విత్తనాలు, తగినంత మేర పంపిణీ జరుగుతుందని, రైతులందరూ ఈ అవకాశం వినియోగించుకోవాలని అన్నారు.
విత్తనాలు ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు : మంత్రి తుమ్మల - Minister Tummala On Seed Supply