Adulterated Alcohol in Telangana :తెలంగాణరాష్ట్రంలో కల్తీ మద్యం పెరిగిపోతోంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో మద్యాన్ని కల్తీ చేస్తున్నారు. సీసా మూత తీసి కల్తీ చేస్తే తెలిసిపోతుందని అనుమానం రాకుండా మళ్లీ బిగిస్తున్నారు. జిల్లా కేంద్రం సహా చుట్టు పక్కల ప్రాంతాల్లో మద్యం కల్తీ ఆనవాళ్లు వెలుగు చూసినట్లు మందుబాబులు అంటున్నారు. విలువైన మద్యాన్ని కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్న వైనంపై 'ఈటీవీ భారత్ (ETV Bharat)' కథనం
Adulterated Alcohol Sales Increasing in Telangana : : ఇటీవల కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ మద్యం దుకాణంలోంచి తెచ్చిన రూ.2 వేల పైచిలుకు విలువైన మద్యం ఫుల్ బాటిల్ ఇంటికి వచ్చే సరికి లీకై కారింది. సీసాలో మిగిలిన మద్యాన్ని తాగిన సమయంలో స్పిరిట్ వాసన వచ్చిందని కొనుగోలుదారులు వెల్లడించారు. మద్యం సీసా మూత తీసి కల్తీ చేసి ఎవరికీ అనుమానం రాకుండా మూత మళ్లీ పెట్టారని అనుమానం వ్యక్తం చేశారు.
ఏపీలో 81 కొత్త బ్రాండ్లు, 47 అంతర్జాతీయ మద్యం బ్రాండ్లకు అనుమతి : కొల్లు రవీంద్ర
జిల్లాలోని రామారెడ్డి మండల కేంద్రంలోని మద్యం దుకాణంలో సైతం మండలంలోని 2 గ్రామాలకు చెందిన ఇద్దరు వేరు వేరుగా కొనుగోలు చేసిన రెండు మద్యం సీసాలు ఇదే విధంగా కారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి మాచారెడ్డి మండంలోని మద్యం దుకాణాల్లో సైతం ఈ విధంగా అక్రమాలు వెలుగు చూశాయని మందుబాబులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయమై ఆబ్కారీ శాఖ టాస్క్‌ఫోర్స్ అధికారులు కేసులు చేసిన పలు సందర్భాలు వెలుగు చూశాయి.