Yadiki Cement Factory Incident : అనంతపురం జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. యాడికి మండలం బోయరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని ఓ సిమెంట్ పరిశ్రమలో మరమ్మతులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కిలాన్ మిషనరీ నుంచి వేడిగా ఉన్న వస్తువులు ఒక్కసారిగా కార్మికుల మీద పడ్డాయి. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. వెంటనే బాధితులను అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు శివగా గుర్తించామని తెలిపారు. క్షత్రగాత్రులు షణ్ముఖరెడ్డి, కంబగిరి స్వామి, ధణ్వీర్ సింగ్, దీపక్ సింగ్ అని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ, ఎస్పీ జగదీష్ పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.