ACB issue notices to KTR in Formula E race case :ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) మరోమారు నోటీసులు జారీ చేసింది. గచ్చిబౌలి ఓరియన్ విల్లాలో కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై రేపు హైకోర్టు తీర్పు :ఫార్ములా ఈ రేసు వ్యవహారానికి సంబంధించి ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్‌పై న్యాయస్థానంలో వాదనలు ఇటీవలే ముగిశాయి. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు రేపు(మంగళవారం) ఉదయం 10.30 గంటలకు తీర్పు వెలువరించనుంది.
ఈడీ ముందు హాజరుకు మరింత సమయం కోరిన కేటీఆర్ :ఫార్ములా-ఈ కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ - ఈడీని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు సమయం కోరారు. కేసులో ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని హైకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌లో ఉందని న్యాయస్థానం తీర్పు వెలువరించేంతవరకు సమయం ఇవ్వాలని కోరారు. రేపు విచారణకు హాజరు కావాలని తనకు ఇచ్చిన నోటీసులపై స్పందించిన కేటీఆర్ ఈ మేరకు ఈడీకి సమాధానం పంపారు.
సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై ఏసీబీ క్లారిటీ :మాజీ మంత్రి కేటీఆర్ నివాసంలో ఎసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో రాయదుర్గం ఓరియన్ విల్ల్సా దగ్గర హడావిడి నేలకొంది ఎటువంటి సోదాలు జరగడం లేదని ఏసీబీ ఉన్నతాధికారులు నోట్ రిలీజ్ చేశారు. అరున్నర ఏడు గంటల మధ్యలో ఇద్దరు ఏసీబీ అధికారులు రాయదుర్గం ఓరియన్ విల్లాస్‌కు వచ్చి తొమ్మిదో తేదీన ఏసీబీ కార్యాలయంకు రావాలని కేటీఆర్‌కు నోటీసులు అందజేశారు