ACB Investigation On Balakrishna Case : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టైన రెరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణ వ్యవహారంలో రెండో రోజు అతని బినామీలను ఏసీబీ విచారిస్తోంది. సత్యనారాయణ, భరత్ ఇద్దరు బాలకృష్ణకు బినామీలుగా ఉన్నట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు. అనేక భూములు, స్థలాలు వారిద్దరి పేరు మీద ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే వారిని వరుసగా రెండో రోజు కూడా విచారిస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి వారిని పలిపించి ప్రశ్నిస్తున్నారు. కస్టడీ విచారణ సమయంలో ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు శివబాలకృష్ణ సరైన సమాధానాలు చెప్పకపోవడంతో మరింత లోతుగా ఈ కేసును విచారించాలని అనిశా నిర్ణయించింది.
ముగిసిన శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ - రూ.250 కోట్ల పైనే ఆస్తులున్నట్లు గుర్తింపు
Shiva Bala Krishna Case Update :భరత్‌కుమార్ పేరిట నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరులో 13 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించింది. వాటి కొనుగోలుకు ఆదాయ వనరుల గురించి ప్రశ్నించగా భరత్‌కుమార్ నుంచి సరైన సమాధానం లభించలేదని తెలిసింది. ఈ క్రమంలో శివబాలకృష్ణ అక్రమార్జనతోనే ఆ భూముల్ని కొనుగోలు చేసి భరత్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించినట్లు అనిశా అనుమానిస్తోంది. బాచుపల్లి ప్రాంతంలో ఉండే సత్యనారాయణమూర్తి శివబాలకృష్ణ అక్రమార్జనను ఆస్తులుగా మలచడంలో కీలకపాత్ర పోషించాడనే అనుమానంతో విచారిస్తోంది.